Vontimitta - Kodandarama Temple
ఒంటిమిట్ట - కోదండ
రామాలయం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన
ఒంటిమిట్టలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడి
మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాలో కడప నుంచి రాజంపేటకు వెళ్ళే
మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము
ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది.
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ
విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఈ ఆలయమున్న ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాచలంగా
పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా
కార్యక్రమాలను నిర్వహించుచున్నది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున
పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.
Download
Details about Vontimitta, Kodandarama Temple in PDF
0 Komentar