School Assembly 9th January Information
నేటి ప్రాముఖ్యత
ప్రవాస భారతీయుల దినోత్సవం
చరిత్రలో ఈరోజు
➥ప్రవాస
భారతీయుల దినోత్సవం. 1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి
భారత్‌కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా
జరుపుతున్నది.
➥1969: మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది.
➥1982: భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి అంటార్కిటికాను చేరింది.
➥నోబెల్
బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా 1922 వ సం. లో జన్మించారు.
➥ఇండియాలో
1995 వ సం. లో దేవేంద్ర హర్నె మరియు
ప్రణమ్య మెనారియ 25 వేళ్ళతో (12
చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) జన్మించారు.
నేటి అంశము: కాంతి సంవత్సరం
గ్రహ, నక్షత్ర, నెబ్యూలాల
దూరాలను కనుగొనడానికి కాంతి సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకొన్నారు.
కాంతి ఒక సంవత్సరంలో పోయే దూరాన్నే కాంతి సంవత్సరమంటారు. ఒక
సంవత్సరంలో కాంతి 5,87,458 కోట్ల 91
లక్షల 52 వేల మైళ్ళ దూరం పోతుంది. (కాంతి వేగం సెకనుకు : 1,86,282 మైళ్ళు) ఒక నక్షత్రం మనకు 5,87,458 కోట్ల 91 లక్షల 52 వేల మైళ్ళ దూరంలో ఉందనుకోండి, దాన్ని మనం 1 కాంతి సంవత్సర దూరంలో ఉందని అంటాం. ఈ
ప్రమాణం వల్ల దూరం అర్ధం చేసుకోడానికి తేలికగా ఉంటుంది. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు
అత్యంత పెద్ద టెలిస్కోపు ద్వారా 12 వందల కోట్ల కాంతి
సంవత్సరాల దూరాన్ని చూడగలుగు చున్నారు. మనకు అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు.
భూమికి సూర్యుడు 9 కోట్ల 30 లక్షల
మైళ్ళ దూరంలో ఉన్నాడు.
సుభాషితం:
ఎలుకతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ
భావం - ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా
దాని సహజసిద్ధమయిన నలుపు రంగే ఉంటుంది గానీ తెల్లగా మారదు.అలాగే చెక్కబొమ్మ తెచ్చి
దానిని ఎన్ని సార్లు కొట్టినా సరె మాట్లాడదు.(దీని అర్ధం ఎమనగా సహజ సిద్ద
స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)
మంచి మాట
"ఆశయం ఎంత
మంచిదైనా ఆచరణ లేకపోతే వృధా, ఆచరణ ద్వారా అద్భుతాలు
సృష్టించవచ్చు"
నేటి జీ.కె
ప్రశ్న: 'కవితాగుణార్ణవుడు' అనే బిరుదు
ఎవరిది?
జ: పంపకవి
వార్తలలోని ముఖ్యాంశాలు
> ఏ.పి. రాష్ట్ర
ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మఒడి’ని నేడు చిత్తూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. పిలల్ని
బడికి పంపే దాదాపు 43 లక్షల మంది తల్లులకు
ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం ఈ పధకం ద్వారా అందించనున్నారు.
> ఫిబ్రవరి నుంచి
లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం మొదలు కావాలని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వలంటీర్ల ద్వారా
నేరుగా చేరవేయాలన్నారు.
> ఏ.పి. స్థానిక
సంస్థల ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్
ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
> స్టార్టప్,
ఇన్నొవేషన్ రంగాల్లో తెలంగాణ దేశం లోనే ముందు వరుసలో ఉందని,
టీ హబ్, వీ హబ్ వంటి ఇంక్యుబేటర్లు సమర్థవంతంగా
పనిచేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక
రామారావు వెల్లడించారు.
> హైదరాబాద్
కేంద్రంగా వచ్చే నెలలో జరిగే బయో ఏసియా 17వ సదస్సులో భాగంగా ‘స్టార్టప్ స్టేజ్’ వేదికగా లైఫ్ సైన్సెస్,
హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం నిర్ణయించింది.
> తెలంగాణ ఆర్టీసీ
పరిధిలో హైదరాబాద్‌లో దాదాపు 800 బస్సులను తగ్గించిన అధికారులు.. గ్రామీణ
ప్రాంతాలకు తిరుగుతున్న 1,280 బస్సులను కూడా ఉపసంహరించబోతున్నారు. వాటి స్థానంలో వీలైనన్ని అద్దె బస్సులను
ప్రవేశపెట్టే దిశగా ఆర్టీసీ అడుగులేస్తోంది.
> కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బుధవారం
చేపట్టిన సార్వత్రిక సమ్మె నగరంలో ప్రశాంతంగా ముగిసింది.
> ఉక్రెయిన్
ఎయిర్‌లైన్స్ కి చెందిన విమానం ఇరాన్‌లో కుప్పకూలిన ఘటనలో 176 మంది మృతి చెందారు.
అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో విమానం కుప్పకూలడం పై
అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
> కరవుతో
అల్లాడుతున్న ఆస్ట్రేలియాలో నీళ్లు ఎక్కువగా తాగే 10వేల ఒంటెలను కాల్చేయాలని
అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
> అంతరిక్షంలో
భూమిని పోలిన నివాసయోగ్యత కలిగిన గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ
ప్లానెట్‌లో ద్రవ నీరు ఉనికిని గుర్తించారు. నాసాకు చెందిన గ్రహాల అన్వేషణ విభాగం ఈ
వివిరాలు వెల్లడించింది.
0 Komentar