School Assembly 12th
December Information
నేటి ప్రాముఖ్యత
అస్సాం రైఫిల్స్
స్థాపన దినోత్సవం.
చరిత్రలో ఈ రోజు
➥యువరాజ్ సింగ్, భారత
క్రికెట్ జట్టు క్రీడాకారుడి జననం
➥షావుకారు జానకి, రజినీకాంత్
& నూతన్ ప్రసాద్ వంటి ప్రజాదరణ నటుల పుట్టిన రోజు.
➥ఆంధ్ర భాషోద్ధారకుడు
అని గౌరవించబడిన మహానుభావుడు, ఆంధ్రాసాహిత్యాన్ని ప్రజ్వలింప జేసిన
ఘనుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి పి బ్రౌన్) వర్థంతి.
నేటి అంశము
హెలికాప్టర్ ఎలా
ఎగురుతుంది?
హెలికాప్టర్ కు 'రోటార్'
అనే పరికరం బిగించి ఉంటుంది. దీనికి ఫ్యాన్ లాగా రెక్కలు ఉంటాయి. ఈ
రోటర్ ను ఆన్ చేయడంతోనే రెక్కలు అత్యంత వేగంతో తిరుగుతాయి. హెలికాప్టర్ పైకి
లేచి గాలిలోకి ఎగురుతుంది. మీద నుండే స్పిన్నింగ్
రోటార్ హెలికాప్టర్ ను పైకి
లేపుతుంది. రోటార్ కు ఉండే బ్లేడ్స్ నిజానికి రెక్కల్లాంటివి. వీటికి వంపు ఉంటుంది.
రోటార్ రెక్కలు గిర్రున తిరిగినప్పుడు వంపు వల్ల గాలి వేగంగా కిందికి
ప్రవహిస్తుంది. దీంతో రోటార్ పై భాగంలో అల్పపీడనం ఏర్పడుతుంది. హెలికాప్టర్ పైకి లేస్తుంది.
రెక్కలు కోణాన్ని మార్చుకుంటూ హెలికాప్టర్
ను నిట్టనిలువుగా గాల్లోకి,
గాల్లోంచి నిట్టనిలువుగా కిందికి ప్రయాణించేట్లు చేయడం
సాధ్యపడుతుంది. ప్రయాణ దిశను కూడా మార్చుకునే వీలుంటుంది.
మంచి మాట
మనిషి తన చేతలతోనే
గొప్పవాడవుతాడు, జన్మతః కాదు – చాణక్యుడు
మంచి పద్యం
కొట్టుకొచ్చిన
కీర్తి కిరిటం
నిలుస్తుందా
శిరసుపైనా
అరువు తెచ్చిన
పెద్ధరికమూ
అతుకుతుందా మోమునా.!
నేటి జీ.కె
ప్రశ్న: రెండు
దంతాలుండే సీల్ లాంటి సముద్ర జీవి 'వాల్‌రస్' సహజ నివాసప్రాంతమేది?
జ: ఆర్కిటిక్
ప్రాంతం
వార్తలలోని
ముఖ్యాంశాలు
➥కేంద్రంలోని ఎన్డీఏ
సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం రాత్రి
ఆమోదం తెలిపింది. ఈ బిల్లు వేదనకు గురై శరణార్ధులుగా వచ్చినా ముస్లిమేతరులకు
పౌరసత్వాన్ని కల్పించడమే దీని ఉద్దేశం. ఇదిలా ఉండగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా
అసోం త్రిపుర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
➥మహిళలు బాలికల భద్రత
కోసం ఏపీ దిశ యాక్ట్ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం
మహిళలపై అత్యాచారం లాంటి తీవ్రమైన నేరాలకు తగిన ఆధారాలు ఉంటే 21 రోజుల్లో
నిదితునికి ఉరిశిక్ష పడనుంది.
➥ఇస్రో పీ.ఎస్.ఎల్.వి-సీ48 రాకెట్
ద్వారా 10 ఉపగ్రహాలను ఉపగ్రహాలను అంతరిక్షం లోకి ప్రవేశపెట్టింది. ఇస్రో వారి సోలార్
శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్ లో ఇది 50 ప్రయోగం.
➥దిశ హత్య కేసు మృతుల
ఎన్ కౌటర్ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
➥గుజరాత్ అల్లర్లలో
అప్పటి ముఖ్యమంత్రి (ప్రస్తుత ప్రధాని) నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రమేయం
ఏమీ లేదంటూ జస్టిస్ నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.
➥వెస్టిండీస్ తో మూడు
మ్యాచ్ ల టి-20 సిరీస్ ను 2-1 తో
చేజిక్కించుకుంది. బ్యాట్స్మెన్ చెలరేగడంతో బుధవారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 67
పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
School
Assembly,prayer songs,Assembly information,historical events,information of the
day,news of the day,golden words,today golden words,moral sentences,today's
importance,headlines in the news,december month school assembly day
wise,december 2019 school assembly,december 2019 school
assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని
ముఖ్యాంశాలు, 12th december 2019 assembly, 12th
december 2019 assembly,news of the day history,news
of the day highlights,12th
dec 2019 assembly, dec 12th assembly, dec 12th
historical events, 12th december 2019 assembly, december 12th assembly, december 12th historical events,school related
today assembly,school related today news, school related december 12th
information, school related december month information
0 Komentar