School Assembly 21st December Information
చరిత్రలో ఈరోజు
➥పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు హు
జింటావ్ పుట్టిన రోజు.
➥భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు కృష్ణమాచారి
శ్రీకాంత్ పుట్టిన రోజు.
➥రంగస్థలనటి, తెలుగు సినిమా
నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత దాసరి కోటిరత్నం మరణించిన రోజు.
నేటి అంశము:సోషల్ స్టడీస్
డబ్బు వాడకం ఎప్పుడు ప్రారంభమైంది?
చరిత్రకందని రోజుల నాటి విషయం..... అప్పట్లో మనుషులు తమ
కావలసిన వాటిని తామే స్వశక్తితో తయారు చేసుకునేవారు. క్రమంగా పంటలు పండిస్తూ, పల్లెటూర్లలో
కలిసి జీవించసాగారు. అలా జీవిస్తున్నప్పుడు వారు ఒక సంగతిని గ్రహించారు. మన వద్ద
ఉన్న వాటిని ఇతరులకు ఇచ్చి వారి వద్ద ఉన్న వేరే వాటిని తీసుకోవచ్చని గుర్తించారు.
ఇలా వస్తువులను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాన్ని వస్తు మార్పిడి విధానం (బార్టర్ సిస్టం) అంటారు. వస్తు మార్పిడికి డబ్బు అనేది చాలా సులభమైన మార్గమని ఇంకొంత కాలం
గడిచేసరికి వారికి అర్థమైంది.
తొలి డబ్బు
ఇరాక్ అని ఇప్పుడు
పిలిచే భూభాగంలో నివసించిన ప్రాచీన సుమేరియన్లు మట్టి టోకెన్లను డబ్బులు గా
వాడేవారు. టోకెన్ ఆకృతిని బట్టి వస్తువును, సైజును బట్టి
వస్తు పరిమాణాన్ని తెలుసుకునేవారు. చైనీయులు తొలుత గవ్వలను డబ్బులు గా వాడేవారు.
క్రీ. పూ. 600 నాటికి వారు లోహము నాణాలు తయారు చేసుకున్నారు. పార, కత్తి, ఆకృతుల్లో కంచు
నానాలు తయారు చేశారు.
సుభాషితం
అక్కరకురాని చుట్టము,
మ్రొక్కిన వరమీన వేల్పు, మోహరమునదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ.
భావం -అవసరమయిన సమయములో ఆదుకోని చుట్టము,ఎంత
ప్రార్దించినా వరమియ్యని దేవతా,మంచి యుద్దసమయములో తాను చెప్పినట్టు పరుగెత్తని
గుర్రములని వెంటనె విడిచిపెట్టవలెను.
వార్తలలోని ముఖ్యాంశాలు
➥ నెల్లూరు-తిరుపతి-చెన్నైలను
కలుపుతూ ఏర్పాటు కానున్న పారిశ్రామిక నడవా (ఇండస్ట్రియల్ కారిడార్)కు సిలికాన్
సిటీ అని పేరు పెడుతున్నట్లు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రకటించారు.
➥ సౌరశక్తి వినియోగం గురించి ప్రతి
ఒక్కరూ తెలుసుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని గవర్నర్ నరసింహన్
పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో సౌరశక్తి పలకలు ఏర్పాటు చేసుకునే రోజు రావాలని ఆయన
ఆకాంక్షించారు.
➥ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను
(ఈవీఎంలు) ట్యాంపర్ చేయడం సాధ్యం కానేకాదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)
సునీల్ అరోడా స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్ల విధానానికి తిరిగి వెళ్లే
ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.
➥ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్
మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వినియోగదారుల సమాచారం, ప్రైవేటు సందేశాలు, కాంటాక్టు సమాచారాన్ని
ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దాదాపు 150 టెక్ సంస్థలకు అందజేసినట్టు ఫేస్‌బుక్
అంతర్గత పత్రాల ద్వారా బయటకు పొక్కింది.
➥ టైమ్
మ్యాగజైన్ 2018 ఏడాదికి
సంబంధించి ప్రకటించిన అత్యంత ప్రభావశీల టీనేజర్ల కేటగిరీలో ముగ్గురు భారత సంత తి
విద్యార్థులు చోటు సంపాదించారు. ఇండో–అమెరికన్
కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, బ్రిటిష్–ఇండియన్
అమికా జార్జ్‌లు మొదటి 25 స్థానాల్లో
నిలిచారు. ప్యాంక్రియాటిక్ కేన్సర్‌ను నయం చేయగలిగే సామర్థ్యం ఉన్న అల్గారిథమ్‌ను
ఎనిమిదో తరగతి చదువుతున్న రిషబ్ జైన్ అభివృద్ధి చేశాడు. కావ్య కొప్పరపు
అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ మెదడు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారి మెదడు
కణజాలాన్ని క్షుణ్నంగా స్కాన్ చేయగలదు. ఇక అమికా జార్జ్ మహిళల కోసం ఫ్రీ పీరియడ్స్ అనే
కార్యక్రమానికి కృషి చేస్తోంది.
➥ అమెరికాలో భారత నూతన రాయబారిగా
హర్షవర్ధన్ ష్రగ్లాను నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్షవర్ధన్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్
అధికారి. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా నవ్‌తేజ్ సర్నా
కొనసాగుతున్నారు.
పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.
School
Assembly 21st December Information,School Assembly,prayer songs,Assembly
information,historical events,information of the day,news of the day,golden
words,today golden words,moral sentences,today's importance,headlines in the
news,December month school assembly day wise,December 2018 school
assembly,December 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 21st December 2018 assembly, 21st
December 2018 assembly,news of the day history,news of the day highlights,21st
dec 2018 assembly, dec 21st assembly, dec 21st historical events, 21st December
2018 assembly, december 21st assembly, december 21st historical events,school
related today assembly,school related today news, school related december 21st
information, school related december month information
0 Komentar