బాలల గేయాలు-1
1.భారతదేశపు బాలలం
భారతదేశపు బాలలం , భావి తరాలకు వారసులం
ఆటా పాటా మాహకు , సమతాభావం మాదిక్కు
తరతరాలకూ యుగయుగాలకూ , తరగనిదీ మా ప్రగతి |భారతదేశపు|
విధ్యా , జ్ఞానం మాలక్ష్యం , ఆటా పాటా మా నైజం
సాధన విధ్యే మా దైవం , సమభావానికి ప్రతిరూరం |భారతదేశపు|
తెలుగు తల్లికీ వందనం, తెగిపోనిది మా అనుబంధం
చీకటిలో చిరుదివ్వెలం , చెరిగిపోనిదీ మా స్నహం |భారతదేశపు|
ఇంగిలీషు భాష ,ఎంతో తమాషా
సల్టంటే ఉపు , ఫల్టంటే తపు |ఇంగిలీషు|
క్రో అంటే కాకి ,కాక్ అంటే పుంజు |ఇంగిలీషు|
షో అంటే చూపు ,షూ అంటే చెపు |ఇంగిలీషు|
నాట్ అంటే కాదు , వాట్ అంటే ఏమి |ఇంగిలీషు|
గుడ్ అంటే గుడ్డు కాదు ,బెడ్అంటే బెడ్డ కాదు |ఇంగిలీషు|
చిన్ని చిన్ని పిల్లలం , మల్లపూల మొగ్గలం
మల్లపూల మొగ్గలం ,రంగు రంగు మొగ్గలం
ప్రకృతి అందాలూ చూద్దామా ,పరవశించి గంతులు వేద్దామ |ప్రకృతి అంద్యలు చూద్యమా| |చిని చిని పిలలం|
స్వాతి చినుకుల్లో , మనమూ ఒక చినుకౌదామా |స్వాతి చినుకుల్లో|
సీతా కోకచిలకల్లో , మనమూ ఒక చిలకౌదామా |సీతా కోకచిలకల్లో|
సిరివేన్నలలో చిందులేద్దామా, వెన్నెల్లో సగమౌదామా? |చిన్న చిన్న పిల్లలం |
చిలకా చిలకా ఇదిగో గిలక , గిలకా వద్దు పాలక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో పలక , పలకా వద్దు నులక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో నులక , నులకా వద్దు మొలక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో మొలక , మొలకా వద్దు పిలక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో పిలక , పిలకా వద్దు ఎలక ఇవ్వు
చిలకా చిలకా ఇదిగో ఎలక , ఎలకా వద్దు చిలక ఇవ్వు
పోస్ట్ కార్డూ పోస్ట్ కార్డూ, పోయ్యోస్తావా?
పల్లె నుండి ఢిల్లీకి , పారిపోతావా?
ఢిల్లీనుండి పల్లెటూరికి, తిరిగోస్తావా? |పోస్ట్ కార్డూ|
పొట్టి బావకు చిట్టి మరదలి , ఫొటో ఇస్తావా?
మామ బిడ్డకు నా మంచి , మాట చెప్తావ? |పోస్ట్ కార్డూ|
చిన్ని చెల్లికి అన్న మాట , చెవిలో వేస్తావా?
అత్తమామకు అలుదొచ్చే , వార్త చెప్తావా? |పోస్ట్ కార్డూ|
పోస్ట్ కార్డూ పోస్ట్ కార్డూ , పోయిరామ్మా !
పోయిరామ్మా ! , పోయిరామ్మా !
6.హెల్లో హెల్లో ఎవరండీ?
హెల్లో హెల్లో ఎవరండీ? ...
లిల్లీగారా తమరండీ? ...
మల్లికనండీ మాట్లాడేది ......
వందనమండీ వందనము ...
షికారుకైతే వస్తారా?....
సినిమాకైతే రానంటారా?...
సరే! సరే! మరి ఉంటాను
సాయంకాలం వస్తాను!
చిన్న చిన్న నారింజపండు ,పెద్ద పెద్ద నారింజపండు
ఒప్పులు కోసి , రసం పిండి
చక్కె ర వేసి , గిరగిర తిప్పి
గుట గుట తాగితే బలేతీపి, బలేతీపి
నీకు కావాలా , నీకు కావాలా
ఎవరికీ వద్దా , తగేస్తున్నాను , తాగేశాను
కావ్ కావ్ అంటే ఏమమ్మా ? , ఆకలి ! ఆకలి ! అన్నమ్మా !
అన్నం ఇదిగో, కాకమ్మా ! , కడుపు నిండెను కన్నమ్మా !
మ్యావ్ మ్యావ్ అంటే ఏమమ్మా ? , దప్పీ ! దప్పీ ! తల్లెమ్మా !
పాలు ఇవిగో పిల్లెమ్మా ! , కడుపు నిండెను కామమ్మా !
భౌ భౌ అంటే ఏమయ్యా ? , పారా హుషారు పాపయ్యా !
ఎక్కడ దొంగలు కుక్కయ్యా ? , దౌడో! దౌడూ! తరుమయ్యా !
అంబా అంటే ఏమమ్మా ? , నిద్దుర నిద్దుర నీలమ్మా !
జో! జో! జో! జో! దూడమ్మా ! , హాయీ! హాయీ! హాయమ్మా !
కొకురోోకో అంటే ఏమయ్యా ? , మేల్కోమేల్కో మేలయ్యా !
గణ గణ గణ గణ గంటయ్యా , పరుగో! పరుగో! బడికయ్యా !
కుక్కా - నక్కా , ఒక్కే జాతి!
పిల్లీ - పులీ , ఒక్కే జాతి!
గుర్రం - గాడిద , ఒక్కే జాతి!
మేకా - జింకా , ఒక్కే జాతి!
భూగోళంపై మానవులంతా , ఒక్కే జాతి! ఒక్కే జాతి!
ఏమి ఏమి ఆటమ్మా , క్రికెట్ క్రికెట్ ఆటమ్మా
సచిన్ వచ్చె చారే కొట్టె , సౌరభ్ వచ్చె సిక్సర్ కొట్టె
అజహర్ వచ్చె ఔట్ ఆయే , కరెంటు పోయె ఖతమాయె.
Balala Geyalu-Audios-1,balala geyalu,,balala geyalu in telugu,balala geyalu in telugu lyrics,balala geyalu in telugu lyrics pdf,telugu balala geyalu pdf,balala geethalu in telugu,balala telugu patalu,school telugu geyalu,telugu childrens songs,telugu balala geyalu,children folk songs,telugu childrens folk songs,
0 Komentar