Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Co Curricular Activities in School

Co Curricular Activities in School

A. గోడ పత్రిక నిర్వహణ విధానం- తీసుకోవలసిన జాగ్రత్తలు
*అన్ని ప్రైమరీ, UP లలో గోడ పత్రిక నిర్వహించాలి. 
*దీన్ని సంవత్సరం పొడవునా నిర్వహించాలి. 
*నిర్వహణ కోసం పిల్లలు చే కమిటీ ని ఏర్పరచాలి. 
*టీచర్లు/పిల్లలు తాము స్వయంగా రాసిన కధలు, గేయాలు, బొమ్మలు ప్రదర్శించాలి. 
*పిల్లలు తాము స్వయంగా సేకరించిన కధలు, గేయాలు, బొమ్మలు, ఇతర సమాచారం ప్రదర్శించాలి. 
*దీనిలోని మంచి అంశాలను జాగ్రత్తగా భద్రపరచి వివిధ ప్రదర్శనలకు,పోటీలకి పంపాలి. 
*నెల చివరలో ఎంపిక చేసిన అంశాలతో స్కూల్ మ్యాగజైన్ రూపొందించాలి. 
*తల్లిదండ్రులకి నెలకు ఒకసారి గోడ పత్రికను మ్యాగజైన్ రూపొందించాలి. 
*తల్లిదండ్రులకి నెలకు ఒకసారి గోడ పత్రికను చూపించాలి. 
*మంచి విషయాలు ప్రదర్శించిన విద్యార్థిని ప్రేయర్ లో అభినందించాలి. *ఏడాది చివర్లో మంచివాటిని ఎంపిక చేసి బైండింగ్ చేఇంచాలి. 
*ఈ బైండింగ్ పుస్తకాన్ని లైబ్రరీ లో భద్రపరచి రీడింగ్ మెటీరియల్ గా పిల్లలు కి అందుబాటులో ఉంచాలి. 
*స్కూల్ కాంప్లెక్స్,మండలం, జిల్లా లెవల్ లలో పోటీలు జరిగితే వీటిని ప్రదర్శించాల్సి

B.బాలల సంఘాలు 
*బాలల సంఘాలు అంటే బాలలతో ఏర్పరిచే సంఘాలే!*
*విద్యార్ధులే పాఠశాలల్లో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని బాధ్యత వహించడానికి బాలల సంఘాలు ఉపయోగపడతాయి. *ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క ఉపాధ్యాయుడు బాధ్యత వహించాలి. *ప్రధానోపాధ్యాయుడు మానిటరింగ్ చేయాలి.
*పాఠశాల స్థాయిలో ఈ క్రింది కమిటీలు విధిగా తమ విధులను నిర్వహించాలి.
*ప్రతి కమిటీలో తరగతికి ఒక్కరు చొప్పున అయిదుగురు ఉంటారు. 1.సమాచార కమిటీ
బడిమానివేసిన / తరచు గైర్హాజరవుతున్న పిల్లల వివరాలు సేకరించి ఆ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులకు అందజేయుట. ప్రార్ధనా సమావేశాలలో ప్రతి రోజు వార్తలు చదవడం,
2.ఆరోగ్య/ పరిశుభ్రత కమిటి: 
పిల్లల పరిశుభ్రతను పరిశీలించడం, తరగతి గదిలో చెత్త డబ్బాలు ఏర్పాటు చేయడం, వ్యాధుల పట్ల అవగాహన కలిగించుట.
03.ఆటలు / సాంస్కృతిక కమిటీ: కాలనిర్ణయ పట్టిక ప్రకారం ఆటలు ఆడేలా చూడడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో పాల్గొనడం.
04.గోడ పత్రిక కమిటి ప్రతి రోజు పిల్లలు, టీచర్లు, రాసిన లేక తెచ్చిన కార్టూన్లు, కవితలు మొదలయిన ఇతర సమాచారం గీసిన బొమ్మలను గోడపత్రికలో ఉంచడం.
05.గ్రంథాలయ కమిటీ ప్రతిరోజు రీడింగ్ సమయంలో పిల్లలకు పుస్తకాలిచ్చి వాటి వివరాలను నమోదు చేయడం, పఠన సామగ్రిని సేకరించడం.
06.మధ్యాహ్న భోజన కమిటీ, ప్రతి పాఠశాల నుండి తరగతికి ఇద్దరి చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి మధ్యాహ్న భోజన కమిటీ ఏర్పాటు చేసి వారి పేర్లు ప్రదర్శించాలి..
07.పాఠశాలలో నిర్వహించవలసిన కార్యక్రమాలు
ఉద్దేశ్యం
పిల్లల్లోని బహుముఖ ప్రతిభను వెలికితీయడానికి, మంచి వైఖరులను నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడానికి పిల్లల్లో సహకారం, సంఘీభావం కలిసి పనిచేయడం తమ వంతు వచ్చే వరకు వేచి ఉండడం, స్నేహభావం, స్వీయ క్రమశిక్షణ అలవర్చడం కోసం. 01.ప్రార్ధన: 

  • పిల్లలచే స్వల్ప వ్యాయామ కృత్యాల నిర్వహణప్రార్ధన గీతాన్ని శ్రావ్యంగా, రాగభావయుక్తంగా, సామూహికంగా పాడించాలి. 
  • రాష్ట్ర గీతం, ప్రతిజ్ఞను నిర్వహింపజేయాలి. 
  • -సేకరించిన నేటి వార్తలు చదివించాలి. 
  • ఒక మంచి మాట (సూక్తి) చెప్పించాలి. 
  • నేటి ప్రశ్న - మీ సమాధానంలో ప్రశ్నను అడగాలి. 'బాలల సంఘాలచే పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతను పరిశీలింపజేయాలి. తగు సూచనలు అందజేయాలి. ప్రాముఖ్యత గల రోజులల్లో ఆ రోజుకు 
  • సంబంధించిన సూచనలు అందజేయాలి. 
  • పిల్లల డైరీ, గోడపత్రిక, స్కూల్ పోస్టు బాక్స్ లోని మంచి ఉత్తరాలు రాసిన, మంచి అంశాలు ప్రదర్శించిన పిల్లలను అభినందించాలి, ప్రోత్సహించాలి. 

02.తరగతి గది గ్రంథాలయం: 
పిల్లల అభిరుచికి తగినట్లుగా కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గేయాలు, సమాచార సాహిత్యం పిల్లలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి చదివించాలి. పిల్లలతో వారు చదివిన పుస్తకాలపై సమీక్షలు రాయించాలి.
03.పిల్లల డైరీ: 
పిల్లలు తమ ఆలోచనలు, ఇష్టాయిష్టాలను క్రమ పద్ధతిలో వ్యక్తీకరించే పుస్తకం. పిల్లల సహజ స్పందనలు అక్షర రూపంలో పొందేందుకై డైరీ ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉపాధ్యాయుడు డైరీలను పరిశీలించాలి.
04.గోడ పత్రిక: 
పిల్లలు అభిప్రాయాలను వ్యక్తం చేయటం వారి హక్కు. గోడ పత్రిక వారి ఆలోచనలు,
05.స్కూల్ పోస్ట్ బాక్స్: 
పిల్లలు తమ అభిప్రాయాలను, సందేహాలను సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వేదిక పోస్టుబాక్స్ స్కూల్ పోస్టు బాక్స్ లోని అంశాలను ఉదయం ప్రార్థన సమావేశంలో చదివి తోటి విద్యార్ధులకు వినిపించాలి
06.మేళాల నిర్వహణ:
తెలుగు, గణిత, విజ్ఞానశాస్త్ర అంశాలకు చెందిన కృత్య సామగ్రిని, ప్రయోగాలను ఒక చోట చేర్చే ప్రదర్శించే వేదిక ఈ కార్యక్రమం ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు సమాజ సభ్యులకు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలపై అవగాహన కల్గించే కార్యక్రమం.


Co Curricular Activities in School,co curricular activities in school pdf,co curricular activities in school list,co curricular activities in school examples,co curricular activities in a school,co curricular activities at school level,curricular and cocurricular activities in school,benefits of co curricular activities in school pdf,list of co curricular activities in cbse school,curricular and co-curricular activities in school,importance of co-curricular activities in school curriculum,co-curricular activities in elementary school,co curricular activities for school students,co curricular activities in high school,co curricular activities for high school students,co curricular activities in school include,importance of co curricular activities in school essay,implementation of co-curricular activities in school
Previous
Next Post »
0 Komentar

Google Tags