AU is Giving Another Opportunity to Complete Your Degree Who Got Failed During The Academic Years 1991-92 to 2008-09.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలై పట్టభద్రులు కాలేకపోయిన వారికి సువర్ణావకాశం లభించింది. బ్యాక్లాగ్ సబ్జెక్టు లను మళ్లీ రాసుకొని డిగ్రీ పట్టా పొందే అవకాశాన్ని ఏయూ యూజీ పరీక్షల విభాగం ప్రత్యేక డ్రైవ్ ద్వారా అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రకటన మంగళవారం విడుదల చేశామని ఏయూ పరీక్షల కంట్రోలర్ ఎస్. వి. సుధాకర్ : రెడ్డి తెలిపారు. 1991-92 విద్యా సంవత్సరం 1 నుంచి 2008-09 విద్యా సంవత్సరాల మధ్య : సెమిస్టర్ల విధానం లేకుండా నాన్ గ్రేడింగ్ : విధానంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఎం, బీహెచ్ఎంసీటీ (కామన్ కోర్ సిలబస్)లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ప్రత్యేక డ్రైవ్ లో తప్పిన సబ్జెక్టులను రాసే అవకాశం కల్పించారు. 2000 సంవత్సరానికి ముందు విద్యార్థులు తత్సమాన సిలబస్తు, 2000 సంవత్సరం తరువాతి విద్యార్థులు ప్రస్తుత సిలబస్లోను పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రం ఏయూలోనే ఉంటుంది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు నిర్వహించే అవ కాశం ఉందని సుధాకర్ రెడ్డి తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు ఏయూ వెబ్ సై ట్లో చూసుకోవచ్చన్నారు. దరఖాస్తులను www.aucoe.info వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మార్చి 31లోగా అదే విధానంలో పంపించాలని సూచించారు.
AU is Giving Another Opportunity to Complete Your Degree Who Got Failed During The Academic Years 1991-92 to 2008-09,Andhra University is Giving Another Opportunity to Complete Your Degree Who Got Failed During The Academic Years 1991-92 to 2008-09,AU is Giving Another Opportunity to Complete Your Degree,25 years back who got failed in degree they can write the exams now through andhra university,au latest updates,au university latest updates 2019,au degree latest updates 2019
0 Komentar