Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ghantasala Venkateswararao Biography

Ghantasala Venkateswara Rao Biography

ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర

=====================

ఘంటసాల వెంకటేశ్వరరావు (డిసెంబర్ 4, 1922 - ఫిబ్రవరి 1, 1974) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపథ్యగాయకులలో ప్రముఖుడు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు వారిలో అత్యంత ప్రజాదరణ పొందినది.

బాల్యం

ఘంటసాల డిసెంబర్ 4, 1922 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో ఆయన సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాండిని అవమని కోరారు.

సంగీత సాధన

తండ్రి ఆశయం నేరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనకడ వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయ్యాడు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. ఘంటసాల తన దగ్గరున్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు.

అప్పుడు వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకువెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బసచేయడానికి అనుమతి ఇచ్చాడు. ఘంటసాల అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు. తోటివిద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు. అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాలవారు తమ ఇళ్ళకు రావద్దన్నారు. గత్యంతరంలేక ఆ ఊరి గుడికి వెళ్ళి తలదాచుకున్నాడు. అప్పు గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకొని తన ఇంట ఉచితంగా సంగీతశిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు.

ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలెకట్టి మాధుకరం (ఇంటింటా అడుక్కోవడం) చేయడం నేర్పించాడు. భుజాన జోలెకట్టుకొని వీధివీధి తిరిగి రెండుపూటలకు సరిపడే అన్నం తెచ్చుకొనేవాడు. వేసవి సెలవులు పూర్తైన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో నాలుగుసంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తిచేసాడు. 1942లో స్వాతంత్ర్య సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండుసంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు.

సినీ ప్రస్థానం

1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిసాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్. రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు.

ఘంటసాలచేత తరచు షాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.

విజయ విహారం

1951 లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే. 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది.

1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాల్గొనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పొడినదే! ఏనోట విన్నా ఆయన పాడిన పాటలే.

వ్యక్తిగత జీవితం

ఘంటసాల వెంకటేశ్వరరావు సావిత్రి మరియు శారదాదేవిని వివాహం చేసుకున్నారు. నలుగురు కుమార్తెలు (శ్యామల, సుగునా, శాంతి, మీరా) మరియు నలుగురు కుమారులు (విజయ కుమార్, రత్న కుమార్, రవి కుమార్, శంకర్ కుమార్) తో 8 మంది పిల్లలు ఉన్నారు. శాశ్వత కళాకారుడిగా పని పనిచేస్తున్న సంస్థకు కృతజ్ఞతతో విజయా ప్రొడక్షన్స్ తర్వాత ఘంటసాల తన పెద్ద కుమారుడు విజయా" కుమార్ పేరు పెట్టారు.

చివరి దశ

1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి దురయ్యేవాడు. 1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండె నొప్పి తో హాస్పిటల్లో చేరాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు వాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్మృతిలో కన్నుమూసాడు.

వ్యక్తిత్వం

ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. ఆయన ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు. "నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆవాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టఐశ్వర్యాల తో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది " అని ఎన్నోసార్లు చెప్పేవాడు. మద్రాసులో ఇల్లుకొన్నపుడు గురువుగారైన సీతారామశాస్త్రిగారికి గృహప్రవేశానికి రావడానికై టికెట్లుకొని గృహప్రవేశం రోజు వెయ్యిన్నూట పదహార్లు, పట్టుబట్టలు వెండిపళ్ళెంలో సమర్పించి సాష్టాంగ నమస్కారంచేసి ఆయనపట్ల తన గౌరవాన్ని చాటుకున్నాడు. సీతారామశాస్త్రిగారి కూమారుడు పట్రాయని సంగీతరావు ఘంటసాల వద్ద సంగీత స్వరసహచరుడిగా, ఘంటసాల చివరి శ్వాస వరకు తోడుగా, ఆప్తమిత్రుడుగా ఉన్నారు.

పురస్కారాలు

ఘంటసాల భారత ప్రభుత్వంచే "పద్మశ్రీ" తో గౌరవించబడ్డారు. దాదాపు 30 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ నేపథ్య గాయకుడి పురస్కారాన్ని పొందాడు. 15 వ శతాబ్దంలో అన్న చార్య తరువాత, ఘంటసాల మూలా విరాట్ దగ్గర తిరుమల వెంకటేశ్వర దేవాలయంలో భక్తి గీతాలను నిర్వహించిన ఏకైక గాయకుడు.

పేరు పొందినవి

నేపథ్య గాయకునిగా మరియు సంగీత దర్శకునిగా షావుకారు, పాతాళభైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, లవకుశ, రహస్యం, గుడిగంటలు. నేపథ్య గాయకునిగా దేవదాసు, కన్యాశుల్కం, దొంగరాముడు, తోడికోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, ఇద్దరుమిత్రులు, అప్పు చేసి పప్పు కూడు, జగదేకవీరుని కథ, మూగ మనసులు, మంచి మనసులు, భక్త జయదేవ, మహాకవి కాళిదాసు, భక్త తుకారాం, పాండురంగ మహత్యం, ఆరాధన, ఆత్మబలం, ప్రేమనగర్, బంగారు బాబు మొదలైనవి. ప్రైవేటు ఆల్బములు కుంతీవిలాపం, పుష్ప విలాపం, దేశభక్తి గీతాలు, భగవద్గీత, భక్తి గీతాలు.

DOWNLOAD - GHANTASALA BIOGRAPHY IN TELUGU PDF

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags