Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 19th December Information

School Assembly 19th December Information

నేటి ప్రాముఖ్యత
గోవా విముక్తి దినోత్సవం.
చరిత్రలో ఈ రోజు
1952 వ సం. లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.
1961 వ సం. లో భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి.
1978 వ సం. లో ఇందిరా గాంధీని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు.
ప్రముఖ గాంధేయవాది అయిన  నిర్మలా దేశ్ పాండే 1929 న జన్మించారు.
హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ మరణించిన రోజు.
నేటి అంశము-అగ్నిపర్వతం ఎలా పేలుతుంది
అగ్నిపర్వతం బద్దలై పైకి ఎగజిమ్మే మంటలు మంటలు కావు. అత్యధిక ఉష్ణంతో వెలువడే ఉండే  ఖనిజ ద్రవాలు.  వీటితో పాటు బూడిద, రాళ్లు  ఎగిసిపడతాయి.భూమిలో లోపల ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వేడికి  అక్కడి రాళ్లు కరిగిపోతాయి. ఈ ద్రవాన్ని మాగ్మా అంటారు. భూ కేంద్రకం పైపొర( క్రస్ట్ ) పల్చగా ఉన్న చోట నుండి మాగ్మా పైకి   తన్నుకొస్తుంది. అలాగే, భూభాగాలు, ఒకదానితో మరొకటి కలిసేచోట ఉండే సన్నటి గాడి వద్ద నుంచి ఇది ఉపరితలానికి తన్నుకొస్తుంది. ఈ ఒత్తిడికి ఉపరితల ప్రాంతపు  రాళ్లు కూడా ముక్కలు ముక్కలుగా చిద్రమై మాగ్మా తో కలిసి ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. దీన్నే అగ్నిపర్వతం పేలింది అంటారు. బూడిద, రాతి ముక్కలు కలిసి భూమ్మీదకు ఎగసిపడిన మాగ్మాను లావా అంటారు.
వేమన సుభాషితం
ఆత్మ శుద్దిలేని యాచార మదియేల
భాండ సుద్దిలేని పాకమేల
చిత్తశుద్దిలేని శివపూజ లేలరా
విశ్వదాభి రామ వినుర వేమ
భావం - మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్దితో చేసే ఆచారం ఎందుకు ? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు ? అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజ ఎందుకు ? (ఇవన్నీ వ్యర్ధం అని వేమన భావన)
మంచిమాట
మనలోని శక్తిని, తెలివిని కేవలం ప్రదర్శనకు కాక, ప్రజల మేలు కోసం,సమాజ ప్రగతి కోసం ఉపయోగించాలి.
నేటి జీ.కె
ప్రశ్న: న‌యాగ‌రా జ‌ల‌పాతం వేటిమ‌ధ్య ఉన్నది?
జ: ఇరీ-ఒన్‌టారియో స‌ర‌స్సుల మ‌ధ్య

వార్తలలోని ముఖ్యాంశాలు
దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) రాజ్యాంగ బద్ధతపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఆ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది.
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతం లో ఇచ్చిన తీర్పుపై సమీక్షకు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లను సరసమైన ధరలకు విక్రయించాలని ఏ.పి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుపతిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంతవరకు ఈ విలువలను సవరించలేదు.
టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీని మళ్లీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్‌ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది.
దేశద్రోహం కేసులో ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు మద్దతివ్వాలని పాక్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆశ్చర్యమేంటంటే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రతిపక్షంలో ఉండగా ముషారఫ్‌ రాజద్రోహం కేసుకు మద్దతు తెలపగా, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు.
వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓటమి నుంచి భారత్‌ వెంటనే కోలుకుంది. బుధవారం విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 107 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది.
School Assembly 19th December Information, School Assembly,prayer songs,Assembly information, historical events,information of the day, news of the day, golden words, today golden words, moral sentences, today's importance, headlines in the news, December month school assembly day wise, December 2019 school assembly, December 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యతచరిత్రలో ఈ రోజునేటి అంశముమంచి మాట / పద్యంవార్తలలోని ముఖ్యాంశాలు, 19th December 2019 assembly, 19th December 2019 assembly, news of the day history, news of the day highlights,19th dec 2019 assembly, dec 19th assembly, dec 19th historical events, 19th December 2019 assembly, december 19th assembly, december 19th historical events, school related today assembly, school related today news, school related december 19th information, school related december month information
Previous
Next Post »
0 Komentar

Google Tags