సాధారణంగా పద్దెనిమిదేళ్లు
నిండిన ప్రతి ఒక్కరూ ఎన్నికలప్పుడు పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేస్తారు.
దీంతోపాటు మరికొన్ని రకాల ఓట్లు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
పోస్టల్
బ్యాలెట్: ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ రక్షణ దళాల్లో ఉండే సిబ్బందికి ఈ పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు.
నమూనా ఓటు:
పోలింగ్ బూత్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి గంట ముందు ఈవిఎం చెకింగ్ చేయడానికి
వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు 50 ఓట్లు వేస్తారు. అ
ఓట్ల లెక్కింపు వెంటనే పూర్తి చేసి ఈవీఎంల నుంచి తొలగిస్తారు. అనంతరం అసలైన
పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈవీఎంను చెకింగ్ చేయడానికి వేసే ఈ ఓట్లను నమూనా
ఓట్లు అంటారు.
టెస్ట్ ఓటు: ఓటరు
తన ఓటు వేశాక తాను వేసిన ఓటు గుర్తు వీవీప్యాట్లోని స్లీపలోని గుర్తు సరిగాలేదని
నిర్ణయిస్తే మొదట ఫిర్యాదు చేయాలి. ప్రిసైడింగ్ అధికారి అతనితో మాట్లాడి.. తప్పుడు
అభియోగం అయితే జరిగే పరిణామాలను హెచ్చరిస్తారు. ఓటరు నుంచి రాతపూర్వకంగా ఆమోదం
తీసుకొని పోలింగ్ ఏజెంట్ ముందు ఓటింగ్ మిషన్లో టెస్ట్ ఓటు వేసేందుకు అనుమతి
ఇస్తారు. మళ్లీ టెస్ట్ ఓటు వేసే సమయంలో ఓటర్లు కోరుకున్న అభ్యర్థి గుర్తు కాకుండా
ఇతరుల గుర్తు వీవీప్యాట్ స్లిప్పులో కనిపిస్తే ఓటింగ్ నిలిపివేస్తారు. ఒకవేళ సదరు
ఓటరు చేసిన ఆరోపణ తప్పుగా తేలితే రెండో ఎంట్రీకి ఎదురుగా సంబంధిత ఓటరు ఏ అభ్యర్థి
పక్షాన ఓటు వేసింది రాసి, అతడి సంతకం కాని వేలిముద్రను తీసుకుని
పోలీసులకు అప్పగిస్తారు.
టెండర్ ఓటు: ఓ
వ్యక్తి ఓటు వేసేందుకు పోలింగ్ బూతకు వెళ్లినప్పుడు అతని ఓటు అంతకు ముందే ఎవరైనా
వేసి ఉంటే అప్పుడు అతడు టెండర్ ఓటు వేయవచ్చు. ఆ వ్యక్తి నిజమైన ఓటరుగా
నిర్ధారించుకున్నాకే అక్కడి పోలింగ్ అధికారి అతనికి బ్యాలెట్ ఇస్తాడు. ఇలాంటి
వారికీ ఈవీఎంలో బటన్ నొక్కే అవకాశం ఉండదు. అతడి బ్యాలెట్ ను సీల్డ్ కవర్లో
భద్రపరుస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల ఓట్ల లెక్కింపు అనంతరం సమానంగా
ఓట్లు వస్తే ఈ టెండర్ ఓటును పరిగణనలోకి తీసుకుంటారు.
చాలెంజ్ ఓటు: ఇది
కూడా అతి ముఖ్యమైనదే. ఓటరు పోలింగ్ బూత్ కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పోలింగ్
ఏజెంట్ల నుంచి అసలు ఇతను ఓటరు కాదని అభ్యంతరం చెబితే.. సదరు వ్యక్తి చాలెంజ్ ఓటు
వేయవచ్చు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి పోలింగ్ అధికారి రూ.2 తీసుకొని రసీదు ఇస్తారు. ఓటరు, ఏజెంట్ అక్కడ ఉన్నత
ఇతర ఓటర్ల నుంచి పోలింగ్ అధికారి వివరాలు తీసుకుంటారు. అసలైన ఓటరుగా నిర్ధారణ
అయితే అతనికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అసలైన ఓటరుగా నిర్ధారణ కాకుంటే
పోలీసులకు అప్పగిస్తారు. చాలెంజ్ ఓటు వేసిన వ్యక్తి పేరు అతని చిరునామాను ఫారం 14లో నమోదు చేస్తారు.
ఫ్రాక్సీ
ఓటింగ్: కొన్ని రకాల సర్వీసు ఓటర్లనే ఫ్రాక్సీ ఓటర్లు అని
అంటారు. భద్రతా బలగాలు, రక్షణ రంగాల్లో పనిచేసే వారికి ఫ్రాక్సీ
విధానం ద్వారా ఓటు వేసే అవకాశముంటుంది. వారు స్థానికంగా లేనందున ఓటు వేసేందుకు ఒక
ప్రతినిధిని అధికారులు అనుమతిస్తారు. వీరిని క్లాసిఫైడ్ సర్వీసు ఓటరుగా
గుర్తిస్తారు. నియోజకవర్గం, పోలింగ్ బూత్ పరిధిలోని
ప్రాక్సీఓటరు వివరాలపై ఆర్ ద్వారా ప్రిసైడింగ్ అధికారికి ముందే సమాచారం అందుతుంది.
సర్వీసు ఓటరు తరపున వచ్చే ప్రాక్సీ ఓటరు ఆ పోలింగ్ బూత్ పరిధిలోని మిగతా ఓటర్ల
మాదిరిగానే ఓటు వేస్తారు. అయితే సాధారణ ఓటరుకు కుడి చేతికి సిరాచుక్క పెడితే..
ప్రాక్సీ ఓటరుకు మధ్య వేలికి చుక్క పెడతారు. ఏమంటే.. ఆయన తన సొంత ఓటు వేసినప్పుడు
చూపుడు వేలికి సిరాచుక్క పెట్టాల్సి ఉంటుంది. కాగా, ఫ్రాక్సీ
ఓటరు తన ఓటు కాక ఒకరికి మాత్రమే ఫ్రాక్సీగా ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది.
Different types of votes / General Elections-2019 / ఎలక్షన్స్-2019 / useful information for election process-2019 / Andhrapradesh Assembly elections-2019 / General elections useful information / Elections -2019 / Telangana Parlament elections-2019 / Andhrapradesh Parlament elections-2019 / Parlament elections-2019 / Useful information for PO, APO & OPO / Polling officers useful information / పోస్టల్ బ్యాలెట్ / నమూనా ఓటు / టెస్ట్ ఓటు / టెండర్ ఓటు / చాలెంజ్ ఓటు / ఫ్రాక్సీ ఓటింగ్
0 Komentar