Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Village Town Volunteer Recruitment Notification Details


ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు వాలంటీర్ల నియామక వివరాలు
గ్రామ వాలంటీర్ జాబ్  ఇంటర్వ్యూ కోసం ప్రశ్నావళి / బిట్ బ్యాంక్
➤పోస్ట్ పేరు: గ్రామ , వార్డు వాలంటీర్లు
➤విద్యార్హతలు: వార్డు వాలంటీర్లు-ఇంటర్మీడియట్
                గ్రామ వాలంటీర్లు- ఇంటర్మీడియట్,
                గిరిజన ప్రాంత వాలంటీర్లు- 10వ తరగతి
➤వేతనం: రూ. 5,000 + ప్రయాణ ఖర్చులు
➤వయస్సు:  తేది: 30.06.2019 నాటికి 18 నుండి 35 సం. మధ్య వయస్సు వారు.
➤పోస్టుల సంఖ్య: 1,80,543 
➤రిజర్వేషన్లు: ఎస్సీ , ఎస్టీ, బీసి, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు (ప్రతి కేటగిరిలో మహిళలకు 50%)
➤ఎంపిక విదానం: విద్యా అర్హత మార్కుల ఆధారం గా మరియు
-ఏ గ్రామంలో, పట్టణ వార్డులో వాలంటీర్ల నియామకానికి అక్కడి స్థానికులే అర్హులు.
-
 ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలలో పని చేసి ఉండటం, చేస్తుండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు. నాయకత్వ లక్షణాలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం, తమకు కేటాయించిన పనిని నిబద్ధత, నిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండడం వంటివి అదనపు అర్హతగా పరిగణిస్తారు.
- వలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు. 
-
 ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో  జరుగుతుంది.
-
 అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వూ్య కోసం పిలుస్తారు.
-
 వలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ చైర్మన్‌గా, తహసీల్దార్, జిల్లా కలెక్టరు నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గా, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీ కమిటీ సభ్యులుగా ఉంటారు. 
-
 మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వూ్యలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. 
-
 వలంటీర్లగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది.
-
 ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గ్రామవార్డు వలంటీర్‌ వ్యవస్థ ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావాల్సిన కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది. 
➤దరఖాస్తు ఫీజు: ఉచితం (తుది నిర్ణయం ప్రకటించవలసి ఉన్నది.)
➤కావలసిన సర్టిఫికెట్స్: ఆధార్ కార్డు, పుట్టిన తేది దృవపత్రం లేదా 10వ తరగతి సర్టిఫికేట్ , సంబందిత అర్హతల సర్టిఫికెట్స్ , కుల దృవీకరణ పత్రం , వికలాంగులైతే PHC సర్టిఫికేట్
➤ముఖ్య ఉద్దేశం: గ్రామాల్లో, పట్టణాల్లో 50 కుటుంబాలకో వాలంటీర్ ను నియమించి సుమారు 2 లక్షల మంది యువతీ, యువకులకు ఉపాధి కల్పించడం.


➤ముఖ్య తేదీలు
నోటిఫికేషన్ జారీ: 22 జూన్
దరఖాస్తులు స్వీకరణ: 24 జూన్  - 5 జూలై (వార్డు వాలంటీర్ల కు జూలై 10 వరకు) 
దరఖాస్తుల పరిశీలన: జులై 10 వరకు 
 జులై 11 నుండి జులై 25 వరకు మండల స్థాయిలో ఇంటర్వ్యూ లు
 ఎంపికైన వారి జాబితా వెల్లడి : ఆగష్టు 1
 ఆగస్టు 5- 10 ఎంపికైన వలంటీర్లకు శిక్షణ
 ఆగస్టు 15 రోజున అధికారికంగా విధుల్లో చేరడం
√జిల్లాల వారీగా ఖాళీలు
శ్రీకాకుళం:11,924
విజయనగరం:10,012
విశాఖపట్నం:12,272
తూర్పుగోదావరి:22,000
పశ్చిమగోదావరి:17,881
కృష్ణా:14,000
గుంటూరు:17,550
అనంతపురం:14,007
చిత్తూరు:15,824
కర్నూలు:12,045
కడప:9,322
నెల్లూరు:11,342
ప్రకాశం:14,106
➤ముఖ్య విధులు
- తనకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా పని చేయాలి. 
- వలంటీరుగా నియమితులయ్యే వారు తమకు కేటాయించిన ప్రతి 50 ఇళ్ల వద్దకు తరుచూ వెళ్లి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి స్థితిగతులపై సమాచారం సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని గ్రామవార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారికి అందజేయాలి.
- తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ,వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి.
​​​​​​​- తమ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేయాలి.
​​​​​​​- 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి, వారికి ఆ పథకం అందనప్పుడు దానిపై వారికి అవగాహన కలిగించి, లబ్ధిదారునిగా ఎంపికకు సహాయకారిగా ఉండాలి.
​​​​​​​- గ్రామ, వార్డు సచివాలయం ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు హాజరవుతూ.. తనకు కేటాయించిన 50 ఇళ్ల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్‌ను తయారు చేసి అధికారులకు అందజేయాలి. 
- ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్రా సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో ఉంచుకోవాలి.
​​​​​​​- తన పరిధిలోని 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా.. విద్య, ఆరోగ్య పరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి. వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేస్తుండాలి.
​​​​- తన పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం పనిచేయాలి.

➤ఎలా అప్లై చేయాలి
STEP 1: ముందుగా gramavolunteer.ap.gov.in ను ఓపెన్ చేసి మీకు అర్హత ఉందొ లేదో తెలుసుకోండి.
STEP 2: అర్హత ఉంటే మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేయండి.OTP వస్తుంది. OTP ఎంటర్ చేశాక VERIFY పై క్లిక్ చేయండి.
STEP 3: తరువాత పేజి లో ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ ( RATION CARD/ VOTER CARD/ RESIDENCE CERTIFICATE/ BANK PASS BOOK ఏదో ఒకటి) అప్లోడ్ చేయాలి.
STEP 4: తరువాత మీ యొక్క ఎడ్యుకేషనల్  క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ అర్హత ని బట్టి పదవ, ఇంటర్ , డిగ్రీ డీటెయిల్స్ తో పాటుగా సంభందిత పత్రాలను అప్లోడ్  చేయాలి.
STEP 5: తరువాత మీ యొక్క కులము ఎంటర్ చేయాలి. OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.
చివరగా APPLY పై క్లిక్ చేయండి. మీకు ఒక నెంబర్ reference నెంబర్ వస్తుంది. దానిని రాసి ఉంచుకోవలెను.
గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి సంబంధిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
Click here for AP government official website
➤ నోటిఫికేషన్ కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
➤ వెబ్ సైట్ లో ఎలా అప్లై చేయాలో తెలిపే యూసర్ మాన్యువల్ కొరకు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
Check Your Grama/ward volunteer Application Status
➤Required information to check the application status
Aadhaar Number or Mobile Number or Application Id 
AP Village Town Volunteer Recruitment Notification Details, Andhrapradesh Village volunteer recruitment details, Andhrapradesh town / ward volunteer recruitment details, AP Village Town / ward Volunteer Recruitment educational qualification, age, procedure, salary Details, How to fill Andhrapradesh village town / ward volunteers application, Andhrapradesh village ward volunteers notification date,  Andhrapradesh village ward volunteers notification recruitment procedure,  AP Grama Volunteer Recruitment Notification 2019,  Apply Online For 4 Lakh AP Grama Volunteer Jobs, AP Grama Volunteer Jobs – Application Form, Dates,  AP Grama Volunteer Recruitment notification 2019, AP Village Volunteer Eligibility Criteria 2019, AP Grama Volunteer Exam Important Dates, AP Village Volunteer Salary Details, AP Village Volunteer notification Details
Previous
Next Post »

6 comments

Google Tags