Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 6th March Information

పాఠశాల, కాలేజీల అసెంబ్లీ నిర్వాహణ కొరకు.....

School Assembly 6th March Information


నేటి ప్రాముఖ్యత
ఘనా గణతంత్ర దినోత్సవం.
చరిత్రలో ఈరోజు
*1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.
*1983: అమెరికా తొలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం.
*ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 1899 వ సం.లో జన్మించారు.
*సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ 1919 వ సం.లో జన్మించారు.
*ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి కృష్ణకుమారి 1933 వ సం.లో జన్మించారు.
*సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు దువ్వూరి వేంకటరమణ శాస్త్రి 1976 వ సం.లో మరణించారు.
*దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ 1995 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
దిక్సూచి ఎప్పుడు ఉత్తర, దక్షిణ దిక్కులనే సూచిస్తుంది ఎందుకు?
దిక్సూచిలోని సూచిక అయస్కాంత పదార్థం, ఈ సూచిక రెండు గాజు పలకల మధ్య స్వేచ్ఛగా తిరిగేటట్లు గాలి ప్రభావానికి లోనుకాకుండా బిగించబడి ఉంటుంది. భూమికి, దిక్సూచిలోని సూచికకు కూడా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయి. రెండు అయస్కాంతాలు దగ్గరున్నప్పుడు ఒకదానికొకటి ఆకర్షించు కోవడం వికర్షించుకోవడం జరుగుతుంది. అలా భూ అయస్కాంతం, దిక్సూచి ల మధ్య ఆకర్షణ, వికర్షణ వల్ల దిక్సూచి ఎప్పుడూ ఓకే దిక్కును సూచిస్తుంది.
మంచి మాట /సుభాషితం:
సిరి చేర్చు బంధువుల నా
సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁ బొగడించునంచు దలపు కుమారా !
భావం- సంపద బంధువులను పెంచుతుంది. సంపద శుభాలను కలుగజేస్తుంది. సంపద వలన స్నేహితులు పెరుగుతారు. సంపద కలిగిన మానవుని గుణవంతునిగా కీర్తిస్తారు.
మంచి మాట
"బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం."
నేటి జీ.కె
ప్రశ్న: గ‌ట్టి క‌ల‌ప ల‌భించు ప్రాంతం ఏది?
జ: అమెజాన్
వార్తలలోని ముఖ్యాంశాలు
> ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈనెల 21, పురపాలక సంఘాలకు ఈనెల 24న గ్రామ పంచాయతీలకు 27న వేర్వేరు తేదీల్లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను అధికారుల బృందం ఎన్నికల కమిషనర్‌ ముందుంచింది.
> తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలు నేడు మొదలు కానున్నాయి. మొదటిరోజు అసెంబ్లీ, మండలి జాయింట్  మీటింగ్  జరుగనుంది. ఇందులో గవర్నర్  తమిళిసై ప్రసంగించనున్నారు.
> కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం ఉచితంగా మందులు, మాస్కులు అందజేయాలని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు.
> దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘజియాబాద్‌లో మరో కేసు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 30కి చేరింది.
>నిర్భయ అత్యాచారం, హత్య కేసులో పటియాలా హౌస్‌ కోర్టు దోషులకు మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది.
> కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం పర్యటన రద్దు అయింది.
> మార్చి 8వ తేదీన మెల్‌బోర్న్‌లో మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్‌తో.. ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌నున్న‌ది.

> కోవిడ్‌19 (క‌రోనా వైర‌స్‌) కు సంబంధించిన జెన‌టిక సీక్వెన్స్‌ను గుర్తించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్రోగ్రామ్‌లో టెక్నిక‌ల్ లీడ్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ మారియా వాన్ కెర్కోవ్ తెలిపారు.


Today's news Dt:06-03-2020
1. Switzerland reported first COVID-19 death
2. Indian-American won big in Texas Congressional primary
3. Baba Punjab  Singh Victim of 2012 US gurdwara shooting died after 8 years
4. Coronavirus cases rose to 30 in India,
5. KCR agreed in principle to provide drinking water to Tamil Nadu
6. Telangana State formed crack team to fight coronavirus
7. 25-bed isolation ward was set up at MGM Hospital in Warangal
8. Shaikpet Sarai in Hyderabad  was   opened for tourists
9. Experts said   Right steps can stop COVID-19 in its tracks
10  India entered into final in Women's T20 world Cup
Find the pleasure of life in every second
Q: When do we celebrate national sports day?
A: On August 29
School Assembly 6th March Information, School Assembly,prayer songs, Assembly information, historical events, information of the day, news of the day,golden words, today golden words, moral sentences, today's importance, headlines in the news, March month school assembly day wise, March 2020 school assembly, March 2020 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజునేటి అంశముమంచి మాట / పద్యంవార్తలలోని ముఖ్యాంశాలు, 6th March 2020 assembly, 6th March 2020 assembly, news of the day history, news of the day highlights, 6th march 2020 assembly, march 6th assembly, dec 6th historical events, 6th March 2020 assembly, March 6th assembly, March 6th historical events,school related today assembly, school related today news
Previous
Next Post »
0 Komentar

Google Tags