School Assembly 28th
December Information
చరిత్రలో ఈరోజు
➥1885వ సం.లో భారత జాతీయ
కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.
➥1921 వ సం.లో
మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.
➥1859 వ సం. లోమొదటి
లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (ఇతడే భారతదేశంలో
ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
➥ప్రముఖ
పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ 1932 సం. లో
జన్మించారు.
➥ పారిశ్రామికవేత్త రతన్
టాటా 1937 సం. లో జన్మించారు.
➥ రాజకీయవేత్త ప్రస్తుత కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 1952 సం. లో జన్మించారు.
➥ చైనా కు చెందిన నొబుల్
శాంతి బహుమతి గ్రహీత లియూ క్సియాబొ పుట్టిన రోజు.
నేటి అంశము:
ఈజిప్ట్ మహిళా
చక్రవర్తి
ఈజిప్టు ను పాలించిన
కింగ్ Hatshepsut నిజానికి ఓ మహిళ. కింగ్ తుత్ మోస్-2 క్రీస్తుకు పూర్వం 1473 లో
అకస్మాత్తుగా చనిపోవడంతో అతని వారసుడు అయిన తుత్ మోస్-3 బాలుడు కావడంతో క్వీన్ Hatshepsut అధికార
పగ్గాలు చేపట్టింది. తన సవతి కొడుకు తుత్ మోస్-3కు తర్వాత కూడా పాలన అప్పగించకుండా
తననే కింగ్ గా ఆ రాణి ప్రకటించుకోవడం విశేషం. దాదాపు 20 ఏళ్ల పాటు
సాగిన ఆమె పాలనలో ఈజిప్టు శాంతి సుభిక్ష లతో విలసిల్లింది. ఈమె తన హయాంలో కళ లకు, ఆర్కిటెక్చర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది.
అంత గొప్ప ఈజిప్టు చరిత్ర లో ఆమె పేరు శతాబ్దాలపాటు గల్లంతయింది. దీనికి కారణం ఆమె
మరణానంతరం పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టిన కింగ్ తుత్ మోస్-3 తక్షణం తన సవతి తల్లి ని చక్రవర్తిగా తెలిపే
ఆనవాళ్లు ధ్వంసం చేయించాడు. శిల్పాలపై ఆమె పేరును చెరిపించాడు. రాజరికపు చిహ్నాలతో ఉన్న ఆమె ప్రతిమలను
పగులగొట్టించాడు.
మంచి మాట:
నిరాడంబరత
స్నేహితుల్ని పెంచితే గర్వం శత్రువుల్ని పెంచుతుంది- ఎమర్సన్
మంచి
పద్యం
దివ్యమైన ప్రేమ దివికి సమమ్మురా
అమ్మ ప్రేమ కేది హద్దు లేదు
అమ్మ ప్రేమ పొందు అద్వితీయముగను
కరుణజూపుతల్లి కల్పవల్లి
నేటి జీ.కె.
జంతర్ మంతర్ ఉన్న చోటు?
దివ్యమైన ప్రేమ దివికి సమమ్మురా
అమ్మ ప్రేమ కేది హద్దు లేదు
అమ్మ ప్రేమ పొందు అద్వితీయముగను
కరుణజూపుతల్లి కల్పవల్లి
నేటి జీ.కె.
జంతర్ మంతర్ ఉన్న చోటు?
A: న్యూ
ఢిల్లీ
వార్తలలోని
ముఖ్యాంశాలు
➥
పౌరసత్వ సవరణ
చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) దేశవ్యాప్త అమలు
ప్రతిపాదనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం
మరింత తీవ్రమైంది.
➥రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని
నిర్మాణంపై అధ్యయనం చేసిన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదికల్లోని అంశాల పరిశీలనకు హైపవర్
కమిటీని ఏర్పాటు చేయాలని ఏ.పి. మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
➥ ఏ.పి.
స్థానిక సంస్థల ఎన్నికలు 2011 జనాభా గణన ఆధారంగా బీసీలకు 34%, ఎస్సీలకు 19.08% , ఎస్టీలకు 6.77% మొత్తం 59.85% రిజర్వేషన్ల
దామాషా నిర్వహణకు మంత్రి వర్గం ఆమోదం.
➥ అంగన్‌వాడీ కేంద్రాల్ని ప్రీ
ప్రైమరీ స్కూళ్లుగా మార్చి ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించేలా సదుపాయాలు
కల్పించాలని ఏ.పి. సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
➥
పోలవరం ప్రాజెక్టు పనులను హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు
చేసిన నిపుణుల కమిటీ శనివారం నుంచి మూడు రోజులపాటు పరిశీలించనుంది.
➥శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు
వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన నిలయంలో ‘ఎట్‌హోం’కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఇందులో గవర్నర్ తమిళిసై, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.
➥పదో తరగతి నకిలీ మెమోలను
అరికట్టేందుకు 10వ తరగతి మెమోలపై ఇకపై క్యూఆర్ కోడ్ పొందుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వ
పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది.
➥
➥ ఏ.టీ.ఎం మోసాలకు చెక్
పెట్టేందుకు ఎస్‌బీఐ నడుంబిగించింది. జనవరి 1 నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఏటీఎంలో రూ.10వేలు, అంతకు పైబడి నగదు ఉపసంహరణకు ఓటీపీని ఎంటర్
చేయాల్సి ఉంటుంది.
School
Assembly 28th December Information, School Assembly,prayer songs, Assembly
information,historical events,information of the day, news of the day,golden
words, today golden words, moral sentences,today's importance, headlines in the
news, December month school assembly day wise, December 2019 school
assembly, December 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత, చరిత్రలో ఈ రోజు,నేటి అంశము, మంచి మాట / పద్యం,వార్తలలోని
ముఖ్యాంశాలు, 28th
December 2019 assembly, 28th December 2019 assembly, news of the day
history,news of the day highlights, 28th dec 2018 assembly, dec 28th assembly,
dec 28th historical events, 28th December 2018 assembly, december 28th
assembly, december 28th historical events, school related today assembly, school
related today news, school related december 28th information, school related
december month information
0 Komentar