School Assembly 23rd January Information
నేటి ప్రాముఖ్యత
సుభాష్‌చంద్రబోస్ జయంతి, దేశభక్తి దినోత్సవం
చరిత్రలో ఈరోజు
➥1565: తళ్లికోట యుద్ధము
➥1556: చైనాలోని షాంగ్జీ ప్రాంతంలో సంభవించిన ఘోర భూకంపంలో ఎనిమిది లక్షల మందికి
పైగా మరణించారు.
➥1950: ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్ జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది.
➥ప్రముఖ
స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 1897 వ సం.లో జన్మించారు.
➥ప్రముఖ
గణితశాస్త్రజ్ఞడు మరియు శివపూజా దురంధురుడు ముదిగొండ విశ్వనాధం 1906 వ సం.లో జన్మించారు.
➥ప్రముఖ
ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ 1915 వ సం.లో జన్మించారు.
నేటి అంశము:
రుబిడియం
వేడుకల్లో బాణ సంచా కాలుస్తాం కదా.. అవి పేలినప్పుడు ఊదా, ఎరుపు
రంగులు కనిపించాయనుకోండి, ఆ రంగులకు కారణం రుబిడియమే.
ద్రవరూపంలో ఉంటుందీ మూలకం. ఇదెంత సున్నితమైనదంటే... కొంచెం ఎక్కువ వేడి సోకితే
ఇట్టే కరిగిపోతుంది.
1861 ముందు వరకూ దీని గురించి ప్రపంచానికి తెలియదు.
జర్మనీకి చెందిన రాబర్ట్ బున్సెన్, గుస్తవ్ కిర్చొప్ అనే
శాస్త్రవేత్తలు స్పెక్ట్రోస్కోప్ పద్దతి ద్వారా లెపిడోలైట్ అనే ముడి ఖనిజం మీద
ప్రయోగాలు చేశారు. అప్పుడు రెండు ముదురు ఎర్ర రంగు స్పెక్ట్రల్ గీతలను
కనుగొన్నారు.
ఆ రకంగా కొత్త మూలకం ఆచూకీ బయటపడింది. దీనికి 'రుబిడియం'
అని పేరు పెట్టారు. 'రుబిడస్' అంటే లాటిన్ భాషలో ముదురు ఎర్ర రంగు అని అర్థం.
మంచి మాట:
లేని వాటిని గుర్తు తెచ్చుకుని బాధపడటం కంటే ఉన్న వాటిని
గుర్తుచేసుకుని ఆనందంగా ఉండగలగడమే తెలివైనవారి లక్షణం- రామకృష్ణ పరమహంస
వార్తలలోని ముఖ్యాంశాలు
*విత్తనం దగ్గర నుంచి పంట
అమ్ముకునే వరకు రైతుకు అవసరమైన సాయాన్ని అందించేందుకు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 11,158
రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఏ.పి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
స్పష్టం చేశారు.
*రాజధాని అమరావతి భూముల
కొనుగోళ్లలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలంటూ
ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది.
*ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర
సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి
పంపుతూ నిర్ణయం తీసుకున్నారు.
*తెలంగాణ రాష్ట్రంలోని 120
మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం నిర్వహించిన పోలింగ్
ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎన్నికల సంఘం
ప్రకటించింది.
*తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్
వొకేషనల్ కోర్సులు చదువుతున్న, ఇప్పటికే చదువుకున్న విద్యార్థులకు
శుభవార్త. 4ఏళ్ల తర్వాత మళ్లీ వారి కోసం ఇంటర్ విద్యాశాఖ అప్రెంటిస్‌షిప్
విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
*ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే
జేఈఈ అడ్వాన్స్ డ్ కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల కటాఫ్ పర్సంటైల్ ఈసారి
ఓపెన్ కేటగిరీలో 86.19 వరకు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
*కశ్మీర్ వివాదాన్ని
పరిష్కరించేందుకు.. అవసరమైతే బాసటగా ఉంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ప్రకటించారు.
*చైనాను వణికిస్తున్న ప్రాణాంతక
కరోనా వైరస్ భారత్‌లో ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్షించి, వారిలో
ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్ లేదని నిర్ధారించారు.
*వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు
నిత్యానందపై అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ
చేసింది.
*స్వేచ్ఛతో కూడిన ఉచిత ఇంటర్నెట్
ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అందించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అభిప్రాయం
వ్యక్తం చేశారు.
* ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్
టోర్నీ లో రోజర్ ఫెడరర్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 6–1, 6–4, 6–1తో ప్రపంచ 41వ ర్యాంకర్ ఫిలిప్ క్రాజినోవిచ్
(సెర్బియా)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా
(జపాన్), మాజీ విజేత సెరెనా విలియమ్స్ (అమెరికా), టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.
School Assembly 23rd January Information, School Assembly, prayer songs, Assembly information, historical events,information of the day, news of the day, golden words,today golden words, moral sentences,today's importance, headlines in the news, January month school assembly day wise, January 2020 school assembly, January 2020 school assembly information, today's topic
0 Komentar