Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 29th December Information

School Assembly 29th December Information


నేటి ప్రాముఖ్యత
మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్‌ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్‌ ఏర్పాటయింది.
1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ 1808 సం.లో జన్మించారు.
ప్రముఖ ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్ 1910 సం.లో జన్మించారు.
తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి అయిన టీ.జి. కమలాదేవి 1930 సం.లో జన్మించారు.
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని అయిన కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు 2016 సం.లో మరణించారు.
 నేటి అంశము:
ఒలింపిక్ క్రీడలు-చరిత్ర 
ఒలింపిక్ క్రీడలు ప్రప్రథమంగా క్రీ.పూ. 776లో గ్రీసు  దేశంలోని ఒలింపియాలో జరిగినవి. ఇవి క్రీ.శ. 395లో 'రోమన్ చక్రవర్తి అయిన థియోడోసియన్  నిషేధించే వరకు జరిగినవి.
తరువాత ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ దేశస్తుడైన బేరన్ పియరీ డీ కౌబర్టీస్ కృషి ఫలితంగా క్రీ.శ. 1896లో ఒలింపిక్ క్రీడలు గ్రీసుదేశంలోని ఏథెన్స్ నగరంలో జరిగినవి. నాటి నుండి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుచున్నవి. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడల్లో 13 దేశాలకు చెందిన క్రీడకారులే పాల్గొన్నారు. 1990లో పారిస్లో జరిగిన రెండవ ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం మొదటి సారిగా పాల్గొని రెండు రజత పథకాలు గెలుచుకొన్నది.


సుభాషితం
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం - ఎంతో విలువయిన బంగారం శబ్ధం అంత విలువ లేని కంచు కంటే ఎలా తక్కువగా ఉండునో అలాగే మంచి వాని మాటలు చాలా చల్లగా నిరాడంబరంగా ఉంటే చెడ్డ వాని మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది.
వార్తలలోని ముఖ్యాంశాలు
పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయులను  అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. రూ.10,000 కోట్ల బడ్జెట్‌తో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా ముగ్గురు వ్యోమగాముల బృందం అంతరిక్షంలో కనీసం వారంరోజుల పాటు గడపనుంది.
చిన్నారులపై లైంగిక నేరాలను నిరోధించేందుకు కేంద్రం తెచ్చిన పోక్సో చట్టం–2012 పటిష్టం కానుంది. 18 ఏళ్లలోపు అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగికదాడికి పాల్పడేవారికి మరణదండన విధించేలా పోక్సో చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది.
జనవరి ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా నియమితులైన జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, 12 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సాంస్కృతిక పునరుజ్జీవ విలువలను కాపాడుకునే ఉద్దేశంతో కేరళలో జనవరి 1న దాదాపు 30 లక్షల మంది మహిళలతో ఉమెన్స్‌ వాల్కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సుమారు 620 కిలోమీటర్ల మేర ఉండనున్న ఈ ప్రదర్శనను పలు స్వచ్ఛంద సంస్థల సాయంతో కేరళ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబరు కాలంలో రూ. 38,896కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) ఎగవేతలు గుర్తించినట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా గడిచిన ఆర్ధిక సంవత్సరం 2017-18 బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు రూ.10.39 లక్షల కోట్లకు చేరాయి.
ప్రొస్టేట్‌ కేన్సర్‌పై ప్రచారం నిర్వహించి కేవలం గంట వ్యవధిలో 487 మందికి అవగాహన కల్పించినందుకు గుర్తింపుగా హైదరాబాదు లోని ప్రభుత్వ ఆధీనం లో నడిచే ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించింది.



పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.



  • SCHOOL ASSEMBLY:29th Dec(నేటి ప్రాముఖ్యత ,చరిత్రలో ఈరోజు,నేటి అంశము ,సుభాషితం )
  • SCHOOL ASSEMBLY:29th Dec(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 29th December Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,December month school assembly day wise,December 2018 school assembly,December 2018 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 29th December 2018 assembly, 29th December 2018 assembly,news of the day history,news of the day highlights,29th dec 2018 assembly, dec 29th assembly, dec 29th historical events, 29th December 2018 assembly, december 29th assembly, december 29th historical events,school related today assembly,school related today news, school related december 29th information, school related december month information
    Previous
    Next Post »
    0 Komentar

    Google Tags