పాఠశాల, కాలేజీల
అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 30th January Information
నేటి
ప్రాముఖ్యత
➥అమర వీరుల దినం: ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ
స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2
నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు.
➥గాంధీజీ వర్థంతి
➥కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.
చరిత్రలో
ఈరోజు
➥ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్ 1882 వ సం.లో జన్మించారు.
➥భారత జాతి పిత మహాత్మా గాంధీ 1948 వ సం.లో మరణించారు.
➥రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే 1948 వ సం.లో మరణించారు.
➥ప్రముఖ తెలుగు నవలా రచయిత వడ్డెర చండీదాస్
2005 వ సం.లో మరణించారు.
➥ప్రముఖ తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి
2016 వ సం.లో మరణించారు.
నేటి
అంశము:
చైనా చందమామ
పున్నమి చందమామ కంటే ఎనిమిది
రెట్లు ప్రకాశవంతమైన కృత్రిమ జాబిల్లిని చైనాలోని 'చెంగ్ డు ఏరో
స్పేస్' ఏర్పాటు చేయబోచున్నది. ఇందుకోసం ఒక ఉపగ్రహం చుట్టూ
కొన్ని ఫలకాలని అమరుస్తారు. ఈ ఉపగ్రహాన్ని భూమికి సుమారు 500
కిలో మీటర్ల ఎత్తున నిలుపుతారు. చంద్రుడు ఎలాగైతే సూర్యకిరణాలని ప్రతిఫలిస్తూ
వెలుతురుని అందిస్తుందో, ఈ ఉపగ్రహం మీద ఫలకాలు కూడా సూర్యుడి
కిరణాలను భూమి మీదకి ప్రతిఫలిస్తాయి.
సుభాషితం:
ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.
భావం- తనకు మేలు చేసిన వానికి
తిరిగి మేలు చెయ్యడం సామన్యమయున విషయమే.కానీ తనకు అపకారం చేసినా సరే వాని తప్పులు
మన్నించి తిరిగి మేలు చేయువాడే ఉత్తముడు.
వార్తలలోని
ముఖ్యాంశాలు
*గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు
మరిన్ని అధికారాలు కల్పించే దిశగా 1994 నాటి పంచాయతీరాజ్
చట్టం స్థానంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన చేయాలని ఏ.పి. ప్రభుత్వం
నిర్ణయించింది.
*పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి
ప్రవేశించి ఆ దేశ కోస్టుగార్డులకు చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది
మత్స్యకారులకు విముక్తి లభించింది.
*చైనాలో ఉన్న భారతీయులను సురక్షితంగా
స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో టీసీఎల్
కంపెనీకి ఎంపికైన పలువురు తెలుగు ఇంజనీర్లు.. శిక్షణ నిమిత్తం చైనాకు వెళ్లారు.
*తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్ర
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను గట్టెక్కించేందుకు వచ్చే ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రాష్ట్రంలో
విద్యుత్ చార్జీల పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
*ధ్యానం, యోగాతోనే మానసిక ప్రశాంతత,
తద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురు బాబా రాందేవ్
అన్నారు.
*ఏ వైరస్ సోకినా ఒకేచోట వైద్య చికిత్స
అందించే “క్లీన్ వార్డు” కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో హైదరాబాద్
లోని ఛాతీ ఆస్పత్రిలో రూ.132 కోట్లతో ఏర్పాటు చేయాలని
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
* గర్భిణీలకు 24 వారాల వరకు అబార్షన్
వెసులుబాటు కల్పిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ప్రస్తుతం
20 వారాలకే ప్రభుత్వ అనుమతి ఉన్నది.
*మోదీ సర్కార్ తెచ్చిన పౌరసత్వ సవరణ
చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది.
*రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు
వ్యతిరేకంగా నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ దాఖలు
చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
*మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు
చేయడం ఇస్లాంలో ఆమోదనీయమేనని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్‌బీ)
వెల్లడించింది.
*కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ
దేశం నుంచి విదేశీయులను సురక్షితంగా పంపించేందుకు సిద్ధమని చైనా పేర్కొంది.
*బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ జేపీలో
చేరారు.
*భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుచున్న
టి20 సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లుండగానే 3–0తో సిరీస్‌ను భారత్ చేజిక్కించుకుంది.
*భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్
చోప్రా దక్షిణాఫ్రికాలో జరిగిన ఏసీఎన్‌ఈ లీగ్ అథ్లెటిక్స్ మీట్‌లో స్వర్ణ పతకం
సాధించడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు.
*ఆ్రస్టేలియన్ ఓపెన్ లో బుధవారం పురుషుల
సింగిల్స్ లో రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. మహిళల
సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో సిమోనా హలెప్ (రొమేనియా), ముగురుజా (స్పెయిన్) గెలుపొందారు.
*ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)
ఐదో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్ జట్టు సొంతగడ్డపై శుభారంభం చేసింది.
School Assembly 30th January
Information,S chool Assembly,prayer songs, Assembly information,historical
events, information of the day, news of the day, golden words, today golden
words, moral sentences,today's importance, headlines in the news, January month
school assembly day wise, January 2020 school assembly, January 2020 school
assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత, చరిత్రలో ఈ రోజు, నేటి అంశము, మంచి
మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు
0 Komentar