K.J.Yesudas Biography
కె. జె. ఏసుదాసు
కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ (జ. జనవరి 10, 1940) ఒక భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు మరియు గాయకుడు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. ఏడు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నాడు. కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు సార్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం అందుకున్నాడు. ఈయన శాస్త్రీయ సంగీతమేగాక, భక్తిగీతాలు మరియు సినిమా పాటల గాయకుడిగా సుపరిచితుడు. వివిధ భారతీయ భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడాడు. తెలుగు సినీపరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
జీవితం
ఏసుదాసు 1940 లో కేరళ లోని కొచ్చి లో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు అగస్టీన్ జోసెఫ్, ఆలిస్ కుట్టి. తండ్రి మంచి గాయకుడు, మరియు నటుడు. భాగవతార్ గా ఆయనకు మంచి పేరుండేది. తండ్రి ప్రభావంతో ఏసుదాసు కూడా చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు. పదిహేడేళ్ళ వయసులో కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచాడు. కొడుకులోని ప్రతిభను సానబెట్టడం కోసం తండ్రి అతన్ని తిరుపుణిత్తారయనిలోని సంగీత కళాశాలలో చేర్చాడు. మొదట్లో ఒక క్రైస్తవుడు కర్ణాటక సంగీతం ఏమి నేర్చుకుంటాడని అతన్ని సహ విద్యార్థులు గేలి చేసేవారు. తర్వాత పట్టుదలగా చదివిన ఏసుదాసు ఆ కళాశాలలోనే ప్రథముడిగా నిలిచాడు. తర్వాత త్రివేండ్రంలోని సంగీత అకాడమీ లో చేరాడు. అదే సమయంలో తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. తండ్రికి వైద్యం చేయించడం కోసం చిన్న చిన్న పనులు చేసేవాడు. కొద్ది కాలానికి ఆయన ఆసుపత్రిలోనే మరణించడంతో వీరి కుటుంబం మరింత కష్టాలపాలైంది.
వృత్తి
తల్లి, స్నేహితుల సలహా మేరకు సంగీతంలోనే ఆదాయం వెతుక్కోవడం కోసం చెన్నై వచ్చాడు. ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలామంది తిరస్కరించారు. కానీ ఆయన మాత్రం వేదికల మీద, కార్యక్రమాల్లో పాటలు పాడుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. 14 నవంబరు 1961 న కేరళ చిత్ర దర్శకుడు ఎ. కె. ఆంథోనీ ఆయనకు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. మలయాళంలోనే కాక తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (అంతులేని కథ), చుక్కల్లే తోచావే (నిరీక్షణ), సృష్టికర్త ఒక బ్రహ్మ (అమ్మ రాజీనామా), ఆకాశ దేశాన (మేఘసందేశం) లాంటి అనేక విజయవంతమైన పాటలు పాడాడు.
కథానాయకుడు మోహన్ బాబు ఆయన సినిమాల్లో ఏసుదాసు చేత కనీసం ఒక్క పాటైనా పాడించుకునే వాడు. ఏసుదాసు పాడిన అయ్యప్ప పాటలు కూడా ఎంతో పేరు గాంచాయి. అయ్యప్పు పవళింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు. మొదట్లో హిందూ భజనలు పాడుతున్నాడని కేరళకు చెందిన ఓ చర్చి వారు అతన్ని వెలివేసినా మళ్ళీ తమలో చేర్చుకున్నారు. ఈయన నటుడిగా కూడా నాలుగు సినిమాల్లో కనిపించాడు.
కుటుంబం
యేసుదాస్ సతీమణి ప్రభ. వీరికి ముగ్గురు సంతానం, వినోద్, విజయ్ మరియు విశాల్. విజయ్ కూడా సంగీతాభిరుచి గలవాడు. వీరు చెన్నై మరియు కేరళలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
రోల్ మోడల్స్
నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచీ తోటి వారితో అలాగే మెలిగే వాడు. మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భాగవతార్, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ లను ఆయన బాగా అభిమానిస్తాడు.
మంగళంపల్లి బాలమురళీ కృష్ణ తో ఏసుదాసు మహ్మద్ రఫీ తో ఏసుదాసు
పురస్కారాలు, బిరుదులు
పురస్కారాలు, బిరుదులు
పద్మవిభూషణ్ :2017
పద్మభూషణ్ : 2002.
పద్మశ్రీ : 1973.
అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, 1989
కేరళ ప్రభుత్వ ఆస్థాన గాయకుడు
సంగీత నాటక అకాడమీ అవార్డు in 1992.
ఆస్థాన విద్వాన్ ఉడుపి, శృంగేరి, మరియు రాఘవేంద్ర మఠాలు.
సంగీత సాగరము 1989.
సంగీత చక్రవర్తి 1988 పల్లవి నరసింహాచారి.
సంగీత రాజా 1974.
సంగీత రత్న పాండిచ్చేరి గవర్నర్ ఎం. ఎం. లఖేరా
స్వాతి రత్నము
సప్తగిరి సంగీత విద్వన్మణి (2002)
భక్తి సంగీత శిరోమణి (2002)
గాన గంధర్వ.
గీతాంజలి పురస్కారం నీలం సంజీవరెడ్డి చేతులమీదుగా.
కలైమామణి పురస్కారం తమిళనాడు రాష్ట్రప్రభుత్వం.
నేషనల్ సిటిజెన్ అవార్డు 1994.
కేరళ రత్న 2008 లో జైహింద్ టివి నుంచి
2000 లో డాక్టర్ పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం.
యునెస్కో వారి నుంచి అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఇన్ మ్యూజిక్ అండ్ పీస్ పురస్కారం 1999.
భారత ప్రభుత్వం నుంచి ఏడు సార్లు జాతీయ ఉత్తమ గాయకుడి పురస్కారం
కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు సార్లు ఉత్తమ గాయకుడి పురస్కారం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం
జాతీయ పురస్కారాలు
ఏసుదాసు ఏడు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. ఇది ఇప్పటికీ ఓ రికార్డు.
k j yesudas biography,biography of k j yesudas,K.J.YesudasBiography,K.J.Yesudasbiography
in telugu, K.J.Yesudasbiography pdf,K.J.Yesudasbio,hargobind khorana bio
data,biography of har gobind khorana, biography of K.J.Yesudasin telugu,short
biography of har gobind khorana,K.J.Yesudaslife story, K.J.Yesudasbiography telugu,singer
yesudas biography,biography of singer
yesudas, singer YesudasBiography,
singer Yesudasbiography in telugu, singer Yesudasbiography pdf, singer Yesudasbio,hargobind
khorana bio data,biography of har gobind khorana, biography singer Yesudasu
telugu,short biography of har gobind khorana, singer Yesudaslife story, singer Yesudas
biography telugu
0 Komentar