పాఠశాలల్లో
అల్పాహారం-మెనూ
పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో ఇకనుంచి
మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారం అందించడానికి రంగం సిద్ధమవుతున్నది. ఈ
విద్యా సంవత్సరం నుండే అల్పాహారాన్ని అందించటానికి విద్యాశాఖ ఏర్పాట్లు
చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడం వల్ల ఎక్కువ
మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. విద్యార్థులు బడి వైపు ఆకర్షితులు
కావడానికి మధ్యాహ్న భోజన పథకం ఒక కారణం. అయితే కొంతమంది విద్యార్థులు ఉదయం
అల్పాహారం తీసుకోకుండా పాఠశాలకు వచ్చేస్తున్నారు. దీనివల్ల పోషకాహార లోపం విద్యార్థులలో
తలెత్తుతుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ చేసిన ప్రతిపాదనలకు ఇటీవల కేంద్ర
ప్రాజెక్టుల అనుమతుల బోర్డు ఆమోదం తెలిపింది. అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనానికి
566 కోట్లు కేటాయించింది. ఇప్పుడు అల్పాహారం కూడా ఇవ్వనున్నడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే
అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్పాహార మెనూ క్రింది విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఈనాడు దినపత్రిక మే:21 & మే 30 తేదిలలో వచ్చిన సమాచారం ఆధారంగా....
Breakfast in Government schools, breakfast menu , breakfast at Andhrapradesh government schools, implementation of break fast in ap government schools, download freak fast menu
అల్పాహార మెనూ..!
|
|
సోమవారం
|
2 ఇడ్లీ-
సాంబార్, చట్నీ
|
మంగళవారం
|
2 దోశలు
|
బుధవారం
|
2 ఇడ్లీ-
సాంబార్, చట్నీ
|
గురువారం
|
ఉప్మా
|
శుక్రవారం
|
2 దోశలు
|
శనివారం

0 Komentar