Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Balala Geyalu-Part-2

Balala Geyalu-Audios-2

1.నిర్మల సురగంగాజల
నిర్మల సురగంగాజల సంగమ క్షేత్రం , రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం
భారతదేశం మన జన్మ  ప్రదేశం , భారతఖండం ఒక అమృత భాండం
ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం , దక్షిణాన  నెలకొన్న హిందుసముద్రం
తూరుపుదిశ పొంగిపొరలు బంగళఖాతం , పశ్చిమాన అరేబీయానంతసాగరం |భారత|
ఆంధ్ర  తమిళ కర్ణాటక కేరళ నిలయం , వంగ త్రిపుర  అస్సాముళ్  వెలసిన హరం
రాజస్థాన్ గుజరాత్ పంజాబు ప్రాంగణం , కన్యాకుమారి మొదలు కాశ్మీరం సుందరం  |భారత|
భిన్నజాతి మతములున్న స్వేఛ్చ ప్రదేశం , రత్నగర్భ పేరుగన్న మణిమయతీరం
ఆర్యులన్న చరితలున్న ఆలయ శిఖరం , సత్య ధర్మ కాంతులున్న ప్రేమ కుటీరం  |భారత|
కోయిలమ్మ పాడగలడు జాతీయగీతం , కొండ కోన వాగు చూపు కాంత స్వభావం
గుండె గుండెలోన నిలుపు, సమరస బావం , చేయి చేయి కలిపి సాగు ప్రగతుల తీరం  |భారత|


  • 1.nirmala_sura_ganga
  • 2.గాలిపటం
    ఎగిరింది ఎగిరింది నా గాలిపటం , పైపైకి ఎగిరింది నా గాలిపటం
    మేఘాలు తాకింది  నా గాలిపటం , రోజంతా ఎగిరింది నా గాలిపటం
    పందాల్లో గెలిచింది నా గాలిపటం , జేజేలు పొందింది నా గాలిపటం.


  • 2.gali_patam
  • 3.చిన్నోడమ్మ చిన్నోడు
    చిన్నోడచ్ము చిన్నోడు , చిన్న సైకిలు కొన్నాడు 
    కొండ మీద కెళ్ళాడు,కాలు జారి పడ్డాడు
    ఆసుపత్రి లో చేరాడు , అరవై బిళ్ళలు మింగాడు 
    అరవై తుమ్ములు తమ్మాడు , హచ్ హచ్ హచ్...


  • 3.chinnodamma_chinnodu

  • 4.అమ్మే ఈ జగతికి
    అమ్మే ఈ జగతికి తొలి సూర్య కిరణం , అమ్మ మనసు చల్లనైన జాబిలిరూపం (2)
    అమ్మమాట మల్లెల మకరందపు మూట , అనురాగం పంచేటి అక్షయ తోట
    అమ్మ అన్న ఆ పిలుపే బంగారం , అచ్ము చేసిన బొమ్మే మెడలో మణిహారం | అమ్మే |
    ఈనాటికీ ఏనాటికి అమ్మపిలుపే కోటి , ఆ పిలుపుకు లేదులే ఇలలో సాటి
    అమ్మ చూపు నా చూపుకు చుక్కానిరా , అమ్మపాటే జోలపాటై నాపాటకు పల్లవిరా |అమ్మే|
    కనిపించి మా అమ్మే మా దైవము , కనిపించని దైవానికి మా అమ్మే దైవము
    ఈ జన్మలో ఏ జన్మలో జన్మించినా .. మా అమ్మ ఒడిలో నే బిడ్డనేరా  |అమ్మే|


  • 4.amme_e_jagathiki
  • 5.కాకీ కాకీ రావా
    కాకీ కాకీ రావా , కాటిక కొంచెం తేవా!
    పిచ్చుకా పిచ్చుకా రావా , రంగులటోపీ తేవా?
    బాతూ బాతూ రావా , బంతిపూలు తేవా?
    చిలుకా చిలుకా రావా , జామపండు తేవా?
    గబగబ మీరు రాకుంటే , అడిగినవన్నీ ఈకుంటే
    మా తాత తుపాకీతో , డాం….డాం...డాం. (అమ్మో!!!!)


  • 5.kaki_kaki_rava
  • 6.బుడగలండి బుడగలు
    బుడగలండి బుడగలు , భలే భలే బుడగలు
    గాలిలోన తేలి ఆడు , బంతి లాంటి బుడగలు
    ఎగిరిపోతు బుడగలు మెరిసిపోవు బుడగలు
    ఉఫ్ మంటే టప్ మని , పిగిలిపోవు బుడగలు!!


  • 6.budagalandi_budagalu
  • 7.చరితలోని సారమిదే
    చరితలోని సారమిదే, భవితలోని భావమిదే , వీరగాధ విజయగాధలెన్ని విన్న మూలమిదే
    వందేమాతరం..వందేమాతరం , వందేమాతరం అంటోంది మాతరం   |చరితలోని|
    అరవింది వివేకానంద రామకృష్ణ దయానంద, సమర్ధుల సందేశం వందే మాతరం
    ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ, రాణా రక్తపు శౌర్యం వందే మాతరం
    ఝాన్సీ రాణి  రుద్రమాంబా కత్తుల కధలే , వందే మాతరం వందేమాతరం 
    వందేమాతరం అంటోంది మాతరం |చరితలోని|
    మనలోని అనైక్యత జాతీయ భావ హీనత , ఆసరగా అధికారం అందుకొనిరిరా
    విద్వేషం రగిలించి విభజించి పాలించి , విద్రోహం తలపెట్టే ఫిరంగి మూకరా
    బ్రిటిష్ విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం , వందే మాతరం వందేమాతరం


  • 7.charitaloni
  • వందే మాతరం అంటోంది మాతరం
    8.మా బావ వీరుడు
    మా బావ వీరుడు మంచమైతె దిగడు , చీమంటే చాలు వణికిపోతాడు
    ఎలకంటే చాలు ఎగిరెగిరి పడతాడు , పులంటే  చాలు ఆగకుండా ఉరుకుతాడు


  • 8.ma_bava_viirudu


  • Balala Geyalu-Audios-1.balala geyalu..balala geyalu in telugu.balala geyalu in telugu lyrics.balala geyalu in telugu lyrics pdf,telugu balala geyalu pdf,balala geethalu in telugu.balala telugu patalu.school telugu geyalu.telugu childrens songs.telugu balala geyalu,children folk songs.telugu childrens folk songs. 
    Previous
    Next Post »
    0 Komentar

    Google Tags