పాఠశాల, కాలేజీల
అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 8th February Information
చరిత్రలో
ఈరోజు
➥పూర్వ భారత రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 1897 వ సం.లో
జన్మించారు.
➥సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు ఆండ్ర
శేషగిరిరావు 1902 వ సం.లో జన్మించారు.
➥తెలుగు పత్రికారంగ ప్రముఖుడు పొత్తూరి వెంకటేశ్వర రావు 1934 వ సం.లో
జన్మించారు.
➥ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ 1941 వ సం.లో
జన్మించారు.
➥భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్ ముహమ్మద్ అజహరుద్దీన్ 1963 వ సం.లో
జన్మించారు.
➥నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన
కె.ఎం.మున్షీ 1971 వ సం.లో మరణించారు.
➥వీర తెలంగాణా విప్లవ పోరాట యోధుడు మంచికంటి రాంకిషన్ రావు 1995 వ సం.లో
మరణించారు.
నేటి
అంశము:
గ్లోబును ఎవరు తయారుచేశారు ?
గ్లోబు మీద ప్రపంచ దేశాల న్నింటి
రూపాలు చిరు నామాలు (చూడొచ్చు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో గ్లోబు ఉంటుంది. ఇంతకీ
గ్లోబును మొదటిసారిగా రూపొందిచిన వారు జర్మనీకి చెందిన మ్యాప్ మేకర్ మార్టిన్ బెహా
యిమ్ 1492లో తయారు చేశాడు. నికోలస్ కోపర్ని కస్ ని స్పూర్తిగా తీసుకొని తాను కూడా
ఏదో ఒక పనిచేసి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు బెహా యిమ్. అందుకే
ఎంతో కష్టపడి తెలివితేటలతో గ్లోబ్ ను రూపొందించి ప్రపంచ ప్రసిద్ది చెందాడు.
మంచి
మాట /సుభాషితం:
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
భావం- ఏ వస్తువయైనా సరే తమ తమ
స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహ భాందవ్యం చక్కగా సాగుతుంది.ఎపుడయితే ఆ
స్థానాలు విడిచిపెడతారో తమ మిత్రులే శత్రువులుగా మారతారు.కమలము నీటిలో ఉన్నంతవరకే
సూర్యకాంతికి వికసించును.ఎపుడైతే నీటిని విడుచునో అదే సూర్యకాంతికి వాడిపోవును.
వార్తలలోని
ముఖ్యాంశాలు
➥కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓడరేవు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సౌభాగ్యానికి ముఖద్వారంగా మచిలీపట్నం ఓడరేవు మారనుందని
ఈ సందర్భం గా తెలిపారు.
➥కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన
హామీల ఊసే లేదని, రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోలేదని లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా
ఎంపీ గల్లా జయదేవ్ ధ్వజమెత్తారు. ఏపీకిచ్చిన హామీలు, నెరవేర్చిన
వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
➥రానున్న వానాకాలం సీజన్‌లో శ్రీరామసాగర్ ప్రాజెక్టు పరిధిలో 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు
అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లను ఆదేశించారు.
➥తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా జగిత్యాల జిల్లాలో కోరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో
కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
➥ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను పావు శాతం తగ్గించింది.
దవ్యోల్బణం నియంత్రిత స్థాయిలోనే ఉన్నందున, వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలు
కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహా, వాహన
ఇతర రుణాలు చౌక అవుతాయి.
➥ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని బైరాంగఢ్ అటవీ ప్రాంతంలో
గురువారం భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.
➥ఓటు వేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా
ఓటింగ్ శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలు వంటి అనేక అంశాలతో దేశవ్యాప్తంగా భారీ సర్వేకు కేంద్ర
ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.
➥రంజీ ట్రోఫీని విదర్భ చేజిక్కించుకుంది.
నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఫైనల్లో బంతి, బ్యాటుతో
ఆకట్టుకున్న ఈ జట్టు 78 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించి
విజేతగా నిలిచింది.
పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.
సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.
0 Komentar