"నో స్కూల్ బ్యాగ్ డే" ప్రభుత్వ రంగ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం.
ప్రధానంగా 1 నుంచి 5 వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షించేందుకు వారిలో
మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు సృజన - శనివారం సందడి కార్యక్రమం అమలు చేయాలని
ప్రభుత్వం నిర్ణయం.
నాలుగు సెషన్లలో అమలు ఇలా...
సెషన్-1: 1,2 తరగతులకు పాడుకుందాం
అంశంలో అభినందన గేయాలు, దేశభక్తి గీతాలు , జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు
మొదలుగునవి పిల్లలతో పాడించాలి. 3,4,5 తరగతులకు సృజన అనే
అంశంలో బొమ్మలుగీయడం, రంగలువేయడం, బంకమట్టి,
క్లేవాక్స్ ఉపయోగించి బొమ్మలు, నమూనాలు చేయడం,
మాస్కులు చేయడం, అలంకరణ వస్తువులు తయారీ ,
ఒరిగామి, నాటికలు, స్ర్కిప్టులు,
మైమ్, ఏకపాత్రలు, నాట్యం,
అభినయం చేయాలి.
సెషన్-2 : 1,2 తరగతులకు మాట్లాడుకుందాం
అను అంశంలో కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు
పంచుకోవడం, పొ డుపు కఽథలు, పజిల్స్ ,
సరదా అటలు ఆడటం చేయించాలి. 3,4,5 తరగతులకు
తోటకు పోదాం అంశంలో పాఠశాలల్లో సాగు చేస్తున్న బడి తోటలో పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు
వేయడం చేయాలి. పరిశుభ్రం చేద్దాం అంశంలో పాఠశాల అవరణ, తరగతి
గదులు శుభ్రం చేసుకోవాలి.
సెషన్-3: 1,2 తరగతులకు నటిద్దాం
అంశంలో నాటికలు, స్ర్కిప్టులు, మైమ్,
ఏకపాత్రలు, నాట్య, అభినయం
చేయడం , చూసి వద్దాం కార్యక్రమాలు. 3,4,5 తరగతులకు చదువుకుందాం అంశంలో పాఠశాల గ్రంథాలయంలో నచ్చిన పుస్తకాలను
ఎంపిక చేసుకోని చదవడం, చర్చించడం, కథలు
చదవడం, రాయడం చేయాలి.
సెషన్-4: 1,2 తరగతులకు సృజన అంశంలో బొమ్మలు
గీయడం, రంగులు వేయడం, బంకమట్టి,
క్లేవాక్స్ ఉపయోగించి బొమ్మలు, నమూనాలు,
మా స్కులు చేయడం, అలంకరణ వస్తువులు తయారీ,
వరిగామి. 3,4,5 తరగతులకు ప్రాథమిక ఆరోగ్య
కార్యకర్త, పంచాయతీ అధికారి, కుటుం బ
సంక్షేమ అధికారి, పోస్టాఫీసు, వ్యవసాయదారుడు,
వ్యాపారి, మొదలైన వారిని బడికి ఆహ్వానించి
పిల్లలతో మాట్లాడించాలి.
0 Komentar