School Assembly 24th January Information
చరిత్రలో ఈరోజు
➧1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.
➧1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం
స్వీకరించింది.
➧1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.
➧సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా 1966 వ సం.లో మరణించారు.
➧ప్రముఖ తెలుగు కవి, పండితులు పువ్వాడ శేషగిరిరావు 1981 వ సం.లో
మరణించారు.
నేటి అంశము:
స్విప్ట్
లెట్ పక్షుల గూళ్లు
స్విప్ట్ లెట్
పక్షుల గూళ్లు నీటిలో కరుగుతాయనే విషయాన్ని 1750
సం.లో 'హో ఎయాంగ్' కని
పెట్టాడు. తరువాత 18వ శతాబ్దానికల్లా చైనీయులంతా ఈ గూళ్లని
నానబెట్టి, చక్కెర కలిపి, జెల్లీలా
చేసుకుని తినటం మొదలెట్టారు. అప్పట్లో దాని విలువ బంగారం ధరలో సగముండేదట.
చైనీయులకి ఎంతో ఇష్టమైన ఈ పిట్ట గూళ్లను ఒక కిలోకు దాదాపు వెయ్యి డాలర్లకు పైగా
ఖరీదు కడతారు. ఈ సూప్ ను 'కేవియర్ ఆఫ్ది ఈస్ట్' అని పిలుచుకుంటారక్కడ.
సుభాషితం:
కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ.
భావం - బంగారపు సిమ్హసనములో మంచి ముహూర్త బలమున
కుక్కను తీసుకు వచ్చి కూర్చోపెట్టినా దాని గుణము ఎలా మార్చుకోదో అధేవిధంగా
అల్పుడుకు ఎంత గౌరవము ఇచ్చినా సరే తన నీచత్వమును వదలడు.
నేటి
సూక్తి
భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి
భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.
నేటి జీ.కే.
గణతంత్ర వ్యవస్థను ఏదేశ రాజ్యాంగం నుండి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందు పరిచారు?
జ..ఫ్రాన్స్
వార్తలలోని
ముఖ్యాంశాలు
> ఏ.పి. శాసనమండలి రద్దు దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ లో చేసిన “ప్రజలకు మేలు చేసే విధంగా లేని శాసనమండలిని కొనసాగించాలా లేక రద్దు చేయాలా అన్న వ్యాఖ్యలు” దీనిని ధృవీకరిస్తున్నాయి.
>ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం (సవరణ) బిల్లుకు శాసనమండలి సూచించిన సవరణలను తోసిపుచ్చుతూ శాసనసభ లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందినది.
>2019 సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘ఉత్తమ ఎన్నికల నిర్వహణ’అవార్డుకు ఎంపికైంది.
>తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది. ‘వరల్డ్ ఎకనామిక్ లీడర్స్’ సమావేశానికి హాజరైనవారిలో రాష్ట్ర మంత్రి స్థాయిలో కేటీఆర్ ఒక్కరే కావడం గమనార్హం.
>అంతర్జాతీయ భాష , సాహిత్య, సాంస్కృతిక సమాహారం “హైదరాబాద్ సాహిత్యుత్సవం” దశాబ్ది వేడుకలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సుప్రసిద్ధులైన వ్యక్తులు, సంస్థలు ఈ వేడుకల్లో పాల్గొంటాయి.
> తెలంగాణలోని ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్‌సెట్ పరీక్షల తేదీలు మారాయి. ఎంసెట్ (ఇంజనీరింగ్) మే 4, 5, 7 తేదీల్లో జరుగనున్నది.
>తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఈ రోజు నుండి ఈ నెల 30 వరకు అధికారికంగా జరుగనున్నది.
>చంద్రుడిపై ఉండే దుమ్ము, ధూళి (మూన్‌డస్ట్) నుంచి ఆక్సిజన్‌ను రూపొందించే సరికొత్త వ్యవస్థను యూరోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్‌ఏ) అభివృద్ధి చేస్తున్నది.
>ప్రజాస్వామ్య సూచీ 2019 ప్రపంచ ర్యాంకింగ్ లో భారత్ 6.90 స్కోరు సంపాదించి 51వ స్థానంలో నిలిచింది.
>నిర్భయ ఘటనలో దోషులను ఆఖరి కోరిక ఏమిటని ప్రశ్నించగా నలుగురిలో ఏ ఒక్కరు కూడా సమాధానమివ్వలేదు. వీరికి ఫిబ్రవరి 1వ తేదీన ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు.
>ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఈసారి టైటిల్‌పై కన్నేసిన కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మరో విజయంతో రెండో రౌండ్‌ను దాటేసింది. మహిళల సింగిల్స్‌లో జెలీనా ఒస్టాపెంకోకు మళ్లీ నిరాశ ఎదురైంది. 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయిన లాత్వియా స్టార్ మూడో రౌండ్లలో నిస్క్రమించింది. స్పానిష్ దిగ్గజం రాఫెల్ నాదల్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు.

School Assembly 24th January Information, School Assembly, prayer songs, Assembly information, historical events, information of the day, news of the day, golden words, today golden words, moral sentences
0 Komentar