Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Voting through the Election Duty Certificate (EDC) in the polling duties Staff ll General Elections-2019

Voting through the Election Duty Certificate (EDC) in the polling duties Staff ll General Elections-2019

పోలింగ్ విధులలో ఉన్న సిబ్బంది Election Duty Certificate (EDC) ద్వారా ఓటు వేయడానికి వచ్చినప్పుడు ప్రిసైడింగ్ అధికారి తీసుకోవలసిన చర్యలు :
i)EDC copy పై ఓటరు సంతకం: EDC అందజేసిన వ్యక్తియొక్క సంతకాన్ని అదే EDC పైన తీసుకోండి.
ii)ఓటరు లిస్టు మార్కుడ్ కాపీ లో EDC ఓటరు వివరాల నమోదు: మీ వద్ద ఉన్న మార్కుడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ లో చివరి క్రమ సంఖ్య తరువాత తదుపరి క్రమ సంఖ్య వేసి EDC ఓటరు వివరాలు నమోదు చేయండి.
iii) EDC కాపీని మొదటి పోలింగ్ అధికారి వద్ద ఉంచాలి. (పోలింగ్ అనంతరం ఈ EDC లను Form 12-B  coverలో ఉంచి, NON STATUTORY COVERS లో ఉంచాలి)
iv)ఓటర్ల రిజిస్టరు 17-A లో కాలమ్-2 మరియు రిమార్కుల కాలమ్ లలో EDC ఓటరు వివరాల నమోదు: తదుపరి ఓటర్ల రిజిస్టరు 17-A లో ఓటరు క్రమసంఖ్యకు నిర్దేశించిన కాలం నెం.2 లో EDC ఓటరు యొక్క క్రమసంఖ్య, పార్ట్ నంబరు, అసెంబ్లీ సెగ్మెంటు నంబరును నమోదు చేయాలి. ఉదాహరణకు EDC ఓటరు యొక్క అసలు ఓటు  దేవరకొండఅసెంబ్లీ సెగ్మెంటులో పార్ట్ నంబర్ 415 క్రమసంఖ్య 25 లో కనుక ఉంటే, 17-A కాలం నెం.2 లో అతని వివరాలు “415/25/DEVARAKONDA" గా నమోదు చేయాలి.
v)అలాగే ఓటర్ల రిజిస్టరు 17-A రిమార్కుల కాలం లో “EDC VOTER” గా రాయాలి.
vi)EDC ఓటర్ల వివరాలు ప్రిసైడింగ్ అధికారి డైరీలో నమోదు: ప్రిసైడింగ్ అధికారి డైరీ లో 13వ ఐటెమ్ లో EDC చూపి ఓటు వేసినవారి మొత్తం సంఖ్యను నమోదు చేయాలి.
vii)Form 17C (Account of Votes Recorded) ఐటెమ్ నంబర్ 1 లో నమోదు: Form 17C (Account of Votes Recorded) ఐటెమ్ నంబర్ 1 లో పోలింగ్ కేంద్రానికి కేటాయించబడిన మొత్తం ఓటర్ల సంఖ్యలో మార్కుడ్ కాపీలో చూపిన ఓటర్ల సంఖ్య మరియు EDC ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న మొత్తం ఓటర్ల సంఖ్యను కలిపి రాయాలి.
ఉదాహరణకు ఓటర్ల జాబితా ప్రకారం మీ పోలింగ్ కేంద్రానికి కేటాయించబడిన మొత్తం ఓటర్ల సంఖ్య 1125 మరియు EDC ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 9 అయితే Form 17C Item No. 1 లో మొత్తం ఓటర్ల సంఖ్య “1134 (1125+ EDC 9)” గా  రాయాలి.
viii)EDC ద్వారా ఓటు వేసే ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఏజంట్లు హాజరు స్థితిలో ఉన్నప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి.
ix) మీకు ప్రత్యేకంగా అందజేయబడిన BOOKLET లో కూడా EDC ఓటర్ల వివరాలు రాయాలి.

Voting through the Election Duty Certificate (EDC) in the polling duties Staff / General Elections-2019 / ఎలక్షన్స్-2019 / useful information for election process-2019 / Andhrapradesh Assembly elections-2019 / General elections useful information  / Elections -2019 / Telangana Parlament elections-2019 / Andhrapradesh Parlament elections-2019 / Parlament elections-2019 / Useful information for PO, APO & OPO / Polling officers useful information
Previous
Next Post »
0 Komentar

Google Tags