వేసవిలో సంపాదిత సెలవులు
➤పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను
వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను
"సంపాదిత సెలవులు" అందురు.
➤15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b)
ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.
➤వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు, జనాభా
గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ, పరీక్షలు
మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.35 Dt: 16-1-1981, G.O.Ms.No.151 Dt: 14-11-2000, G.O.Ms.No.174 Dt: 19-12-2000)
➤వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా
పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.114 Dt: 28-4-2005)
➤సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత
పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు,ఉన్నత
పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి
సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.
(Rc.No.362 Dt: 16-11-2013)
➤వేసవి సెలవులు 49 రోజులు ప్రకటించిన
సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:
సూత్రం: డ్యూటీ కాలము x 1/11-(365x1)/11-(27xవాడుకున్న
వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6
➤పనిచేసిన రోజులు సంపాదిత
సెలవులు క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చును.
Earn leaves in Summer holidays, Earn leaves in Summer holidays details, Earn leaves table, Earn leaves formula for employees, Earn leaves calculation table for summer holidays, How to count earn leaves in Summer holidays, earn leaves details, els table, els calculation table, els table for summer holidays
0 Komentar