Clarification about Prefix and Suffix For Vacations/Terminal Holidays
దసరా.. సంక్రాంతి
సెలవులు.. suffix.. preffix పై వివరణ
ఈ సంవత్సరం సంక్రాంతి సెలవులు 10.01.2020 నుంచి 20.01.2020 వరకు అనగా మొత్తం
11 రోజులు. కావున 9వ తేదీ ( చివరి రోజు ) మరియు 21వ తేదీ ( బడి తెరిచే రోజు )
తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలి.ఈ రెండు రోజులలో ఏ ఒక్క రోజు హాజరుకాకపోయిన ఈ
11 రోజులు అర్హతగల EL/HPL/MCL/EOL లలో ఏదో ఒకటి పెట్టవలసి ఉంటుంది.
ఇంకో విధంగా చెప్పాలంటే....
* దసరా/సంక్రాంతి
సెలవులు 9 రోజులు ప్రకటించినపుడు (ఆదివారంతో కలిపి) చివరి రోజు గానీ , బడి తెరిచే రోజు గానీ (రెండింటిలో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL) పెట్టుకోవచ్చు.
* దసరా/సంక్రాంతి
సెలవులు 10 నుంచి 14 రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ ,
బడి తెరిచేరోజు (రెండు రోజులు) తప్పక బడికి వెళ్ళాలి.అలా వెళ్లకపోతే
మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది. అనగా EL/MCL/HPL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.
* దసరా/సంక్రాంతి
సెలవులు 15 లేక అంతకంటే ఎక్కువ రోజులు (ఆదివారంతో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి
రోజు గానీ , బడి తెరిచేరోజు గానీ (రెండింటి లో ఒక రోజు
మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు. అర్హత గల సెలవు అనగా EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు.
* Rc.No.10324/E4-2/69 తేది:07-11-1969 ప్రకారం టర్మ్ హాలిడేస్ 10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో
ప్రిఫిక్స్,సఫిక్స్ (PREFIX SUFFIX) చేసుకునుటకు
అవకాశం లేదు. చివరి పనిదినం / పునఃప్రారంభం
రోజు రెండు
రోజులు పాఠశాలకు హాజరవ్వాలి. ఒకరోజు హాజరుకాకున్నా సెలవులన్ని Other
than CL గా పరిగణించబడతాయి.
* సెలవులు(దసరా/సంక్రాంతి)
15 లేక 16 లేక 17......etc రోజులు(ఆదివారం
తో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ,బడి
తెరిచేరోజు గానీ(రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు.
అర్హత గల సెలవు అనగా EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు. (RC. NO.815 తేదీ:1.9.1999)
Clarification about Prefix and Suffix,prefix and suffix holidays calculation,Clarification about Prefix and Suffix For Vacations/Terminal Holidays,Clarification about Prefix and Suffix For Vacations,Clarification about Prefix and Suffix For Terminal Holidays,
Nice
ReplyDelete