DIKSHA Portal or APP : విద్యార్థులకు
ఇంట్లోనే పాఠాలు... DIKSHA Portal లేదా యాప్‌తో సాధ్యం...
* DIKSHA Portal
| దీక్ష యాప్‌ను ఇంగ్లీష్, హిందీ భాషల్లో
ఉపయోగించుకోవచ్చు. ఇందులో లొకేషన్‌ని బట్టి కోర్సులు కనిపిస్తాయి. ఉదాహరణకు
హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేస్తే ఈ ప్రాంతంలో విద్యా విధానాన్ని బట్టి పుస్తకాలు,
కోర్సులు ఉంటాయి.
* ఇంట్లోనే
ఉంటూ ఆన్‌లైన్‌లో చదువుకోవడానికి, నేర్చుకోవడానికి అనేక
అవకాశాలున్నాయి. ఇందుకోసం ఉచిత ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌ని గతంలోనే
ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ-MHRD,
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్-NCTE కలిసి
దీక్ష పేరుతో డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ని రూపొందించాయి. వెబ్‌సైట్‌తో పాటు
యాప్ కూడా ఉన్నాయి. విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా
ఇందులో చదువు కొనసాగించొచ్చు.
* NCERT రూపొందించిన పాఠ్యపుస్తకాలన్నింటికీ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీక్ష యాప్
డౌన్‌లోడ్ చేసుకొని క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే సంబంధిత టాపిక్స్ ఓపెన్
అవుతాయి. ఆ టాపిక్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. విద్యార్థులు స్టడీ
మెటీరియల్‌ను ఇక్కడ యాక్సెస్ చేయచ్చు. పాఠాలు నేర్చుకున్న తర్వాత సెల్ఫ్ అసెస్‌మెంట్
ప్రాక్టీస్ ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు.
* ఉపాధ్యాయులు
కూడా లెస్సన్ ప్లాన్స్, వర్క్ షీట్స్, యాక్టివిటీస్
కోసం దీక్ష ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు. మరి మీరు కూడా దీక్ష యాప్‌లో ఉన్న
పాఠ్యపుస్తకాలను యాక్సెస్ చేయాలంటే https://diksha.gov.in/ వెబ్‌సైట్
ఓపెన్ చేయండి. లేదా దీక్ష యాప్ డౌన్‌లోడ్ చేయడానికి క్రింది లింక్ ను క్లిక్
చేయండి...
Very useful to teachers
ReplyDelete