Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 15th February Information


పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 15th February Information
చరిత్రలో ఈరోజు
2001: మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో 1564 వ సం.లో జన్మించారు.
బంజారాల ఆరాధ్య దైవం అయిన సంత్ సేవాలాల్ మహరాజ్ 1739 వ సం.లో జన్మించారు.
ప్రముఖ చలనచిత్ర నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు 1938 వ సం.లో జన్మించారు.
కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు రాధా రెడ్డి 1952 వ సం.లో జన్మించారు.
వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్ 1956 వ సం.లో జన్మించారు.
నేటి అంశము:
ముఖ్యమంత్రి-రాష్ట్ర మంత్రిమండలి
భారత రాజ్యాంగం 66వ భాగం 2వ అధ్యాయంలోని 163, 164 నిబంధనలు రాష్ట్ర మంత్రిమండలిని గురించి వివరిస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు. అతని సలహాపై ఇతర మంత్రులను నియమిస్తాడు. రాష్ట్ర గవర్నరు ఇష్టం ఉన్నంత కాలమే మంత్రి మండలి అధికారంలో ఉంటుంది. వాస్తవానికి రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ ఉన్నంత కాలమే అధికారంలో ఉంటుంది. మంత్రి మండలి సమిష్టిగా రాష్ట్ర అసెంబ్లీకి బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర శాసన సభలో సభ్యులు కాని సభ్యులు ఆరు నెలలలోగా సభ్యత్వాన్ని సంపాదించాలి. రాష్ట్రంలో వాస్తవ కార్య నిర్వహణాధికారి ముఖ్య మంత్రి. రాష్ట్రపాలనా బాధ్యతను రాష్ట్ర గవర్నరు పేరు మీద ముఖ్యమంత్రి నిర్వహిస్తాడు.
మంచి మాట:
నైపుణ్యం అనేది ఎప్పుడూ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నం, ఏకాగ్రత వల్లే అలవడుతుంది- బ్రూస్‌లీ
నేటి జీ.కె
ప్రశ్న: దక్షిణాన విజయనగర రాజులకు ప్రధాన విరోధులైన సుల్తానులు ఎవరు?
జ: బహమనీ
వార్తలలోని ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ
*ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతిపాదించిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌కు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
*'దిశ’ చట్టరూపం దాల్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, శాసన మండలి రద్దుపై ప్రస్తుత పార్లమెంట్‌ సెషన్‌లోనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు విన్నవించారు.
* సామాజిక, శాస్త్ర రంగాల్లో  ఆయన చేసిన విశేష కృషికిగాను రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంజాబ్‌లోని దేశ్‌ భగత్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
*రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది.
*శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని అసెంబ్లీ కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణ
*రాష్ట్రాలు ఎంత వేగంగా ఎదిగితే దేశం కూడా అంతే వేగంగా ఎదుగుతుందనే సత్యాన్ని గుర్తించాలని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.
*ఉన్నత విద్యా మండలి తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ విద్యపై విద్యార్థులు ఆసక్తి చూపటం లేదని స్పష్టం చేస్తున్నాయి.
*గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీకి సీతమ్మసాగర్‌గా నామకరణం చేయనున్నారు.
*రాష్ట్రంలో వివిధ సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ ప్రభుత్వం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను జారీ చేసింది.
జాతీయం
*ఏజీఆర్‌ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు కట్టాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై సుప్రీం కోర్టు టెలికం సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
*ఉడిపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయ కంబాలక్రీడలో శ్రీనివాస గౌడ  13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తి.. ఉసేన్‌ బోల్ట్‌ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డును గుర్తు చేశాడు.
అంతర్జాతీయం
చైనాలో ప్రమాదకర కోవిడ్‌19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,500కు చేరుకుంది. దీంతో దేశం మొత్తమ్మీద బాధితుల సంఖ్య 64,894కు చేరుకుంది.
క్రీడలు
*ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 32తో థాయ్‌లాండ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.
School Assembly 15th February Information, School Assembly,prayer songs, Assembly information, historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,February month school assembly day wise,February 2020 school assembly,February 2020 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 15th February 2020 assembly, 
Previous
Next Post »
0 Komentar

Google Tags