పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 11th March
Information
చరిత్రలో ఈరోజు
➥1990
: సోవియట్
యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
➥1999
: అమెరికాలోని
నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్
అవతరించింది.
➥2009: వన్డే
క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్
రికార్డు సృష్టించాడు.
➥తెలంగాణ
రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చెన్నబోయిన కమలమ్మ 1926 వ
సం.లో జన్మించారు , ఇదే రోజు 2018 వ
సం.లో మరణించారు.
➥పెన్సిలిన్
ను కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1955 వ సం.లో మరణించారు.
➥ప్రముఖ
తెలుగు రచయిత నేదునూరి గంగాధరం 1970 వ సం.లో మరణించారు.
➥ప్రముఖ
తెలుగు సాహితీకారులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ 1979 వ సం.లో మరణించారు.
➥ప్రముఖ
తెలుగు రచయిత కె.ఎన్.వై.పతంజలి 2009 వ సం.లో మరణించారు.
➥శాస్త్రీయ
సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు శ్రీపాద పినాకపాణి
2013 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
హల్లులు లేదా ప్రాణులు లేదా వ్యంజనములు
ప్రధానంగా మూడు రకాలు
1. పరుషములు: పలుకడానికి కొంత శ్రమ అవుసరమైనవి. వీటికి
"శ్వాసములు" అన్న పేరు కూడా ఉంది.
అవి: క,చ,ట,త,ప
2.సరళములు : తేలికగా పలికేవి. వీటికి "నాదములు" అన్న పేరు
కూడా ఉంది.
అవి: గ,జ,డ,ద,బ
3.స్థిరములు: పరుషములు, సరళములు కాక
మిగిలినవి స్థిరములు.
అవి: ఖ,ఘ,ఙ,
ఛ,ఝ,ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, ఫ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ
మంచి మాట:
తనకు లేని వాటి కోసం విచారించక, తనకు
ఉన్నవాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు - రమణ మహర్షి
నేటి జీ.కె
ప్రశ్న: విద్యుత్
ఆవేశానికి ప్రమాణం ఏది?
జ: కూలుంబు
వార్తలలోని ముఖ్యాంశాలు
>పాఠశాలలు
తెరిచే నాటికి విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుల్లో ఐదుగురిని మార్చేసింది.
> తెలంగాణలో
ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
వెల్లడించారు.
> వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 16 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ
నిర్ణయించింది.
> మంత్రివర్గ సమావేశంలో
తీసుకున్న నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి కార్యదర్శుల కమిటీని
ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
> కరోనా వైరస్ వ్యాప్తికి, ఉప్ణోగ్రతలకు సంబంధంలేదని దిల్లీకి చెందిన పలువురు నిపుణులు తెలిపారు.
> కరోనా
వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో బంగ్లాదేశ్, మయాన్మార్
వెంబడి ఉన్న తమ సరిహద్దులను మూసేయాలని మిజోరాం, మణిపూర్
రాష్ట్రాలు నిర్ణయించాయి.
> కరోనా వైరస్ భయంతో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం
టోర్నీ నిర్వహణకు వ్యతిరేకంగా ఉందని సమాచారం.
>అస్ట్రేలియాలోనే
అత్యంత ఎత్తైన పర్వతమైన 'మౌంట్ కోసిసుజ్కో'( 2,228 మీటర్ల)ను భారత్‌కు చెందిన పర్వతారోహకురాలు భావన దెహారియా సోమవారం
అధిరోహించారు.
>భారత జావెలియన్ త్రోయర్ శివ్‌పాల్ సింగ్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత
సాధించాడు.
Today's news
Dt.11-03-2020
1.India shut
Manipur border with Myanmar indefinitely to curb coronavirus spread
2.ED slaps Rs 5
crore penalty on Shriram Transport Finance
3.TS Govt
decided to dispose of all assets of Rajiv Swagruha
4.: An
Indian-origin man has been sentenced to 7 years in prison in the US in rape
case
5.11-year-old
twin Jain monks exhibited unique memory
skills in Hyderabad
6.Yoga can
improve sperm quality: CCMB study said
7.The State’s
per-capita income is growing faster than that of the country.
8.Illegal
explosives has been seized from quarry in Khammam
9.The Ministry
of Finance has said GST evasion to the tune of Rs 1,874.13 crore was found in
TS
School Assembly 11th March
Information, School Assembly,prayer songs, Assembly information, historical
events, information of the day, news of the day, golden words,today golden
words, moral sentences, today's importance, headlines in the news, March month school
assembly day wise, March 2020 school assembly, March 2020 school assembly
information, today's topic, నేటి
ప్రాముఖ్యత, చరిత్రలో ఈ రోజు, నేటి
అంశము, మంచి మాట / పద్యం, వార్తలలోని
ముఖ్యాంశాలు, 11th March 2020 assembly, 11th March 2020 assembly, news of
the day history
0 Komentar