Phirangipuram Church-
The second Largest church in The Telugu States
క్రిస్మస్ వేడుకలంటే దేశవిదేశాల్లో జరిగేవే గుర్తొస్తాయి. కానీ
అంతేరీతిలో ఆ సంబరాలకు వేదికవుతుంది గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని బాలయేసు
ప్రార్థనా మందిరం. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ
చర్చిలో ఆరోజు లక్షల మంది ప్రభువు ఆశీస్సులు అందుకుంటారు.
'నావైపు చూసి
రక్షణ పొందుడి; మీ భారమును నాపైబడవేయుడి నేను మోసెదను,
నా సహాయమును సలహాను కోరిన తక్షణమే యొసంగ సిద్ధుడను’ అని చెప్పే క్రీస్తు వాక్యాలు ఎందరో ఆయన విశ్వాసుల మనసులను తేలిక
పరుస్తాయి. ‘అందరునూ ఏసుకు కన్నబిడ్డల వంటి వారే’ అనే బైబిల్ వాక్యం కరుణామయుడైన తండ్రిని తనవాడిలా నమ్ముకునేలా చేస్తాయి.
అందుకే విదేశాల్లోనే కాదు క్రిస్మస్ వేడుకలు తెలుగురాష్ట్రాల్లోనూ అంగరంగవైభవంగా
జరుగుతాయి. భారతదేశంలో క్రైస్తవం వేళ్లూనుకున్న తొలినాళ్లనుంచే ఫిరంగిపురంలో ప్రభు
విశ్వాసులు ఎక్కువ. మనదేశంలోని వారే కాదు ఇంగ్లండ్, ఫ్రాన్స్
దేశాల నుంచీ మత గురువులు ఇక్కడికి వచ్చి క్రైస్తవాన్ని ప్రబోధించారు. అందుకే కేవలం
ఈ ఒక్క ఊరి నుంచే దాదాపు రెండువందల మంది ఫాదర్లుగా, నన్‌లుగా
మారి రెండు తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. అటువంటి
ప్రాముఖ్యత ఉన్న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని
బాలయేసు ప్రార్థనా మందిరం గురించి మరిన్ని విషయాలకు క్రింది pdf ను చూడండి.
Phirangipuram Church-The second Largest church in The Telugu States, phirangipuram church history in telugu, phirangipuram church history, phirangipuram church festival,
0 Komentar