భద్రాచలం - సీతా రామచంద్రస్వామి దేవాలయం,
భద్రాచలం
భక్తుల గుండెల్లో కొలువై, సుందర
సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు
శ్రీరామచంద్రుడు. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల
కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని
తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. ప్రపంచం మొత్తం
నుండి లక్షలాది మంది భక్తులను ఆకర్షించే పవిత్ర స్థలం రాముడు కొలువైన భద్రాచలం. ప్రతియేడు
భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం
చెందుతందనేది భక్తుల విశ్వాసం.
భద్రాచలం, తెలంగాణ
రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రం. ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది.
దీనికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం. ఈ పట్టణం, భక్త
రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. భద్రాచలం రెవెన్యూ డివిజను
మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు
రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయములో దీనిని ఖమ్మం జిల్లాలో
విలీనం చేయటం జరిగింది.
0 Komentar