Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tips for implementing an alternative academic calendar


ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ ని అమలు చేయడానికి కొన్ని సూచనలు
1.ముందుగా పాఠశాల లో మీరు deal చేస్తున్న తరగతులలో ని విద్యార్థుల ఫోన్ నంబర్స్ సేకరించుకోవడం
2.వారిని హైటెక్(స్మార్ట్ ఫోన్,online సౌకర్యం ఉన్నవారు), లో టెక్(రేడియో, దూరదర్శన్ అందుబాటులో ఉన్నవారు), ఫోన్, దూరదర్శన్ అందుబాటులో లేనివారు)ఈ సమాచారం అమ్మఒడి కోసం మనం సేకరించిన వివరాల నుంచి పొందవచ్చును.
3.Parents committee meeting ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించడం.ముఖ్యంగా నో tech,low tech విద్యార్థులకి మనం తయారు చేసిన worksheets ఎలా అందించాలి అనేది ప్లాన్ చేసుకోవాలి.
4.Learning outcomes ఆధారంగా 4 వారాలకి సరిపోయిన worksheets ni తయారు చేసుకోవడం..హైటెక్ విద్యార్థులకి ఫోన్ ద్వారా ఫోటో తీసి అందించడం. మిగిలినవారికి తల్లితండ్రుల ద్వారా అందించడం చేయాలి.వారికి కొన్ని project works కూడా  ఇవ్వాలి.
5.ఏ సౌకర్యం లేని విద్యార్థులను ఉన్నవారితో coordinate చేసుకునేలా చూడాలి.ఒక విద్యార్థికి ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే attach చేయాలి.
6.ఇవన్నీ వారు సరిగా చేస్తున్న లేనిదీ తల్లితండ్రులకు ఫోన్ చేసి తెలుసుకోవాలి.
7. దూరదర్శన్ పాఠాల timetable ని పిల్లలకి అందజేయాలి.అవి చూస్తున్నారా లేదా అనే విషయాన్ని తల్లితండ్రులకు ఫోన్ చేసి కనుక్కోవాలి.
8.కృత్య పత్రాలు తయారుచేసే టపుడు syllabus కాకుండా learning outcomes ఆధారంగా రూపొందించుకోవాలి.రెగ్యులర్ పాఠాల బోధన కంటే concept oriented learning కు  ప్రాధాన్యత ఇవ్వాలి.
9.పాఠశాలకు హాజరైన రోజు ముందుగానే విద్యార్థులకు తెలియ పరచి తల్లితండ్రుల ద్వారా కృత్యపత్రాలను మీకు చేర్చెలా చూసుకోవాలి.
10.సరిగా చేస్తున్నదీ లేనిదీ చూసి ఫోన్ ద్వారా విద్యార్థులకు guidance ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలని స్కూల్ కి పిలవరాదు.
11.Teacher workdone statement లో  మనం ప్రతిరోజూ చేసే పనిని నమోదు చేసి శనివారం ఫోటో తీసి upload చేయాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags