Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

About new PRC

New PRC News

*💥11వ,పే రివిజన్ కమీషన్ (PRC) గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*
*GO.RT.No.2806 Dt:12-12-2019*
–------------------------
PUBLIC SERVICES – 11th Pay Revision Commission – Extension of term for a further period of two months upto 31st January, 2020 – Orders – Issued.

➤29 శాతం ఫిట్‌మెంట్‌?
➤కనీస వేతనం 21వేలకు పెరిగే చాన్స్‌..!
➤సిద్ధమవుతున్న పీఆర్సీ నివేదిక
➤కొత్త ప్రభుత్వానికి ఇవ్వనున్న సంఘం
➤రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 29శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు పీఆర్సీ నివేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. 2015లో వీరికి ఇచ్చిన 42శాతం ఫిట్‌మెంట్‌తో పోలిస్తే ఇది తక్కువే. ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 20శాతం మధ్యంతర భృతి వచ్చేనెల 1నుంచి అమల్లోకి వస్తుంది. 2015 పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.13,000, గరిష్ఠ వేతనం రూ.1,10,850గా ఉంది. ప్రస్తుతం 29శాతం ఫిట్‌మెంట్‌ను అమలుచేస్తే కనీస వేతనం రూ.21,000కు గరిష్ఠ వేతనం రూ.1,86,510కి చేరనుంది. దీనిప్రకారం రేట్‌ ఆఫ్‌ ఇంక్రిమెంట్‌ 3శాతానికి కొంచెం ఎక్కువగా ఉండనుంది. వార్షిక ఇంక్రిమెంట్‌ కనిష్ఠంగా రూ.640నుంచి గరిష్ఠంగా రూ.4,450కి పెరగనుంది. 10వ పీఆర్సీ ప్రకారం కనీస వార్షిక ఇంక్రిమెంట్‌ రూ.390ఉండగా, గరిష్ఠ వార్షిక ఇంక్రిమెంట్‌ రూ.2,520గా ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు 30- 60శాతం ఫిట్‌మెంట్‌ను కోరాయి. ఈ ప్రతిపాదనలతో పాటు పెరుగుతున్న ధరలను అంచనా వేస్తూ, ఆర్థిక నిపుణులతో పలు దఫాల చర్చల అనంతరం ఫిట్‌మెంట్‌ను 29శాతంగా నిర్ణయించినట్టు తెలిసింది. 

➤ఎవరికి వర్తిస్తుంది?
రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థలు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ, జేఎన్‌టీయూల్లో బోధనేతర సిబ్బంది, వర్క్‌చార్జ్‌డ్‌ ఉద్యోగులు, ఫుల్‌టైమ్‌ కంటింజెంట్‌ ఉద్యోగులు కమిషన్‌ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది వ్యవహారాలు దీని పరిధిలోకి రావు.
29 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే మాస్టర్ స్కేల్ ఎలా ఉండబోవు చున్నదో సతీష్ దాసరి , శ్రీకాకుళం జిల్లా గారి విశ్లేషణ ఒక సారి గమనిస్తే ....
Previous
Next Post »
0 Komentar

Google Tags