పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....
School Assembly 5th March
Information
నేటి ప్రాముఖ్యత
అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.
ప్రపంచ బధిరుల దినం.
చరిత్రలో ఈరోజు
*1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.
*1931: రాజకీయ ఖైదీల విడుదల ఒప్పందం పై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా
గాంధీ సంతకం.
*ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్
బహుమతి గ్రహీత జేమ్స్ టోబిన్ 1918 వ సం.లో జన్మించారు.
*తెలుగు సాహిత్యంలో కవి మధునాపంతుల సత్యనారాయణ
శాస్త్రి 1920 వ సం.లో జన్మించారు.
* బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా 1827
వ సం.లో మరణించారు.
*ప్రముఖ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ
శాస్త్రజ్ఞుడు పియర్ సైమన్ లాప్లేస్ 1827 వ
సం.లో మరణించారు.
*గొప్ప కవి, శతావధాని
గాడేపల్లి వీరరాఘవశాస్త్రి 1945 వ సం.లో మరణించారు.
*ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు పిఠాపురం
నాగేశ్వరరావు 1996 వ సం.లో మరణించారు.
*ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు
మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు కొంగర జగ్గయ్య 2004 వ సం.లో మరణించారు.
*తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు
భరతనాట్య నర్తకి రాజసులోచన 2013 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
భౌతికమైన నమూనా 'కిలో' రాయికి బదులు విద్యుత్‌శక్తి ద్వారా కొత్త నిర్వచనం
కిలో
అంటే? వెయ్యి గ్రాములు. కానీ.. దాన్ని నిర్వచించేది ఎవరు? కిలోరాళ్లన్నిటికీ
తల్లిలాంటి కిలోరాయి ఒకటి ఫ్రాన్స్‌లో భూగర్భంలో ఉంది. ప్లాటినం, ఇరీడియంతో
తయారుచేసిన ఆ ‘తల్లి కిలోరాయి’ని శాస్త్రజ్ఞులు కాలగర్భంలో
కలిపేసి.. కిలోను విద్యుత్ శక్తితో కొలిచి సరికొత్త నిర్వచనాన్నిచ్చారు. కొత్త
కిలోను.. ‘ఎలక్ట్రికల్
కిలో’ అంటారు. ఇప్పటిదాకా ఉన్న పద్ధతి ప్రకారం.. ప్రపంచంలోని అన్ని దేశాలూ
తమతమ నమూనా కిలోరాళ్లను ఫ్రాన్స్‌కు తీసుకొచ్చి ‘లీ గ్రాండ్ కే’తో సరిపోల్చుకోవాల్సి వచ్చేది. కొత్తపద్ధతిలో ఆ బాధ లేదు. కిబుల్
బ్యాలెన్స్ సాయంతో ఏ దేశమైనా ఎప్పుడైనా కిలో బరువును కచ్చితంగా నిర్ణయించుకునే
వీలుంటుంది.
మంచి మాట:
ఆశను ఎప్పుడూ వదలకు, జీవితంలో నిన్ను నిలిపేది అదొక్కటే-
ఫ్రాంక్లిన్
నేటి జీ.కే.
ప్రశ్న: ట్రకోమ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది ?
జ.
కన్ను
వార్తలలోని
ముఖ్యాంశాలు
> హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
>కరోనా వైరస్ ఫ్లూ కంటే నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ఫ్లూకంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
>ఈ ఏడాది రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలను నిర్వహించడం లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం వెల్లడించారు.
> 10 ప్రభుత్వరంగ బ్యాంకులను 4 ప్రధాన బ్యాంకులుగా ఏకీకృతం చేసే ప్రక్రియకు సంబంధించి చట్టపరమైన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఎటువంటి రెగ్యులేటరీ సమస్యలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.
> 2007 టీ20 ప్రపంచకప్ నుంచి తాజా వెల్లింగ్టన్ టెస్టు వరకు భారత్‌తో తలపడిన నాలుగు ఐసీసీ ఈవెంట్‌లలో కివీస్‌దే పైచేయి
School Assembly 5th March
Information, School Assembly,prayer songs, Assembly information, historical
events, information of the day, news of the day, golden words, today golden
words, moral sentences, today's importance, headlines in the news, March month school
assembly day wise, March 2020 school assembly, March 2020 school assembly
information, today's topic, నేటి
ప్రాముఖ్యత, చరిత్రలో ఈ రోజు, నేటి
అంశము, మంచి మాట / పద్యం, వార్తలలోని
ముఖ్యాంశాలు, 5th March 2020 assembly, 5th March 2020 assembly, news of
the day history,news of the day highlights, 5th march 2020 assembly, march 5th
assembly, dec 5th historical events>కరోనా వైరస్ ఫ్లూ కంటే నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ఫ్లూకంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
>ఈ ఏడాది రాష్ట్రపతి భవన్‌లో హోలీ వేడుకలను నిర్వహించడం లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం వెల్లడించారు.
> 10 ప్రభుత్వరంగ బ్యాంకులను 4 ప్రధాన బ్యాంకులుగా ఏకీకృతం చేసే ప్రక్రియకు సంబంధించి చట్టపరమైన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఎటువంటి రెగ్యులేటరీ సమస్యలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.
> 2007 టీ20 ప్రపంచకప్ నుంచి తాజా వెల్లింగ్టన్ టెస్టు వరకు భారత్‌తో తలపడిన నాలుగు ఐసీసీ ఈవెంట్‌లలో కివీస్‌దే పైచేయి
0 Komentar