ప్రధానమంత్రి విద్యాలక్ష్మీ
ఎడ్యుకేషన్ లోన్
అప్లై చేయు విధానం
ఆర్థిక పరిస్థితి సరిగా
లేని విద్యార్థులకోసం కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మీ ఎడ్యుకేషన్
లోన్ స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. ఆర్థికస్థోమత తక్కువగా ఉన్నవారు పైచదువులు
చదివేందుకు ఈ లోన్ సదుపాయం చక్కగా ఉపయోగ పడుతుంది. ఇందులో 22 వేర్వేరు
విద్యారుణాలున్నాయి.
లోన్ పొందేందుకు
అర్హతలు
ఇంటర్మీడియెట్ పూర్తి
చేసి ఉండాలి.
విద్యార్థులు ఖచ్చితంగా
భారతీయులై ఉండాలి.
విద్యార్థుల
తల్లీదండ్రులు ఆదాయ సర్టిఫికెట్స్ ఉండాలి.
లోన్ ఎలా అప్లై
చేయాలంటే...?
ముందుగా www.vidyalakshmi.co.in వెబ్‌సైట్‌లో మన
పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి.
మన డీటెయిల్స్‌ని బట్టి
ఎంతవరకూ లోన్ పొందొచ్చో తెలుసుకోవచ్చు. మన వివరాలు చూసి
పరీక్షించిన బ్యాంక్స్ మనం లోన్ తీసుకునేందుకు అర్హులో కాదో తెలియజేస్తాయి. ఒకవేళ మనం అర్హులైతే
నగదు నేరుగా మనం ఇచ్చిన అకౌంట్‌లో చేరుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ హోల్డ్‌లో
ఉంటే.. మన నుంచి బ్యాంక్ అదనపు వివరాలు కోరుతుందని అర్థం. ఆ సమయంలో ఏమైనా వివరాలు
మనం పొందుపరిచామో లేదో ఒకసారి మళ్లీ చెక్ చేసుకోవాలి. ఈ స్కీమ్‌లో 36 బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఒకే సారి మూడు బ్యాంకుల ద్వారా లోన్‌కి అప్లై చేయొచ్చు.
అందులో ఏ బ్యాంకులో తక్కు వడ్డీ ఉంటే అందులోనుంచి తీసుకోవచ్చు.
Vidya Lakshmi Portal provides single window for Students to access information about various loan schemes provided by banks and make applications for Educational Loans.
0 Komentar