'మై ఓట్ క్యూ' యాప్
ఓటెయ్యాలని
ఆసక్తి ఉన్నా.. పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ చూసి కొంత మంది వెనక్కి వెళ్లిపోతారు.
ఈ దఫా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలనే కృతనిశ్చ యంతో ఉన్న ఎన్నికల సంఘం
అధికారులు కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 'మై ఓట్ క్యూ' అనే ఈ యాప్ సాయంతో ఓటర్లు తమ పరిధిలోని
పోలింగ్ కేంద్రాల్లోని రద్దీ వివరాలను తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఉంటే
పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్ ఎంత పొడవు ఉంటుందో.. ఎంత సేపు లైన్లో నిలబడాలో ఎంత
సమయం పడుతుందో? అనే టెన్షన్ అక్కర్లేదు. ఇంటి నుంచే క్యూ
లైన్ గురించి తెలుసుకోవొచ్చు. దీంతో ఓటర్లు తక్కువగా సమయంలో అక్కడికి వెళ్లి
ఎంచక్కా ఓటువేసి రావొచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడలో ఈ యాప్
పనితీరును. పరిశీలించారు. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో
అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్నికల
అధికారులు చెప్పారు. ఈ యాపను . గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్
చేసుకోవచ్చన్నారు.
My Vote Q Android app / General Elections-2019 / ఎలక్షన్స్-2019 / useful information for election process-2019 / Andhrapradesh Assembly elections-2019 / General elections useful information / Elections -2019 / Telangana Parlament elections-2019 / Andhrapradesh Parlament elections-2019 / Parlament elections-2019 / Useful information for PO, APO & OPO / Polling officers useful information / 'మై ఓట్ క్యూ' యాప్ / My vote q useful android app
0 Komentar