Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 28th January Information

School Assembly 28th January Information


చరిత్రలో ఈరోజు
1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత లాలా లజపతిరాయ్ 1865 వ సం.లో జన్మించారు.
ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వెంకట సీతాపతి 1885 వ సం.లో జన్మించారు.
భారత అణు శాస్త్రవేత్త రాజారామన్న 1929 వ సం.లో జన్మించారు.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ అరిందమ్ సేన్‌గుప్తా 2016 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
సామెత కథ: చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు..
రామాయణంలో రాముడు.. సీత ఎక్కడుందో చూసిరమ్మని ఆంజనేయుడిని పంపిస్తాడు. హనుమ లంకలో ఉన్న సీతను కని పెట్టడమే కాదు, లంకా నగరం మొత్తాన్ని కాల్చి వస్తాడు. అలాగే ఎవరైనా చెప్పిన పని మాత్రమే కాకుండా, చెప్పని పనులను చేసి వచ్చినా, అలా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారినైనా ఉద్దేశించి.. ఈ సామెతను చెబుతారు.
సుభాషితం:
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్‌
తెప్పలుగ జెఱువు నిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.
భావం: చరువులో నిండా నీరు చేరినపుడు వేల కొలది కప్పలు ఎలా అయితే చేరునో అలాగే సంపద కలిగినపుడు భందువులు కూడా అలానే చేరును.
నేటి జి.కే
నీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగపడే వాయువు?
జ. క్లోరిన్


వార్తలలోని ముఖ్యాంశాలు
*ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది.
*తెలంగాణరాష్ట్రంలో సోమవారం జరిగిన చైర్మన్లు, మేయర్ల ఎన్నికల్లో 110 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లను టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. మిగిలిన 8 మున్సిపాలిటీ లలో కాంగ్రెస్‌కు 4, బీజేపీ, ఎంఐఎంలకు రెండేసి మున్సిపల్‌ పీఠాల చొప్పున దక్కాయి.
*సంచలనం సృష్టించిన హజీపూర్‌ వరుస హత్యల కేసులో తీర్పును ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు నల్గొండ కోర్టు సోమవారం ప్రకటించింది.
*టీవీల్లో వచ్చే చెత్త సీరియళ్లను చూస్తూ కాలాన్ని వృథా చేసుకోకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు.
*దేశానికి రిజర్వుడ్‌ ఆర్మీ దళం ఉన్నట్లుగానే వైద్య దళాన్ని సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం అత్యంత కీలకమైన సిఫార్సు చేసింది.
*తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియా సంస్థలోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
*చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి సోమవారం వరకు 81 మంది చనిపోయారు. 2,744 మందికి ఈ వైరస్‌ సోకినట్లు ధ్రువీకరించారు.
*బోడోలకు ప్రత్యేక రాష్ట్రం కోసం అసోంలో పోరాడుతున్న తీవ్రవాద గ్రూపులైన నేషనల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ బోడో ల్యాండ్‌, ఆల్‌ బోడో స్టూడెంట్స్‌ యూనియయన్‌ తో కేంద్రం ఒప్పందం చేసుకుంది.
*అఫ్గాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఘజ్ని ప్రావిన్స్‌ లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. ఎంత మంది మరణించారో అధికారిక వివరాలు వేలుబడలేదు.
*అమెరికన్‌ సూపర్‌స్టార్‌ అయిన 41 ఏళ్ల బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబీ బ్రయాంట్‌  హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించాడు.
School Assembly 28th January Information, School Assembly,prayer songs, Assembly information, historical events, information of the day, news of the day,golden words, today golden words, moral sentences, today's importance, headlines in the news, January month school assembly day wise, January 2020 school assembly, January 2020 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత, చరిత్రలో ఈ రోజు, నేటి అంశము, మంచి మాట / పద్యం, వార్తలలోని ముఖ్యాంశాలు, 28th January 2020 assembly
Previous
Next Post »
0 Komentar

Google Tags