సెప్టెంబరు 4
వరకు ప్రత్యామ్నాయ క్యాలెండరు విడుదల
-విద్యార్థుల ప్రవేశాలకు
అనుమతించిన పాఠశాల విద్యాశాఖ
రేపటి నుండి పాఠశాలలు
విద్యార్థుల ప్రవేశాలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ
వెల్లడించింది. ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ
పాఠశాలలు తేది. 27-7-20 నుండి
తేది.04-09-20 వరకు ప్రత్యామ్నాయ క్యాలెండరును పాటించాలని శనివారం జారీ చేసిన
ఆదేశాల్లో పేర్కొంది.
ఆదేశాల్లోని ముఖ్యాంశాలు
>ఉత్తీర్ణులైన
విద్యార్థులు ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని
వాటి ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి.
>వలస వెళ్లి
తిరిగొచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో గుర్తింపు కోసం తప్ప ఇతర ఎలాంటి ధ్రువీకరణ
పత్రాలు అవసరం లేదు.
> 1
నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు
నిర్వహించకూడదు.
>విద్యాసంవత్సరం
మొదలుకాలేదు కాబట్టి సిలబస్ ప్రకారం పరీక్షలు
నిర్వహించకూడదు.
>పూర్వ
ప్రాథమిక విద్యార్థులకు రోజుకు 30 నిమిషాలు, 1
నుంచి 8 తరగతులకు 30 నుంచి 45 నిమిషాల తరగతుల్ని రెండు విడతల్లో మాత్రమే చేపట్టాలి.
>9, 10 తరగతులకు 30- 45 నిమిషాల తరగతులు రోజుకు 4 కన్నా ఎక్కువ నిర్వహించకూడదు.
> 1-5 తరగతుల విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు
సాధించేలా తల్లిదండ్రులకు అభ్యసన పత్రాలు అందించాలి.
> 6-8 తరగతుల విద్యార్థులతో ప్రాజెక్టు పనులు చేయించాలి.
> 9, 10 తరగతుల విద్యార్థులకు విషయాల వారీగా ఆన్‌లైన్, రేడియో
ద్వారా బోధించవచ్చు.
>ఉపాధ్యాయులు
వేర్వేరు రోజుల్లో వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి. బయోమెట్రిక్ హాజరు వేయాల్సిన
అవసరం లేదు.
> దీర్ఘకాలిక
సమస్యలు,
కంటెయిన్‌మెంట్ జోన్లలో ఉన్నవారు హాజరుకావాల్సిన అవసరం లేదు.
పాఠశాల
విద్య, ఆంధ్రప్రదేశ్ - 2020-21 విద్యా సంవత్సరం - కరోనా
వ్యాప్తి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్యా కాలెండరు అమలు గురించిన ఆదేశములు..
0 Komentar