School
Assembly 24th December Information
నేటి ప్రాముఖ్యత
•అంతర్జాతీయ
జీవ వైవిధ్య దినోత్సవం.
•సెంట్రల్
ఎక్సయిజ్ డే.
చరిత్రలో
ఈరోజు
➥1986 వ సం.
పార్లమెంటు ఆమోదించిన 'వినియోగదారుల హక్కుల
రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ
వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
➥1925 వ సం.
అమెరికాకు చెందిన విమానాల ఇంజెన్ తయారు చేసే కంపెనీ ప్రాట్ & విట్నీ మొట్టమొదటి విమాన ఇంజెను తయారుచేయటం
పూర్తిచేసింది.
➥ బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి
మరియు రచయిత పుట్టిన రోజు.
➥ సినిమా నటుడు, తమిళనాడు మాజీ
ముఖ్యమంత్రి అయిన ఎం.జి.రామచంద్రన్ మరణించిన రోజు.
➥ప్రముఖ దక్షిణ భారత
సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో
అధినేత్రి, రచయిత్రి, గాయని మరియు
సంగీత దర్శకురాలు భానుమతి మరణించిన రోజు.
నేటి
అంశము:తెలుగు
కాలు
ముడుచుకోవడం అంటే ఏమిటి ?
ఆడవారు
కానీ మగవారు కానీ మూత్ర విసర్జనకు వెళ్లడాన్ని కాలు ముడుచుకోవడం అని అంటారు.
రాయలసీమ తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాటికి కూడా ఈ మాటను ఉపయోగిస్తున్నారు.
తెలుగువారి
వావివరసలు - వియ్యపురాలు
ఒక
తండ్రి తన కుమార్తెకు వివాహం చేస్తే ఆ కుమార్తె భర్త ఆ తండ్రికి అల్లుడు అవుతాడు.
అతని తల్లి కుమార్తె తల్లికి వియ్యపురాలు అవుతుంది. పిలుపులో మాత్రం వదిన గారు అని
సంబోధిస్తారు.
సుభాషితం:
మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత
నెపుడు దూఱకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు ;
నిర్మల మతినుంట లెస్స
నిజము కుమారా!
భావం - ఓ కుమారా! నీ
రహస్యములెప్పుడూ ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ
భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని
తెలుసుకో.
నేటి జీ.కే వేటిని జంట గ్రహాలు
అంటారు?
A: భూమి,శుక్రుడు
వార్తలలోని
ముఖ్యాంశాలు
➥
ఏటా
గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని, ఆ
నీటిని ఒడిసి పట్టేందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏ.పి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
➥ తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లలకు
జనవరి 22న ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
➥
కడప
ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ఏ.పి ముఖ్యమంత్రి వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ
ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని
చెప్పారు.
➥
అంతర్జాతీయ
క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్ లో
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 887 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో
నిలిచాడు. కోహ్లి సహచరుడు, వైస్‌కెప్టెన్ రోహిత్ (873) రెండో స్థానంలో
కొనసాగుతున్నాడు.
➥ జార్ఖండ్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్,
ఆర్జేడీల కూటమి మెజారిటీ సాధించింది. 81 స్థానాలున్న అసెంబ్లీలో 47
సీట్లను కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ 25
స్థానాలకే పరిమితమైంది.
➥వాషింగ్టన్
పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష విధిస్తూ సౌదీ
అరేబియా కోర్టు తీర్పునిచ్చింది. నేరాన్ని కప్పి ఉంచేందుకు యత్నించారన్న ఆరోపణ లపై
ఈ కేసులో మరో ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
➥పౌరసత్వ సవరణ చట్టానికి
అనుకూలంగా, వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో తమిళనాడు, కర్ణాటక,
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతోపాటు
ఈశాన్య రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించారు.
School Assembly 24th December Information, School
Assembly, prayer songs, Assembly information, historical events,information of the
day, news of the day, golden words, today golden words, moral sentences, today's
importance, headlines in the news, December month school assembly day
wise, December 2019 school assembly, December 2019 school assembly information,
today's topic, నేటి ప్రాముఖ్యత, చరిత్రలో ఈ రోజు, నేటి అంశము, మంచి మాట / పద్యం, వార్తలలోని
ముఖ్యాంశాలు, 24th
December 2019 assembly, 24th December 2019 assembly, news of the day
history,news of the day highlights, 24th dec 2019 assembly, dec 24th assembly,
dec 24th historical events, 24th December 20189assembly, december 24th
assembly, december 24th historical events,school related today assembly,school
related today news, school related december 24th information, school related
december month information
0 Komentar