Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Admission Notification 2019-20

Kendriya Vidyalaya Admission 2019-20 Notification

అధునాతన సాంకేతికతతో విద్యనందించడంలో కేంద్రీయ విద్యాలయాలు ఎప్పుడూ ముందు ఉంటాయి. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు పని చేస్తాయి. ఈ పాఠ శాలలను 1964లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యో గుల (రక్షణ రంగంలో పనిచేసే ఉద్యోగులు సహా)కు తరచుగా బదిలీలు జరుగుతుంటాయి. ఇటువంటి సమయంలో ఉద్యోగుల పిల్లల చదువుకు ఎటువంటి ఇబ్బంది కలగ కుండా ఒకే రకమైన సిలబస్, కరిక్యులంతో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయ వ్యవస్థను ప్రారంభించింది. మొదట్లో వీటిని సెంట్రల్ స్కూల్స్గా పిలిచేవారు. తరవాత వీటి పేరు కేంద్రీయ విద్యాలయాలుగా మారింది. ఇందులో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి మిగతా వర్గాల పిల్లలకు కూడా ప్రవేశం కల్పి స్తారు. ప్రస్తుతం దేశంలో 1,202 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 12,76,363 మంది విద్యార్థులు ఉన్నారు. 
సీబీఎస్ఈ సిలబస్
కేంద్రీయ విద్యాలయాల్లో దేశ వ్యాప్తంగా ఒకే రకమైన కరికులం, సిలబస్, కో-ఎడ్యుకేషన్ విధానం అమల్లో ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధిస్తారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి నుంచి 12వ తర గతి వరకు తరగతులు ఉంటాయి. ఈ పాఠశాలలు సీబీఎస్ ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్)కి అను బంధంగా ఉంటాయి. దీంతో ఈ పాఠశాలలు సీబీఎస్ఈ సిలబస్ అనుసరిస్తాయి.
ఫ్రెష్.. ఖాళీలు
ఒకటో తరగతిలో ఫ్రెష్గా అడ్మిషన్లను స్వీకరిస్తారు. ఇందుకు ఒక ప్రాధాన్య క్రమం, నిబంధనలను అనుసరిస్తారు. అయితే రెండు నుంచి అటుపై తరగతుల్లో మాత్రం ఆయా తరగతుల్లో ఉన్న ఖాళీల మేరకే ప్రవేశాలను కల్పిస్తారు. 10వ తరగతిలో ప్రవేశం పొందాలంటే 9వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. 11వ తరగతి దరఖాస్తులను 10వ తరగతి ఫలితాల తరవాత అందుబాటులో ఉంచుతారు. 11వ తరగతిలో కూడా ఆయా విద్యాలయా ల్లోని ఖాళీల ప్రకారమే అడ్మిషన్లు కల్పిస్తారు. 12వ తరగతిలో ప్రవేశానికి 11వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించాలి.
వీరికి ప్రాధాన్యం
దరఖాస్తు చేసుకున్న అందరికీ ప్రవేశాలు కల్పిం చరు. నిబంధనల మేరకు ప్రాధాన్య క్రమాన్ని అనుసరిస్తారు. దాని ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ప్రాధాన్య క్రమం ఈ విధంగా ఉంటుంది. 
కేటగిరీ-1: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు 
కేటగిరీ-2: కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే
విద్యా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల పిల్లలు  
కేటగిరీ-3: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు 
కేటగిరీ-4: రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ
సంస్థల్లో పని చేసే ఉద్యోగుల పిల్లలు 
కేటగిరీ-5: ప్రైవేట్ ఉద్యోగులు ! స్వయం ఉపాధి పొందుతున్నవారు / విదేశీ అధికారులు ! తదితర వర్గాల పిల్లలు.. 
సింగిల్ గర్ల్ చైల్డ్ కుటుంబాలకు ప్రాధాన్యం లభిస్తుంది. 
లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు.
ప్రవేశాలు ఇలా 
ఒకటో తరగతిలోని మొత్తం సీట్లలో మొదటి 10 సీట్లను జాతీయ విద్యాహక్కు చట్టం మేరకు భర్తీ చేస్తారు. మిగతా సీట్ల విషయంలో ప్రాధాన్య క్రమాన్ని అనుసరిస్తారు. 
రెండు నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రాధాన్యక్రమం ఆధారంగా అడ్మిషన్లను చేపడతారు. ఖాళీల కంటే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎక్కువగా ఉంటే లాటరీ ద్వారా ప్రవేశాలను ఖరారు చేస్తారు. 
తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో హిందీ, ఆంగ్లం, గణితం, సైన్స్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సబెక్కు 20 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షలో కనీసం 83 మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దీవ్యాంగులు 25 మార్కులు సాధిస్తేచాలు. 
10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 11వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. ఇందుకోసం 10వ తరగతి ఫలితాలు వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ప్రక్రియను మొత్తం 20 రోజుల్లో పూర్తి చేస్తారు. 11వ తరగతిలో సైన్స్ కామర్స్, హ్యూమానీటీస్ గ్రూప్లు ఉంటాయి. ఇందులో సైన్స్ స్ట్రీమ్ లో ప్రవేశానికి 10వ తరగతిలో 60 శాతం మార్కులు, కామర్స్ స్ట్రీమ్ కోసం 55 శాతం మార్కులు రావాలి. హ్యూమానిటీస్ కోసం కనీస ఉత్తీర్ణత సరిపోతుంది. అయితే ఈ నిబంధనలు కేంద్రీయ, కేంద్రీయేతర విద్యార్థులకు వేర్వేరుగా ఉంటాయి.
ఎక్కడ ఉన్నాయి? 
రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల వివరాలు.. అనంత పురం, భీమునిపట్నం (ఐఎన్ఎస్ కళింగు), ఏలూరు, గుంత కల్, గుత్తి, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీ పట్నం, నెల్లూరు, తిరుపతి -1, 2, విజయవాడ - 1, 2, ఓఎన్జీసీ రాజమండ్రి, ఒంగోలు, రాజంపేట, శ్రీకాకుళం, సూర్యలంక (బాపట్ల), తెనాలి, వాల్తేర్, విశాఖపట్నం - ఎన్ ఏడీ, విశాఖపట్నం - మల్కాపురం, విశాఖపట్నం - నెం.1 నౌసేనాబాగ్, విశాఖపట్నం - నెం.2 నౌసేనాబాగ్, విశాఖప ట్నం - నెం.1 శ్రీవిజయ్నగర్, విశాఖపట్నం - నెం.2 శ్రీవిజ య్ నగర్, విశాఖపట్నం - స్టీల్ ప్లాంట్, సత్తెనపల్లి, వెంటక టగిరి. వీటికి అదనంగా గుంటూరుజిల్లా నాదెండ్లమండలం ఇర్లపాడు గ్రామంలో, ప్రకాశం జిల్లా కందుకూరు లోనూ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం మార్చీ 1న ఆమోదం తెలిపింది.

ఫీజులు చాలా స్వల్పం 
కేంద్రీయ విద్యాలయాల్లో ఫీజులు చాలా స్వల్పం. ఈ సంస్థల్లో అడ్మిషన్ ఫీజు, డెవలప్ మెంట్ ఫీజు, ట్యూషన్ ఫీజు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫీజులను వసూలు చేస్తారు. అయితే ఈ ఫీజులన్నీ కలిపి 1- 5వ తరగతి వరకు నెలకు రూ. 500 - 600, 6 - 10వ తరగతి వరకు నెలకు రూ.1000 లోపు మాత్రమే ఉంటాయి. బాలికలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తారు.
దరఖాస్తు ఇలా 
ముందుగా ఆసక్తి ఉన్న కేంద్రీయ విద్యాలయాను ఎంచుకో వాలి. తరవాత kvSonlineadmission.in, http:// kvsangathan.nic.in/ వెబ్ సైట్ల ద్వారా ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ముందు ప్రవేశ మార్గదర్శ కాలను (అడ్మిషన్ గైడ్ లైన్స్) క్షుణ్నంగా చదవడం మంచింది. దరఖాస్తును సమర్పించిన తరవాత యూనిక్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఇదే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్గా ఉపయోగపడుతుంది. ప్రవేశాలకు సంబంధించిన అన్ని రకాల వివరాలను తెలుసుకోవడానికి ఈ నెంబర్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి అడ్మిషన్ ప్రక్రియ ముగిసేవరకు దీన్ని భద్రపరుచుకోవాలి. దరఖాస్తులో ఏవైనా పొర పాట్లు ఉంటే గడువు తేదీలోపు ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎన్ని సార్లయినా సరి చేసుకోవచ్చు. వెబ్ సైట్లోని అప్లికేషన్ స్టేటస్ లింక్ లేదా దరఖాస్తు చేసుకున్న పాఠశాల నోటీస్ బోర్డ్ ద్వారా అడ్మిషన్ ఖరారుకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు.
ముఖ్య సమాచారం 
దరఖాస్తు, గడువు : 1వ తరగతిలో ప్రవేశాలకు మార్చి 1 నుంచి 14వ తేదీ సాయంత్రం 4 గంటలవరకు. 
మిగిలిన తరగతులకు : 2వ తరగతి నుంచి పై తరగతులకు (11వ తరగతి మినహా) ప్రవేశాలకు గడువు : ఏప్రిల్ 2వ తేదీ నుంచి 9 తేదీ సాయంత్రం 4 గంటల వరకు. 
వయసు: 1వ తరగతిలో ప్రవేశానికి మార్చి 31వ తేదీ నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి. ఏడేళ్లలోపు వారికే ప్రవేశం ఉంటుంది. మిగతా తరగతుల విషయానికొస్తే 2వ తరగతికి 6 -8 ఏళ్లు, 3వ తరగతికి 7-8 ఏళ్ళు, 4వ తరగతికి 8-10 ఏళ్ళ 5వ తరగతికి 9 - 11 ఏళ్లు. 6వ తరగతికి 10 - 12 ఏళ, 7వ తరగతికి 11 - 18 ఏళ్లు, 8వ తరగతికి 12 - 14 ఏళ్లు, 9వ తరగతికి 18 - 15 ఏళ్లు, 10వ తరగతికి 14 - 16 ఏళ్లు ఉండాలి (మార్చి 31వ తేదీ నాటికి). దివ్యాంగులకు వయోపరిమితిలో రెండేళ్ల సడలింపు ఇస్తారు. 
వెబ్ సైట్లు: kvsonlineadmission.in,http://kvsangathan.nic.in/
రిజర్వేషన్లు ఇలా 
15 శాతం సీట్లను ఎస్సీలకు.. 7.5 శాతం సీట్లను ఎస్టీలకు, 8 శాతం సీట్లను దివ్యాంగులకు రిజర్వు చేస్తారు. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. జాతీయ విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనల మేరకు 10 సీట్లను ఉచిత బోధనా పద్దతిలో భర్తీ చేస్తారు. లాటరీ ద్వారా వీరి ఎంపిక ఉంటుంది. ఒకటో తరగతిలో ఆర్ ఈటీ కింద ప్రవేశం పొందితే పాఠశాల చదువు పూర్తయ్యే వరకు ఉచిత బోధన లభిస్తుంది.
ఒత్తిడి లేని విద్య 
కార్పొరేట్ సంస్కృతికి భిన్నంగా పిల్లలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చాయుత వాతావరణంలో నాణ్యమైన విద్యను కేంద్రీయ విద్యాలయాలు అందిస్తాయి. విద్యతోపాటు అన్ని రంగాల్లో విద్యార్థి సర్వోతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా అన్ని రకాల కార్యకలాపాలు ఉంటాయి. ముఖ్యంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగకు ప్రాధాన్యం ఇస్తారు. ఒకటో తరగతి నుంచే సాంకేతిక పరిజ్ఞానంతో పరిచయం.. శాస్త్రసాంకేతికతపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు ఉంటాయి. మిగిలిన పాఠశాలలకు భిన్నంగా దీని పనివేళలు.. సెలవులు ఉంటాయి. విద్వతోపాటు ఆట పాటలకు తగిన ప్రాధాన్యం ఇస్తారు.


Kendriya Vidyalaya Admission 2019-20 Notification,Kendriya Vidyalaya Admission  Notification 2019-20,,kendriya vidyalaya admission notification,kendriya vidyalaya admission notification 2019-20 for class 1,kendriya vidyalaya online admission notification,kendriya vidyalaya admission 2019-20 date notification,kendriya vidyalaya admission notification 2019-20,kendriya vidyalaya admission notification 2019,kendriya vidyalaya admission notification 2019-20,kendriya vidyalaya admission notice for class 1,kendriya vidyalaya admission notification for 2019-20,admission notification in kendriya vidyalaya,admission notification of kendriya vidyalaya,kendriya vidyalaya sangathan admission notification,kendriya vidyalaya class 1 admission notification 2019
Previous
Next Post »
0 Komentar

Google Tags