PO, APO, OPO'S ఎవరెవరు
ఏ ఏ భాద్యతలు నిర్వహించాలి?
PO (Polling officer)
పోలింగ్
సక్రమంగా జరిగెటట్లు చూసే బాధ్యత పీఓదే. పోలింగ్ సమయంలో వచ్చే సందేహాలను నివృత్తి
చేసే బాధ్యత కూడా పీఓదే. పోలింగ్ సమయంలో అందరినీ మానిటర్ చేసే బాధ్యత కూడా పీఓదే. పరిస్థితిని
బట్టి
(సిబ్బంది తక్కువగా ఉన్న పక్షంలో) శాసనసభ CU కి
ఇంచార్జ్ గా కూడా వ్యవహరించాల్సి వస్తుంది. అంటే ఓటర్ తెచ్చిన పింక్ స్లిప్
తీసుకుని CU లో ఓటు రిలీజ్ చేయాలి.
(1) ఫస్ట్ పోలింగ్
ఆఫీసర్(A.P.O.): (మార్క్డ్ కాపీ ఓటర్ల లిస్టు ఇంచార్జీ) :
ఓటరు స్లిప్పు
మరియు గుర్తింపు కార్డు తీసుకొని మొదటి పోలింగ్ ఆఫీసర్ దగ్గరకు వచ్చును. ఇతను ఓటరు
పేరు,
సీరియల్ నెంబరు పెద్దగా చదివి, ఓటరు మగవారు
అయితే పేరు క్రింద అండర్ లైన్ చేయాలి. ఓటరు ఆడవారు అయితే పేరు క్రింద అండర్ లైన్
చేసి సీరియల్ నెంబరును టిక్ చేయాలి. (ఓటరు 12 రకాల గుర్తింపు
కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాలి).
(2) సెకండ్
పోలింగ్ ఆఫీసర్ (OPO.): (ఇంక్ మరియు ఓటర్ల రిజిష్టర్
ఇంచార్జీ).
ఇతను ఓటరు
ఎడమచేతి చూపుడువేలుకు ఇంక్ పూయాలి. ఓటర్ల రిజిష్టరు (For-17A)లో ఓటరు సీరియల్ నెంబరు రాయాలి. గుర్తింపు కార్డు పేరు రాయాలి. (ఎపిక్
/ఆధార్ /పాన్/డ్రైవింగ్ లైసెన్స్/పాస్పోర్టు). ఈ రిజిష్టరులో ఓటరు సంతకము
వేలిముద్ర తీసుకోవాలి. ఇతనే ఎడమ చూపుడువేలుపై నిలువుగీతను/గుర్తును చెరగని సిరాతో
పెట్టాలి.
(3) ధర్డ్ పోలింగ్
ఆఫీసర్ (OPO.): (ఓటరు స్లిప్పుల ఇంచార్జీ):
పార్లమెంటు
(వైట్ కలర్) మరియు అసెంబ్లీ (పింక్ కలర్) స్లిప్పుల మీద ఓటరు సీరియల్ రాయాలి. ఈ
స్లిప్పుల మీద ధర్త్ పోలింగ్ ఆఫీసర్ సంతకం చేసి ఆ స్లిప్పులను ఓటరుకు ఇవ్వాలి.
(4) ఫోర్త్
పోలింగ్ ఆఫీసర్ (OPO.): (పార్లమెంటు కంట్రోల్ యూనిట్
ఇంచార్జీ):
ఇతర ఓటరు
ఇచ్చిన వైట్ కలర్ స్లిప్పులను తీసుకోవాలి. కంట్రోల్ యూనిట్లో Ballot బటన్ ను నొక్కాలి. ఓటరు పార్లమెంటు కంపార్టుమెంటులోకి వెళ్ళి ఓటు వేయును.
(5) ఫిఫ్ పోలింగ్
ఆఫీసర్ (OPO.): (అసెంబ్లీ కంట్రోల్ యూనిట్ ఇంచార్జీ):ఇతను
ఓటరు ఇచ్చిన పింక్ కలర్ స్లిప్పును తీసుకోవాలి. కంట్రోల్ యూనిట్లో Ballot బటన్ ను నొక్కాలి. ఓటరు అసెంబ్లీ కంపార్టుమెంటులోకి వెల్లి ఓటు వేయును.
DUTIES OF PO , APO & OPOs / General Elections-2019 / ఎలక్షన్స్-2019 / useful information for election process-2019 / Andhrapradesh Assembly elections-2019 / General elections useful information / Elections -2019 / Telangana Parlament elections-2019 / Andhrapradesh Parlament elections-2019 / Parlament elections-2019 / Useful information for PO, APO & OPO / Polling officers useful information / PO, APO, OPO'S ఎవరెవరు ఏ ఏ భాద్యతలు నిర్వహించాలి? / Duties of polling officers
0 Komentar