Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 8th January Information

School Assembly 8th January Information


చరిత్రలో ఈరోజు
1025 : సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
1965 : అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' తిరిగి లభ్యమైంది.
1995: ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.
ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ 1942 వ సం.లో జన్మించారు.
ప్రముఖ ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో 1642 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు రకాల అంకెల వ్యవస్థ అమలులో ఉన్నది.
1. దశాంశ పద్ధతి: '0' నుండి '9' వరకు అంకెలు ఉన్న పద్దతిని దశాంశ పద్దతి అని అంటారు. దీనినే అరబిక్ పద్దతి అని కూడా మరికొందరు అంటారు.
2. రోమన్ పద్ధతి: ప్రాచీన నాగరికతలలలో హిందూ దశాంశమాన పద్దతి ప్రచారం కాక పూర్వం బాగా ఉపయోగంలో ఉన్నది 'రోమన్ పద్దతి'. ఇది ఇంగ్లీషు (లాటిన్) అక్షరాలు I, V, X, L, C, M (1, 5, 10, 50 100, 1000) ఆధారంగా రూపము ఏర్పరచుకున్నవి. రోమన్ పద్దతిలో I అనే ఇంగ్లీషు అక్షరం 1 సూచిస్తుంది. 2 రాయాలంటే II అలాగే 3కి III ఇక 'V' 5ను సూచిస్తాయి. 'X' పదిని, L 50ని, 'C' 100ని, 'D' 500ని, 'M' 1000ని సూచిస్తాయి. ఈ అక్షరాల మార్పులవల్ల ఇతర సంఖ్యలు ఏర్పడతాయి.
3.బైనరీ పద్ధతి: దీనినే ద్విసంఖ్యామానము అని కూడా అంటారు. ప్రాచీన భారతీయులు 'చంధస్సు'లో బాగా ఉపయో గించారు. ఆధునికంగా కంప్యూటర్లలో వాడే భాషలకు 0, 1 గల బైనరీ పద్దతే ఆధారం.
మంచి మాట:
బాధ్యతగా జీవించినప్పుడే మనం, మన చుట్టూ ఉన్న వారు ఆనందంగా ఉంటాం...
మంచి పద్యం
మృగమదంబు చూడ మీఁద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నప్పటికి దాని సువాసన నాలుగు దిక్కులకు వెదజల్లునట్లు పెద్దలైన వారు బయటికి ఆడంబరముగ కనపడక గొప్ప గుణములు కలవారై ఉండురు.
నేటి జీ.కె
ప్రశ్న: 'శిలాదిత్యుడు' అనే బిరుదు ఎవరికి ఉంది?
జ: హర్షవర్ధనుడు


వార్తలలోని ముఖ్యాంశాలు
నేడు భారత్‌ బంద్‌: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి.
ఏ.పి. లో అధికార వికేంద్రీకరణతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హై పవర్‌ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను ఒడిసి పట్టి, దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు, కాలువల విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఏ.పి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
తెలంగాణలోని మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 120 మున్సిపాలిటీలతో పాటు 9 కార్పొరేషన్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి.
వరంగల్‌ జిల్లాలోని మడికొండ ఐటీ సెజ్‌లో నిర్మించిన టెక్‌ మహీంద్ర, సైయంట్‌ ఐటీ సెంటర్లను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తున్నామని తెలిపారు.
అమెరికా డ్రోన్‌ దాడిలో మృతి చెందిన ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ అంతిమయాత్రలో జరిగిన తొక్కిసలాటలో 50 మంది మరణించగా మరో 200 మంది వరకు గాయపడ్డారని ఇరాన్‌ మీడియా వెల్లడించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు మంగళవారం డెత్‌ వారెంట్లు జారీ చేసింది.
కేంద్ర గణాంక కార్యాలయం ముందస్తు అంచనాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)  5 శాతం వృద్ధిని  నమోదు చేయనుంది. ఇది 11 ఏళ్ల కనిష‍్టం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, భారత ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు వైట్‌హౌజ్‌ తెలిపింది. అమెరికాభారత్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ భద్రతా వ్యవహారాలను సమీక్షించినట్లు తెలిపింది.

  శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది.
School Assembly 8th January Information, School Assembly, prayer songs, Assembly information, historical events, information of the day, news of the day, golden words, today golden words, moral sentences, today's importance
Previous
Next Post »
0 Komentar

Google Tags