AP DSC-2018 Recruitment schedule
డీఎస్సీ పోస్టుల భర్తీకి
ప్రాథమిక షెడ్యూల్ విడుదల
డీఎస్సీ-2018కి సంబంధించిన
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక షెడ్యూల్‌ను రూపొందించింది. ప్రిన్సిపల్
పోస్టులు రాష్ట్రస్థాయివి కాగా.. పీజీటీ, టీజీటీ జోనల్
స్థాయి పోస్టులు. ఇక స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులు
జిల్లాస్థాయి ఉద్యోగాలుగా భర్తీచేయనున్నారు.
షెడ్యూల్ ఇలా..
➡ప్రిన్సిపాళ్ల
పోస్టుల షెడ్యూల్..
* ఈనెల 20న పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో
ఎంపిక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. దాన్ని 21న ఎంపిక
కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది.
* 22, 23 తేదీల్లో అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ
పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
* 24, 25 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.
* జులై 4న తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. 5, 6
తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.
* 7న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు.
➡పోస్టు
గ్రాడ్యుయేట్ టీచర్స్..
ఆదర్శ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు,
ఏపీ రెసిడెన్షియల్ సొసైటీల్లో పీజీటీ పోస్టులు భర్తీచేయనున్నారు.
* ఈనెల 27న ఎంపిక జాబితాను
ప్రకటిస్తారు. 29, 30న అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ
పత్రాలను ఆప్‌లోడ్ చేయాలి.
* జులై 11న ఎంపికైన అభ్యర్థుల
తుది జాబితాను ప్రకటిస్తారు. 12, 13న వెబ్ ఆప్షన్లు. 14న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు.
➡ట్రెయిన్డ్
గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)
ఆదర్శ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ
పాఠశాలలు, ఏపీరెసిడెన్షియల్ సొసైటీల్లో టీజీటీ పోస్టులు
భర్తీచేయనున్నారు.
* జులై 11న ఎంపికైన అభ్యర్థుల
జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. 13, 14న అభ్యర్థులు
విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. 27న తుది
జాబితా ప్రకటిస్తారు.
* 28, 29న వెబ్
ఆప్షన్లు. ఆగస్టు 1న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు.
➡స్కూల్
అసిస్టెంట్ పోస్టులకు..
అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జులై 17న అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
* 20, 21న
అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
* ఆగస్టు 1న తుది జాబితా ప్రకటన. 2,
3న వెబ్ ఆప్షన్లు. 5న పోస్టింగ్ ఆర్డర్లు
ఇస్తారు.
➡సెకండరీ
గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)
* ఆగస్టు 2న అభ్యర్థుల ఎంపిక
జాబితా ప్రకటన
* 6, 7 తేదీల్లో విద్యార్హత ధ్రువీకరణ పత్రాల అప్‌లోడ్
* 29న తుది జాబితా ప్రకటన. ఆగస్టు 30, సెప్టెంబరు1న వెబ్ ఆప్షన్ల నమోదు
* సెప్టెంబరు 4న పోస్టింగ్ ఆర్డర్లు
జారీ.
PET results sir exam paper leke ayendi annaru pet exm Malli.peatandi
ReplyDelete