AP Grama / ward volunteer interview questionnaire study material
ఏపీ గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి...? / స్టడీ మెటీరియల్
AP గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూకు ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి...?
మౌఖిక పరీక్ష అనగానే ఏ విధమైన ప్రశ్నలు ఎదురవుతాయో అనే ఆందోళన అభ్యర్దుల్లో ఉంటుంది. అయితే ఎలాంటి ఆందోళన లేకుండా ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు సన్నద్ధ మవ్వాలంటున్నారు నిపుణులు. ఈ క్రింది అంశాలకు సంబంధించి అభ్యర్థులకున్న అవగాహనను/ నైపుణ్యాలను ఇంటర్వ్యూ ద్వారా పరీక్షిస్తారు.
ముఖ్యమైన అంశాలు:
●ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు.
●ముఖ్యంగా 'నవరత్నాల' గురించి తెలుసుకొని ఉండాలి. వీటి ద్వారా పేదల అభ్యున్నతికి జరుగుతున్న కృషి పై అవగాహన పెంపొందించుకొని ఉండాలి అవగాహన పెంపొందించుకొని ఉండాలి ఉండాలి.
●సామాజిక సమస్యలు,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.
●ఎన్జీవోలు / సాంఘిక కార్యక్రమాలు / సంస్థల్లోని అనుభవం.
●నాయకత్వ లక్షణాలు (leadership qualities), భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు (communication skills)
సమాచార సేకరణ అవగాహన
దినపత్రికలు, అధికారిక వెబ్సైట్లు తదితరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవాలి. అభ్యర్థులు నివసిస్తున్న ప్రాంతాల్లోని వివిధ సమస్యలను తెలుసుకోవాలి. వాటి పరిష్కార మార్గాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
ఇంటర్వ్యూలో విజయానికి అభ్యర్థికి ఉండవలసిన లక్షణాలు
●నిజాయితీ
●భావవ్యక్తీకరణలో స్పష్టత
●తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పరిణామాలను నిశితంగా పరిశీలించే తత్వం.
●సామాజిక స్పృహ, సహానుభూతి.
●నాయకత్వ లక్షణాలు.
●సమస్య పరిష్కార నైపుణ్యం.
●ఇంటర్వ్యూ సమయంలో సమాధానాలను ను సూటిగా స్పష్టంగా చెప్పాలి. అవసరమైతే ఉదాహరణలతో వివరించాలి.
●ప్రశ్నలను జాగ్రత్తగా వినాలి. ప్రశ్న పూర్తికాకుండానే సమాధానం చెప్పేందుకు ప్రయత్నించకూడదు.
●వాదనలు వద్దు.
●చెప్పే సమాధానాల్లో నిజాయితీ ప్రస్ఫుటమవ్వాలి.
కొన్ని నమూనా ప్రశ్నలు...
◆మీ గ్రామ రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్యలు ఏమిటి?
◆మీరు ఇదివరకు ఏమైనా సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారా?
◆పిల్లలు మధ్యలో బడి మానేయకుండా చూడాలంటే ఎం చేస్తే బాగుంటుంది?
◆రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే 'నవరత్నాల' గురించి చెప్పండి?
◆పిల్లలను బడికి పంపితే 'అమ్మ ఒడి పథకం' కింద తల్లి ఖాతాలో ఎంత మొత్తం జమచేస్తారు?
మూలం: సాక్షి దినపత్రిక - 'భవిత'
గ్రామ వాలంటీర్ స్టడీ మెటీరియల్ కోసం క్రింది లింకును క్లిక్ చేయండి.
Grama Volunteer Interview Questions bit bank
Click here for Youtube video-1
Click here for youtube video-2
Interview Bit bank-2
Interview Bit bank-3
11వ తేది ఇంటర్వ్యూ లో అడిగిన కొన్ని ప్రశ్నల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి
Interview Bit bank-3
11వ తేది ఇంటర్వ్యూ లో అడిగిన కొన్ని ప్రశ్నల కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి
ఏకలవ్య వారి నవరత్నాలపై ప్రత్యేక సంచిక కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి
ఇంటర్వ్యూ లపై వీడియో ల కొరకు క్రింది లింక్ లను క్లిక్ చేయండి
Click here for youtube video-2
0 Komentar