Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 11th January Information

School Assembly 11th January Information


నేటి ప్రాముఖ్యత 
జాతీయ విద్యాదినోత్సవం
చరిత్రలో ఈరోజు
➥1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
1922: మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.
1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 
1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ చేసి, రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం చేసారు.
భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్ 1973 వ సం.లో జన్మించారు.
భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి లాల్ బహాదుర్ శాస్త్రి 1966 వ సం.లో మరణించారు.
భారతపారిశ్రామిక వేత్త మరియు విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా 1983 వ సం.లో మరణించారు.
టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ 2008 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
సునామీకి ముందు సముద్రం వెనక్కు ఎందుకు వెళ్తుంది?
సునామీకి ముందు కొన్నిసార్లు సముద్రం కొన్ని మీటర్లు వెనక్కు వెళ్తుంది. అయితే సునామీ వచ్చే ప్రతీసారీ ఇలాగే జరగదు. ప్రతీ అలకూ రెండు దశలుంటాయి. ఒకటి ముందుకు రావడం, రెండోది వెనక్కు వెళ్లడం. సునామీ అలా ఎక్కడో తీరానికి దూరంలో, సముద్రం మధ్యలో ముందుగా మెల్లగా మొదలవుతుంది. ఆ తర్వాత అది దశలవారీగా పరిమాణం పెంచుకుంటూ తీరంపై భారీ ఎత్తున ఎగసిపడుతుంది. తీరానికి వచ్చే అల ముందుగా ముందుకు వచ్చి తర్వాత వెనక్కు వెళ్లేది అయితే సముద్రం వెనక్కు వెళ్లదు. ఒక్కసారిగా సునామీ వచ్చి మీదపడుతుంది. అదే తీరానికి వచ్చే అలా ముందు వెనక్కు వెళ్లి తర్వాత ముందుకు వచ్చేది అయితే సముద్రం సాధారణం కన్నా బాగా వెనక్కు వెళ్లి మళ్లీ పెద్ద అలగా వస్తుంది. 
సుభాషితం:
శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులుబుట్ట నుడివెద సుమతీ.
భావం - మంచిబుద్ది కలవాడా ! శ్రీరాముని కరుణ చేత,ప్రజలందరూ మెచ్చునట్లు అందరికీ హితమయున నీతులు చెప్పుము.


వార్తలలోని ముఖ్యాంశాలు
అవినీతి, విధులు పట్ల అలసత్వం వంటి ఆరోపణలున్నట్లు కేంద్ర నిఘా కమిషన్‌(సీవీసీ) సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను పదవి నుంచి తప్పించింది. సీబీఐ పగ్గాలను తాత్కాలికంగా అదనపు డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావుకు ప్రభుత్వం అప్పగించింది. ఆలోక్‌ వర్మను కేంద్ర హోంశాఖ పరిధిలో అగ్నిమాపక సేవలు, సివిల్‌ డిఫెన్స్‌, హోంగార్డుల డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది.
అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ జరపనున్న అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ వైదొలిగారు. దీంతో ఈ నెల 29న కొత్త ధర్మాసనం ఏర్పాటు కానుంది.
చిన్నవ్యాపారులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)లో మినహాయింపు పరిమితిని రూ.40 లక్షలకు కేంద్రం పెంచింది. అంటే రూ.40 లక్షల వార్షిక టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు ఎలాంటి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అంకుర ప్రాంత అభివృద్ధి ప్రదేశంలో అమరావతి అభివృద్ధి భాగస్వామి (ఏడీపీ) చేపట్టే వెల్‌కమ్‌ గ్యాలరీనిర్మాణానికి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.
దేశంలోనే ప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ ఒక రాష్ట్రం - ఒక నంబర్‌విధానం అమలులోకి తీసుకురానున్నది. దీనితో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు అన్ని జిల్లాల్లో వాహనాలకు ఒకే సిరీస్‌ నంబర్‌ కేటాయిస్తారు మరియి వాహనాన్ని ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు. 
తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదిలావుండగా రెండో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న 4,137 పంచాయతీలకు శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.
బంగ్లాదేశ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి రూ.500కోట్లు చోరీ చేసిన కేసులో ఫిలిప్పీన్‌కు చెందిన మాజీ బ్యాంకు ఉద్యోగినికి అక్కడి న్యాయస్థానం రూ.700కోట్ల భారీగా జరిమానా విధించింది. ఫిలిప్పీన్‌ బ్యాంక్‌ రిజాల్‌ కమర్షియల్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌(ఆర్‌సీబీసీ)లో పని చేస్తున్న మైయా డిగుటో 2016లో షాడో హ్యాకర్లతో చేతులు కలిపి ఈ దోపిడీకి పాల్పడింది. 


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:11th January(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,సుభాషితం)
  • SCHOOL ASSEMBLY:11th January(వార్తలలోని ముఖ్యాంశాలు)

  • School Assembly 11th January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 11th January 2019 assembly, 11th January 2019 assembly,news of the day history,news of the day highlights,11th dec 2019 assembly, dec 11th assembly, dec 11th historical events, 11th January 2019 assembly, january 11th assembly, january 11th historical events,school related today assembly,school related today news, school related january 11th information, school related january month information, School Assembly 11th Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 11th Jan 2019 assembly, 11th Jan 2019 assembly,news of the day history,news of the day highlights,11th dec 2019 assembly, dec 11th assembly, dec 11th historical events, 11th Jan 2019 assembly, jan 11th assembly, jan 11th historical events,school related today assembly,school related today news, school related jan 11th information, school related jan month information

    Previous
    Next Post »

    1 comment

    1. Pl.English news link should provided for the sake english medium students

      ReplyDelete

    Google Tags