School Assembly 4th January information
నేటి ప్రాముఖ్యత
వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం
చరిత్రలో ఈరోజు
➥1988: గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ (GIFT) అనే
ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.
➥సుప్రసిద్ధ
భౌతిక,
గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ 1643 వ సం.లో జన్మించారు.
➥ఫ్రెంచ్
విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయీ బ్రెయిలీ 1809వ సం.లో జన్మించారు.
➥నార్వే
దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత
మే-బ్రిట్ మోసర్ 1963 వ సం.లో జన్మించారు.
➥ప్రఖ్యాతి
గాంచిన ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు గోపాలస్వామి
దొరస్వామి నాయుడు 1974 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
భారత రాజ్యాంగంలోని 5వ భాగం 5వ అధ్యాయంలోని 148 నుండి 151
వరకు గల నిబంధనలు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను గురించి వివరిస్తాయి. భారత
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడు. ఇతడు కేంద్ర ప్రభుత్వ,
రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్స్ ను తనిఖీ చేసి రిపోర్టులు తయారు
చేస్తాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్టును రాష్ట్రపతికి సమర్పిస్తాడు.
రాష్ట్రపతి ఆ రిపోర్టును పార్లమెంటు ముందు ఉంచే ఏర్పాటు చేస్తాడు. రాష్ట్ర
ప్రభుత్వానికి సంబంధించిన నివేదికలను రాష్ట్ర గవర్నరుకు సమర్పిస్తాడు. రాష్ట్ర
గవర్నరు ఆ రిపోర్టును రాష్ట్ర శాసన సభ ముందు ఉంచే ఏర్పాటు చేస్తాడు.
సుభాషితం:
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ.
భావం -అవసరమునకు అప్పు ఇచ్చు మిత్రుడు,రోగము
వచ్చినపుడు చికిత్స చేయుటకు వైద్యుడుని,ఎప్పుడును నీరెండక
ప్రవహించు నదియు,శుభాశుభ కర్మలు చేయించు బ్రాహ్మణుడును ఉన్న
ఊరిలో ఉండుము.ఈ సౌకర్యము లేని ఊరిలో ఉండకుము.
మంచి మాట
"మురికి నీటితో ఉతికిన
దుస్తులు పూలతోటలో ఆరేసినంత మాత్రాన శుభ్రం కావు."
నేటి జీ.కె
ప్రశ్న: ప్రపంచంలో దట్టమైన అడవి
ఏది ?
అమెజాన్ బేసిన్ ( దక్షిణ అమెరికా)
వార్తలలోని ముఖ్యాంశాలు
➥ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బోస్టన్
కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇక ప్రభుత్వం
ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించి,
అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది.
➥ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా
పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఈనెల 7వ తేదీ లోపు ఎన్నికల కమిషన్‌కు
నివేదిక అందించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
➥ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే సంకల్పంతో ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం 1059 రోగాలకు మాత్రమే
ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని, ఆ సంఖ్యను 2059 రోగాలకు వర్తించే
విధంగా పథకాన్ని రూపకల్పన చేశామన్నారు.
➥ నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి
మండలంలోని చంద్రకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 44మంది
విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది.
➥ ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నుండి
మిర్యాలగూడ డివిజన్ లోని నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరిచ్చేందుకు
వీలుగా భారీ ఎత్తిపోతల పథకం నిర్మించే అంశాన్ని పరిశీలించాలని నీటిపారుదల
శాఖను తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఆదేశించారు.
➥ భారతదేశ అభివృద్ధి గాధ సాంకేతిక రంగాల
విజయంపైనే ఆధారపడి ఉందని నరేంద్ర మోడీ అన్నారు. "ఆవిష్కరించు, మేధో
హక్కులు పొందు, ఉత్పత్తి
చేయు మరియు అభివృద్ధి చెందు" అనే మంత్రాన్ని ఆచరించాలని యువ శాస్త్రవేత్తలకు
పిలుపునిచ్చారు.
➥ ప్రైవేటు మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ
జిల్లా ఆసుపత్రులను అనుసంధానించాలని, తద్వారా ప్రభుత్వ
ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో వాటిని నిర్వహించాలని నీతి ఆయోగ్
సూచించింది.
➥ మధురై జిల్లాలోని అరిత్తపట్టి గ్రామానికి చెందిన
వీరమ్మల్ అజగప్పన్ అనే 79 ఏళ్ల వృద్ధురాలు ప్రజల సంక్షేమం కోసం స్థానిక
సంస్థల ఎన్నికలలో పోటీ చేసి 190 ఓట్ల మెజారిటీతో గెలిచి
ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చారు.
➥ సుమారు 300 కోట్ల విలువచేసే బెంగళూరులోని గాంధీనగర్ ప్రాంతంలోని లక్ష్మీ
హోటల్ భవనాన్ని క్యాన్సర్ తో బాధపడే బాలల
సంక్షేమం కోసం మీరా నాయుడు అనే ఆమె దానం చేసి తన ఔదార్యం ను చాటుకున్నది.
➥ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీం సోలెమన్‌ను
అమెరికా హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త
పరిస్థితుల దృష్ట్యా అమెరికా పౌరులు తక్షణమే ఇరాక్ వదిలి వెళ్లిపోవాలని బాగ్దాద్‌లోని
యూఎస్ ఎంబసీ కోరింది.
➥ మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి, వెండి
మరియు చమురు ధర ఒక్కసారిగా పెరిగాయి. నిన్న ఒక్క రోజే సుమారు 750 రూపాయలు పైగా
బంగారం ధర పెరిగింది.
School
Assembly 4th January Information, School Assembly, prayer songs,Assembly
information, historical events,information of the day, news of the day,golden
words, today golden words, moral sentences, today's importance, headlines in the
news,January month school assembly day wise,January 2020 school
assembly, January 2020 school assembly information
0 Komentar