The CPS can be annulled!
సిపిఎస్ రద్దు చెయ్యొచ్చు!
- విచక్షణాధికారం రాష్ట్ర సర్కారుదే!
- లేకపోతే ఒపిఎస్‌తో సమానమైన లబ్ది చేకూర్చాలి
- ప్రభుత్వానికి టక్కర్ కమిటీ నివేదిక
- నేడు మంత్రివర్గంలో చర్చ
కంట్రిబ్యూటరీ
పింఛను విధానాన్ని రద్దు చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉరదని నిపుణుల
కమిటీ తేల్చి చెప్పింది. మాజీ సిఎస్ ఎస్‌పి టక్కర్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన
నిపుణుల కమిటీ ప్రభుత్వానికి 141 పేజీల నివేదికను సమర్పించినది. సిపిఎస్‌ను రద్దు చేసుకునే అధికారం
రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెబుతూనే రెండు ఆప్షన్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచినది. అలాగే తన నివేదికలో ఓపిఎస్‌లో ఉద్యోగులు పొందుతున్న లబ్దిలో నాలుగో వంతు
(25శాతం) మేరకే సిపిఎస్ ఉద్యోగులు పొందుతున్నారని నిగ్గు తేల్చినది. వాస్తవానికి ప్రభుత్వం భరిస్తున్న 10 శాతం వాటా మేరకు సిపిఎస్ ఉద్యోగులకు 25 శాతం మేలు కలుగుతోందని, దీనిని 20 శాతానికి పెంచినా మొత్తం లబ్ది 50 శాతం వరకే ఉంటుందని కమిటీ
అభిప్రాయపడినది. ఈ నివేదిక ఆధారంగానే సోమవారం జరిగే తొలి మంత్రివర్గ సమావేశంలో
దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు.
1990 దశకంలో నెలకొన్న ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో నూతన ఆర్థిక సంస్కరణల్లో
భాగంగా కేంద్ర ప్రభుత్వం సిపిఎస్‌ను తెరపైకి తీసుకువచ్చింది. దీనిని అనేక రాష్ట్ర
ప్రభుత్వాలు కూడా ఆమోదించి అమలు చేయడం ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో ఈ విధానాన్ని ఆమోదించలేదు.
కేరళలో ఆనాటి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం తిరస్కరించినా ఆ తరువాత వచ్చిన యుడిఎఫ్
సర్కారు సిపిఎస్‌ను అమలు చేసింది. త్రిపుర మాత్రం గత ఏడాది సిపిఎస్‌కు ఆమోదాన్ని
తెలిపింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఈ విధానం 2004 నుండి కొనసాగుతున్నప్పటికీ
కొన్నేళ్లుగా దీనిని రద్దు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆరదోళనలు
చేస్తున్నారు. ఆ ఒత్తిడితోనే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన టక్కర్ కమిటీ తన
నివేదికను కొత్త ప్రభుత్వానికి అందచేసినది. దీనిపైనే సోమవారం నాటి మంత్రివర్గంలో
చర్చచింనున్నారు. కమిటీ తన నివేదికలో అనేక అంశాలను, రాష్ట్ర, దేశంలో నెలకొన్న పరిస్థితులను
వివరిస్తూనే కొన్ని సూచనలు చేసింది. కేంద్రం పెట్టిన విధానమే అయినప్పటికీ దానిని
వద్దనుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయని తేల్చి చెప్పింది. అలాగే
రెండు ఆప్షన్లు సూచించినది. సిపిఎస్‌ను పూర్తిగా రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయడం ఒక
ఆప్షన్ కాగా, సిపిఎస్‌ను కొనసాగిస్తూనే ఓపిఎస్‌లో
అందుతున్న లబ్దికి సమానమైన రీతిలో సిపిఎస్‌లోని వారికి కూడా వర్తింపజేయడం ఇంకో
ఆప్షన్‌గా పేర్కొన్నది.ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర
వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు సిపిఎస్ వల్ల లాభనష్టాలను కూడా నివేదికలో
పొందుపరిచినది. సిపిఎస్ రద్దు చేస్తూ ఉద్యోగుల పేరున ఏటా రూ.600 నురచి 700 కోట్లు వారి జిపిఎఫ్ ఖాతాల్లో జమ
చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఈ నగదును ఉపయోగించుకునే అవకాశం ప్రభుత్వానికి
ఉంటుందని కమిటీ పేర్కొన్నది. అలాగే ప్రస్తుతం సిపిఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు
తక్షణమే పింఛను ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదని స్పష్టం చేసింది. సిపిఎస్
కొనసాగించినా కూడా 2040 సంవత్సరం నాటికి మాత్రమే పింఛను భారం
ఉందని, అందువల్ల ఇప్పట్లో ప్రభుత్వానికి వచ్చే
లాభ నష్టాలు ఏమీ లేవని పేర్కొన్నది.
కాగా, ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని
సరళీకృతం చేస్తూ గతంలో ఉన్న పాత పింఛను విధానానికి సమానంగా లబ్ది కల్పించే ప్రయత్నం చేయాలని తన రెండో సూచనగా కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. స్వల్ప కాలిక
చర్యలో భాగంగా ప్రభుత్వ వాటాను ప్రస్తుతం వున్న పది శాతానికి అదనంగా నాలుగు నుంచి
పది శాతం వరకు పెంచాలని సూచించింది. ఇప్పటికే కేంద్రం పది శాతం నురచి 14 శాతానికి పెంచిన వైనాన్ని కమిటీ తన
నివేదికలో ప్రస్తావించినది. అలాగే సిఎస్ అధ్యక్షతన పింఛను నిధి నిర్వహణ
విభాగాన్ని ఏర్పాటుచేయాలని, ప్రతి ఉద్యోగికి కనీస మొత్తం అందేలా ప్రణాళిక రూపొందించాలని, సిపిఎస్ నుంచి ఓపిఎస్‌కు మార్చే
సమయంలో వచ్చే న్యాయ అడ్డంకులను అధిగమించేందుకు ముందుగానే ఆలోచన చేయాలని, అవసరమైతే చట్ట సవరణ చేయాలని
సూచించినది. ఇక దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలపైనా కమిటీ కొన్ని సిఫార్సులు
చేసింది. ఓపిఎస్ ఉద్యోగులకు ఇస్తున్న పిరఛనుకు సమానంగా లేదా దగ్గరగా సిపిఎస్
ఉద్యోగులకు లబ్ది కల్దుపించేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని, అది కూడా 2030 తరువాతే అవసరమవుతుందని కమిటీ
సూచించినది. అవసరం మేరకు పెన్షన్ కార్పస్ ఫండ్‌ను బడ్జెట్‌లో కేటాయించాలని
సూచించినది. సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఆరోగ్య పథకాన్ని వర్తిరపజేయాలని, ఇళ్లు, విద్య వంటి అంశాల్లో రుణ సౌకర్యాన్ని
కల్చాపించాలని, ఉద్యోగి తరువాత అతని భార్య, కుటుంబ సభ్యులకు పింఛను సౌకర్యం
విస్తరించాలన్న సూచనలతోపాటు మరికొన్ని సూచనలు చేసింది. వీటిపై సోమవారం
మంత్రివర్గంలో చర్చచింపనున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
మూలం: తేది :10-06-2019 ప్రజాశక్తి దినపత్రిక
0 Komentar