Semester system in school education..!
దేశంలో విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలంటూ నూతన విద్యా విధానం–2019 ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ సారథ్యంలోని కమిటీ... పాఠశాల విద్యలోనూ సెమిస్టర్ విధానం తీసుకురావాలని ప్రతిపాదించింది. సెకండరీ విద్య పరిధిలోకి 8వ తరగతి నుంచి 12వ తరగతిని తీసుకొచ్చి ఏటా రెండు సెమిస్టర్ల పద్ధతిని అమలు చేయాలని పేర్కొంది. అలాగే వృత్తివిద్యను కూడా పాఠశాల విద్యలో భాగంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లతో అనుసంధానించాలని, వీలైతే ఆ రెండింటినీ ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తెచ్చి స్కూల్ కాంప్లెక్స్ పేరుతో నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌తోపాటు క్లాస్‌రూమ్ డెమో అమలును తప్పనిసరి చేయాలని సూచించింది.
కమిటీ సిఫారసుల్లో మరికొన్ని ప్రధానాంశాలు...
సెకండరీ విద్యగానే కొనసాగింపు..
►హయ్యర్
సెకండరీ విద్యను, సెకండరీ విద్యను కలిపి సెకండరీ విద్యగానే
కొనసాగించాలి. అందులో సెమిస్టర్ విధానం అమలు చేయాలి. 9, 10, 11, 12 తరగతుల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలి.
►హయ్యర్
సెకండరీ లేదా జూనియర్ కాలేజీ విధానం తొలగించాలి. 11వ తరగతి,
12వ తరగతి విధానం అమలు చేయాలి. దాన్నీ సెకండరీ విద్య పరిధిలోకి
తేవాలి.
►కనీసం 5వ
తరగతి వరకు మాతృభాషలోనే బోధన కొనసాగించాలి. వీలైతే 8వ తరగతి
వరకు కూడా మాతృభాషనే అమలు చేయాలి. వృత్తి విద్యను పాఠశాల విద్యలో భాగంగా
కొనసాగించాలి.
►అంగన్‌వాడీ
కేంద్రాలను ప్రీస్కూళ్లతో విలీనం చేయాలి. అవకాశం ఉన్న చోట అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రీ
స్కూళ్లను, ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి తేవాలి. స్కూల్
కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసి నిర్వహించాలి.
►ఉపాధ్యాయ
నియామకాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షతోపాటు 5–7 నిమిషాల క్లాస్‌రూమ్
డెమోను కచ్చితంగా అమలు చేయాలి.
►ఉపాధ్యాయ, విద్యార్థి
నిష్పత్తిని 1:30గా కొనసాగించాలి.
ఎన్నికల విధులకు టీచర్లను దూరం చేయాల్సిందే...
►ప్రతిభావంతులైన
వారు ఉపాధ్యాయ విద్యలోకి వచ్చేలా ప్రోత్సాహించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు
చెందిన వారికి మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్ ఇస్తూ దేశంలో ఎక్కడైనా నాలుగేళ్ల
ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చదివేలా ప్రోత్సహించాలి.
►టీచర్లకు
బోధనతో సంబంధంలేని ప్రభుత్వ పనులను తగ్గించాలి. ప్రస్తుతం టీచర్లు ఆ పనులతో బిజీగా
ఉంటున్నారు. వాటిని నుంచి దూరం చేయాలి. ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయవద్దు.
పాలన పనులను అప్పగించవద్దు. వారు పూర్తిగా బోధన, అభ్యసన పనుల్లోనే
నిమగ్నం అయ్యేలా చేయాలి.
►ప్రతి
టీచర్ తన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కనీసం 50 గంటలు
కేటాయించేలా చూడాలి.
►ప్రైవేటు
పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ అనే పదాన్ని వినియోగించకూడదు. ఆ పదం కేవలం
ప్రభుత్వ,
ఎయిడెడ్ పాఠశాలలకే ఉండాలి.
►ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా
తగిన ఏర్పాట్లు చేయాలి.తేది: 4-6-2019 నాటి సాక్షి దినపత్రిక లో వచ్చిన కధనం ఆధారంగా...
0 Komentar