Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Online course on APeKX DISKHA to all teachers in the Andhrapradesh

Online course on APeKX DISKHA to all teachers in the Andhrapradesh

ఉపాధ్యాయులకు...ఆన్‌లైన్‌ శిక్షణ వివరణ
➤ఉపాధ్యాయులకు వేసవి శిక్షణా తరగతులు ఈసారి భిన్నంగా జరుగనున్నాయి. సాధారణంగా ఉపాధ్యాయలు వృత్యంతర శిక్షణకు నేరుగా హాజరయ్యేవారు. ఈసారి ఇంటి నుంచే శిక్షణ పొందే అవకాశాన్ని ఎస్‌సీఈఆర్టీ (రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణామండలి) కల్పించింది. ఉపాధ్యాయులు వారి వారి చరవాణుల్లో దీక్షయాప్‌ను పొందుపర్చుకోవాల్సి ఉంటుంది.
➤ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యార్థుల ప్రగతిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే (నాస్‌), స్టూడెంట్స్‌ లెవల్‌ అఛీవ్‌మెంట్‌ టెస్ట్‌ (స్లాస్‌) నిర్వహించారు. తద్వారా విద్యార్థుల స్థాయిని గుర్తించారు. దీని ఆధారంగా విద్యాప్రణాళికను రూపొందించారు. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఈ శిక్షణ తీసుకోవాలి.
➤ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా మే ఒకటో తేదీ నుంచి 7వ తేదీ లోపు తమ పేరును దీక్ష యాప్‌లో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఎపిఇకెఎక్స్‌ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే సరే.. లేకపోతే లాగిన్‌జోన్‌లోకి వెళ్లాలి. అక్కడ టీచర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్‌ అయితేనే శిక్షణ పొందాల్సిన కార్యక్రమాలు తెలుస్తాయి. అక్కడ మొబైల్‌ నెంబరు అడుగుతుంది. ఇప్పటికే అధికారికంగా సీఎస్‌ఈసైట్‌లో ఉన్న మొబైల్‌ నెంబరును ఇవ్వాలి. అప్పుడు ఇచ్చిన మొబైల్‌ నెంబరు లేకపోతే ట్రెజరీకోడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అక్కడే ఒక ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది.
దీక్షయాప్‌ ప్లేస్టోర్‌ నుంచి (ఆండ్రాయిడ్ వెర్షన్ మాత్రమే)
➤ఉపాధ్యాయులంతా తమ చరవాణిలో దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దాన్ని ఓపెన్‌ చేశాక విద్యార్థి, ఉపాధ్యాయుడు అని వస్తుంది. అందులో ఉపాధ్యాయుడు అనే దానిపై క్లిక్‌ చేస్తే అంతకు ముందు రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన మొబైల్‌ నెంబరు, పాస్‌వర్డ్‌ నమోదు చేసి కోర్సు సెల్‌లోకి వెళ్లాలి.
కోర్సులో ఏమి ఉంటాయి.. ?
➤ప్రాథమిక ఉపాధ్యాయులకు ఒక కోర్సు, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో భాషా ఉపాధ్యాయులకు ఒక కోర్సు, సబ్జెక్టు ఉపాధ్యాయులకు మరో కోర్సు ఉంటుంది. వీటిలో ఎవరికి వర్తించే కోర్సు వాళ్లు పూర్తి చేయాలి. 8 వీడియోలు, 7 పీడీఎఫ్‌లు, 5 ఈసీఎంఎల్‌ ఉంటాయి. వీటిని ఈనెల 31వలోపు ఎప్పుడో ఒకప్పుడు చూడాలి. వీడియో మొత్తం చూశాక నూరుశాతం పూర్తి చేసినట్లు స్టేటస్‌ పైన కనిపిస్తుంది. తర్వాత పరీక్ష రాయాలి. దానిలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. వాటికి జవాబు రాయాలి.
ఉపాద్యాయులకు Apekx/DIKSHA  ఆన్లైన్ కోర్సు వివరాలు సంక్షిప్తం గా....
➤కోర్సు మే 1 నుండి ప్రారంబించబడుతుంది. కోర్సు వ్యవధి 01-05-2019 నుండి 31-05-2019 (ఒక నెల)
➤అన్నీ స్థాయిలలోని (1-10th class ) ఉపాద్యాయులు ఎన్రోల్ల్మెంట్ చేసుకోవాలి . దీనికి చివరి తేదీ 7
➤రిజిస్టర్ చేసుకొనివారు వీలైనంత త్వరగా రిజిస్టర్ చేసుకోగలరు
➤ఆన్లైన్ నందు ప్రతి ఒక్కరి app acitivities (APEKX) గమనించబడతాయి.
మనం చేయవలసినది NAS/SLAS రిపోర్టులను వీడియో , పి‌డి‌ఎఫ్ ,రూపం లో ఉన్నవాటిని రోజువారీ ప్రణాలికగా అభ్యసించవలసి ఉంటుంది.
➤చివర గా ఆన్లైన్ లోనే మనకు ఒక ప్రశ్నా పత్రము ఇవ్వబడుతుంది . అందులో మనం జవాబు చేయవలసి ఉంటుంది.

Download...Proceedings of Online course on APeKX DISKHA to all teachers in the Andhrapradesh

Previous
Next Post »
0 Komentar

Google Tags