Andhrapradesh Village secretariat
details
గ్రామ సచివాలయం- వివరాలు
➤కనీసం రెండు వేల జనాభాకు ఒక గ్రామ
సచివాలయం
➤కొత్తగా మరో లక్షన్నర ఉద్యోగాలు
ప్రభుత్వం
కొత్తగా ప్రవేశపెట్టనున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో
పదకొండు చొప్పన ఉద్యోగాలను కొత్త వాళ్లతోనే భర్తీ చేయనున్నారు. గ్రామ, వార్డు
సచివాలయాలకు అనుసంధానంగా ఉండే వలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల
నుంచి తీసుకొచ్చే వినతులను 72 గంటల్లో సంబంధిత శాఖలను సంప్రదించి పరిష్కరించడమే పదకొండు మంది
ఉద్యోగుల ప్రధాన కర్తవ్యం.
ఒక్కో గ్రామ సచివాలయం లో 12 శాఖలకు సంబంధించి
సేవలు అందించటానికి అందుబాటులో 11 మంది సిబ్బంది ఉండనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 13,065 గ్రామ
పంచాయితీలను పంచాయితీరాజ్ శాఖ 12,671 గ్రామ సచివాలయాలుగా వర్గీకరించింది. తొలుత 9,480 గ్రామ
సచివాలయాలను ఏర్పాటు చేయాలని భావించినా ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ
సచివాలయం చొప్పున ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన
నేపథ్యంలో వీటిని 12,671కి పెంచుతూ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇతర కీలకాంశాలు
➤గ్రామ సచివాలయాల్లో నియమించే వారిని
పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణిస్తారు. ఉద్యోగంలో నియమించిన మొదటి
రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా ఉంచి గౌరవ వేతనం అందజేస్తారు.
➤గ్రామ సచివాలయాల సిబ్బందిని జిల్లా ఎంపిక
కమిటీ ద్వారా నియమిస్తారు. వీరికి సంబంధిత శాఖలు తగిన విధంగా ప్రత్యేక శిక్షణ
ఇస్తాయి.
➤గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది
పర్యవేక్షణకు సంబంధిత శాఖలు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకోవాలి.
➤కేవలం సంబంధిత శాఖ వ్యవహారాలకే పరిమితం
కాకుండా గ్రామ సచివాలయ పరిధిలో ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉండాలి.
ప్రతి గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు
ఒక్కో గ్రామ సచివాలయంలో పంచాయితీ కార్యదర్శి ఆధ్వర్యంలో మొత్తం 11 మంది చొప్పున ఉద్యోగులు పనిచేసేలా ప్రణాళిక
రూపొందించారు. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే చోట మరికొంత మందిని అదనంగా నియమించే
అవకాశం ఉందని పంచాయితీరాజ్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ సచివాలయాల్లో
పనిచేసే వివిధ రకాల ఉద్యోగుల పర్యవేక్షణ బాధ్యతలు పంచాయితీరాజ్, రెవెన్యూ, వైద్యారోగ్య, పశుసంవర్ధక,
మహిళా శిశు సంక్షేమం, పంచాయితీరాజ్
ఇంజనీరింగ్ విభాగం, వ్యవసాయం, ఉద్యానవన,
సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో
ఉంటాయి.
గ్రామ
సచివాలయం లో ఉండే ఉద్యోగుల హోదా , విధులు & పర్యవేక్షణ శాఖలు
0 Komentar