School Assembly 31st December
Information
నేటి
ప్రాముఖ్యత
వరల్డ్ స్పిరిట్యువల్ డే.
చరిత్రలో
ఈరోజు
➥ప్రముఖ సాహితీవేత్త పిల్లలమఱ్ఱి వేంకట
హనుమంతరావు పుట్టిన రోజు.
➥ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత,
పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన కొంగర జగ్గయ్య
పుట్టిన రోజు.
➥విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు,
నటుడు ఆర్.నారాయణమూర్తి పుట్టిన రోజు.
➥ప్రముఖ ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్ పుట్టిన
రోజు.
➥సాహసయాత్రికురాలు, ఆసియాలో
అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటిన సుచేతా కడేత్కర్ పుట్టిన రోజు.
నేటి
అంశము:
యక్ష ప్రశ్నలు-వాటి పురాణము
మహాభారతం అరణ్య పర్వంలో పాండవులు
అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి
లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు
కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరాడు. కొంతసేపటికి ఆ లేడి
కనబడకుండా మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీళ్ళు తెమ్మని నకులుని
పంపిచాడు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపాడు. అదే విధంగా అర్జునుడు, భీముడు
ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజే బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు
తమ్ములను చూసి, ఎంతో దుఃఖించాడు. అంతలో అదృశ్యవాణి పలికింది “ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు
సమాధానం చెప్పలేక నీ తమ్ములు అహం భావంతో దాహం తీర్చుకోబోయినందుకే ఈ గతి పట్టింది.
నీవయినా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో
అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు
యక్షుడి రూపంలో ఉండి వేసిన 72 చిక్కు ప్రశ్నలే ఈ యక్ష
ప్రశ్నలు.
మంచిమాట:
పనిలో ప్రతిసారీ సంతోషం
లభించకపోవచ్చు కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషమనేదే ఉండదు- ఫ్రాంక్లిన్
మంచి
పద్యం
బ్రతికే ప్రతిక్షణం ఫలప్రదం కావాలి
ఇతరులతొ అనుక్షణం జాగ్రత్తగ ఉండాలి
వారెవ్వా!దీర్ఘజీవితం వద్దు
దివ్యజీవితమే ముద్దు
నేటి
జీ.కె
ప్రశ్న: కాలుష్యం వల్ల ఓజోన్‌పొరకు
విఘాతం కలిగితే ఏమవుతుంది?
అంటార్కిటికా మంచు ఖండం కరుగుతుంది
వార్తలలోని
ముఖ్యాంశాలు
➥జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో
ఇసుక డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అధికారులను ఆదేశించారు. ముందుగా జనవరి 2 నుంచి కృష్ణా
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
➥ పోలవరం పనులన్నీ సజావుగా
సాగుతున్నాయని, నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి
ప్రాజెక్టు పూర్తవుతుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హల్దార్
నేతృత్వంలోని నిపుణుల కమిటీ పేర్కొంది.
➥ నీతిఆయోగ్ విడుదల చేసిన భారత
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సూచీ–2019 నివేదిక లో తెలంగాణ
మూడో ర్యాంకును సాధించింది.
➥ పోయట్స్ అండ్ క్వాంట్స్
సోమవారం ప్రకటించిన బిజినెస్ స్కూళ్ల ర్యాంకింగ్స్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్
బిజినెస్ (ఐఎస్‌బీ) సత్తా చాటింది. దేశంలోనే టాప్ బిజినెస్ స్కూల్‌గా
గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లలో
ఐఎస్‌బీ 16వ స్థానాన్ని దక్కించుకుంది.
➥ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్‌పవార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉన్నారు.
➥ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్‌పవార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉన్నారు.
➥ పాన్
కార్డుతో ఆధార్ లింక్ గడువు పొడిగింపు 2020 మర్చి వరకు గడువు పొడిగించిన
కేంద్రం
➥ దేశ తొలి మహా దళాధిపతి (చీఫ్
ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఈ మేరకు
కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
➥ సోమవారం విడుదల
చేసిన తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి 928 రేటింగ్ పాయింట్లతో తన
అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 911
పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు.
➥ సమాచారం శత్రుదేశాలకు చేరుతున్న
నేపథ్యంలో ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు, స్మార్ట్‌ఫోన్ల వాడకంపై భారత
నావికాదళం నిషేధం విధించింది. నేవీ సిబ్బంది మొత్తం నౌకలు, నావిక
కేంద్రాల్లో వీటిని వాడకూడదు.
School
Assembly 31st December Information, School Assembly, prayer songs, Assembly
information, historical events, information of the day, news of the day, golden
words, today golden words, moral sentences, today's importance, headlines in the
news, December month school assembly day wise, December 2019 school assembly, December
2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత, చరిత్రలో ఈ రోజు, నేటి అంశము, మంచి మాట / పద్యం, వార్తలలోని
ముఖ్యాంశాలు, 31st
December 2019 assembly, 31st December 2019 assembly,news of the day
history,news of the day highlights,31st dec 2019 assembly, dec 31st assembly,
dec 31st historical events, 31st December 2019 assembly, december 31st
assembly, december 31st historical events, school related today assembly,school
related today news, school related december 31st information, school related
december month information
0 Komentar